Kavitha: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవితను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే… బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను ఈడీ అధికారులు అరెస్ట్ చేయడాన్ని మాజీ మంత్రి హరీశ్‌రావు తీవ్రంగా ఖండించారు. కవిత అరెస్ట్‌ను నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టాలని పార్టీ శ్రేణులకు హరీశ్‌రావు పిలుపునిచ్చారు. ఇవాళ ఆయా ప్రాంతాల్లో ధర్నాలు, నిరసనలు చేపట్టాలని కార్యకర్తలకు హరీశ్‌రావు విజ్ఞప్తి చేశారు. ప్రజా కోర్టులో కాంగ్రెస్, బీజేపీలకు శిక్ష తప్పదని హెచ్చరించారు. కోర్టు వేళలు ముగిసిన తర్వాత సోదాల పేరుతో వచ్చి అరెస్టు చేయడం సరికాదన్నారు.
అయినా న్యాయ వ్యవస్థపై తమకు విశ్వాసం ఉందని. న్యాయ పోరాటం చేస్తామని హరీశ్‌రావు స్పష్టం చేశారు. నిన్న (శుక్రవారం) సాయంత్రం హైదరాబాద్‌లోని ఆమె నివాసంలో కవితను అరెస్ట్ చేసి ఢిల్లీకి తరలించారు. ఈడీ అధికారుల తీరును తప్పుపట్టారు. కవిత అరెస్ట్ అక్రమం, అప్రజాస్వామికం అంటూ ధ్వజమెత్తారు. ఇది బీజేపీ, కాంగ్రెస్ కుట్ర అంటూ తీవ్ర ఆరోపణలు చేశారు. బీజేపీ నాయకులు గత కొంతకాలంగా కవితను అరెస్టు చేస్తామని ఈడీ అధికారుల మాదిరిగా చెప్పుకుంటూ వచ్చారని తెలిపారు.
Read also: Mahua Moitra: ఒక ఈడీ ఒకే పార్టీ.. బీజేపీకి 55 శాతం ఎలక్టోరల్ బాండ్లు..
కేసీఆర్ డిమోరలైజ్ చేయాలని బీజేపీ, కాంగ్రెస్ కలిసి కుట్ర పన్నాయని ఆరోపించారు. అయిని అరెస్టులు బీఆర్ఎస్‌కు కొత్తేమీ కాదని పేర్కొన్నారు. 14 ఏళ్లు పోరాడిన పార్టీ అని.. రాజకీయంగా, న్యాయ పరంగా పోరాటం చేస్తామని తెలిపారు. కవిత పిటిషన్‌ను ఈరోజు సుప్రీంకోర్టు మూడు రోజులు వాయిదా వేసిందని గుర్తుచేశారు. దేశ అత్యున్నత న్యాయస్థానం చెప్పిన మాటకు విరుద్ధంగా ఈడీ అరెస్టు చేయడం సరికాదన్నారు. అయినా మహిళల్ని సాయంత్రం ఆరున్నర గంటల తర్వాత అరెస్టు చేయడంపై కోర్టులో కేసు నడుస్తోందని వ్యాఖ్యానించారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్‌ను దెబ్బతీయడానికే కవితను అరెస్టు చేశారని ఆరోపించారు. గతంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులపై కేసులు, దాడులు జరిగాయని.. రాజకీయంగా కక్ష సాధింపులకు పాల్పడుతున్నారని హరీశ్‌రావు ధ్వజమెత్తారు.
Mahua Moitra: ఒక ఈడీ ఒకే పార్టీ.. బీజేపీకి 55 శాతం ఎలక్టోరల్ బాండ్లు..