PM Modi: కాంగ్రెస్ 2జి స్కాం చేస్తే.. బీఆర్ఎస్ నీళ్ళ స్కాం అని ప్రధాని మోడీ అన్నారు. ఈ రోజు ఎన్నికల నగారా మోగుతుంది అని నేను టీవీలో చూసానని అన్నారు. ఎన్నికల తేదీలు ప్రకటించక ముందే ఎన్నికల పలితాలు ప్రజలు ముందే ప్రకటించారు… అబ్ కి బార్ చార్ సౌ పార్ (‘Ab ki baar char sau paar’) అని తెలిపారు. నాగర్ కర్నూల్ జన సముద్రం కనిపిస్తుందని, నిన్న సాయంత్రం అద్భుత మైన దృశ్యం మల్కాజ్ గిరిలో కూడా చూశానని మోడీ అన్నారు. బీజేపీ కి ఆశీర్వాదం ఇస్తున్నారని,అసెంబ్లీ ఎన్నికల సమయం లో ఇక్కడికి వచ్చాను… అప్పుడు ప్రజల్లో బీఆర్ఎస్ పైన ఉన్న కోపాన్ని చూసానని అన్నారు. ఇప్పుడు చూస్తున్నాను తెలంగాణ ప్రజలు మోడీ నీ మరో సారి ఆ పీఠం లో కూర్చోపెట్టాలని డిసైడ్ అయ్యారనీ.. మూడో సారి మోడీ సర్కార్ వస్తుందని అన్నారు.
Read also: Payal Rajput: బాత్ టబ్ లో మందు గ్లాసుతో రచ్చ చేసిన పాయల్.. వీడియో వైరల్..
గత పది ఏళ్ల లో తెలంగాణ అభివృద్ది మోడీ కి ప్రాధాన్యతగా ఉందన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ అనే ఇస్సురు రాయి మధ్యలో తెలంగాణ ఇరుక్కు పోయిందన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ కలిసి తెలంగాణ కలలను కల్లోలం చేశారన్నారు. కాంగ్రెస్ చెడు దృష్టి తెలంగాణ పై పడ్డదని తెలిపారు. ఈ రాష్ట్రాన్ని సర్వ నాశనం చేసేందుకు కాంగ్రెస్ కు 5 సంవత్సరాలు అవసరం లేదన్నారు. ఎక్కువ మంది ఎంపి లు గెలిస్తే కాంగ్రెస్ కు ఆ పని చేయడం కష్టం అవుతుందన్నారు. ఇక్కడ అన్ని సీట్లలో బీజేపీ గెలవాలని తెలిపారు. తెలంగాణ లో కోటి కి పైగా బ్యాంక్ ఖాతాలు, తెలంగాణ లో కోటి 50 లక్షల మందికి ఇన్సూరెన్స్, 67 లక్షల మందికి ముద్ర లోన్ లు ఇచ్చామన్నారు. 80 లక్షలకు పైగా అయుస్మాన్ కింద ఉన్నారని తెలిపారు. మాదిగ సామాజిక వర్గం బలోపేతం కూడా మోడీ గ్యారంటీ అని హామీ ఇచ్చారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ అవినీతి కుటుంబ పార్టీ లు అన్నారు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ లను ఆపార్టీలు అవమానించాయన్నారు.
Read also: YSRCP MLA Candidates Final List: వైసీపీ ఫైనల్ లిస్ట్.. ఎమ్మెల్యే అభ్యర్థులు వీరే..
అంబేడ్కర్ ను ఒడించాయి… ద్రౌపది ముర్మును ఒడించేందుకు శతవిధాల ప్రయత్నించాయన్నారు. డిప్యూటీ సీఎంకి ఎలా అవమానం జరిగిందో మనం చూసాము… ఆ నేతను కింద కూర్చో బెట్టారని తెలిపారు. కేసీఆర్ కు కొత్త రాజ్యాంగం కావాలి అట… కేసీఆర్ అంబేద్కర్ ను అవమానించారని గుర్తు చేశారు. దళిత బందు స్కీమ్ తో దళితులను మోసం చేశారు… కళ్ళలో దుమ్ము కొట్టారని మండిపడ్డారు. దళితున్ని సీఎం చేస్తా అన్నాడు… ఆ హామీని నెరవేర్చ లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అవినీతి కుంభకోణాల్లో అన్న తమ్ములు అన్నారు. కాంగ్రెస్ 2జి స్కాం చేస్తే బీఆర్ఎస్ నీళ్ళ స్కాం అని, ఈ రెండు పార్టీలు భూ మాఫియాకి సపోర్ట్ చేస్తారని తెలిపారు. బీఆర్ఎస్ పార్టీ రాష్ట్రం బయట ఉన్న దేశ వ్యతిరేక పార్టీ లతో కలిసి పనిచేస్తుందని, అవినీతి చేసిందన్నారు. రోజు వస్తున్న వార్తలు చూస్తున్నామని, ఒక్క అవినీతి పరుడు కూడా తప్పించుకోలేడని అన్నారు. ఈ యుద్ధంలో తెలంగాణ ఆశీర్వాదం కావాలన్నారు మోడీ. నాకు నమ్మకం ఉంది.. తెలంగాణ డబల్ డిజిట్ సీట్లు ఇస్తుందని తెలిపారు.
YSRCP Candidates List: ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు 50 శాతం సీట్లు..