స్వామినాథన్‌కు భారతరత్న ఇస్తారు కానీ.. రైతుల్ని పట్టించుకోరా? డిమాండ్ల పరిష్కారం కోసం ఢిల్లీలో (Delhi) నిరసన చేపడుతున్న అన్నదాతలపై టియర్ గ్యాస్ (Tear Gas) ప్రయోగించడాన్ని కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్‌గాంధీ (Rahul Gandhi) తప్పుపట్టారు. రాహుల్ చేపట్టిన భారత్ జోడో న్యాయ యాత్ర ప్రస్తుతం ఛత్తీస్‌గఢ్‌లో కొనసాగుతోంది. తాజాగా ఆయన ఓ బహిరంగ సభలో మాట్లాడుతూ రైతులు చేపట్టిన చలో ఢిల్లీ కార్యక్రమంపై స్పందించారు. రైతులు (Farmers Protest) కేవలం తమ డిమాండ్లు పరిష్కరించాలని మాత్రమే…
పదేండ్లు అధికారంలో ఉండి.. ఆంధ్రా నాయకులతో చెట్టాపట్టాలేసుకొని తిరిగి.. చేపల పులుసు తిని, రాయలసీమను రతనాలసీమ చేస్తనని శపథం చేసిన కేసిఆర్.. ఇప్పుడు అధికారం పోగానే గజినిలా గతం మరిచిపోయాడని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఒక ప్రకటనలో ఆరోపించారు. 2015 లో తెలంగాణ ప్రయోజనాలను ఆంధ్రాకు తాకట్టుపెట్టి తెలంగాణకు 299 టీఎంసీలకు ఒప్పుకొని ఇప్పుడు కల్లిబొల్లి మాటలు మాట్లాడుతున్నాడని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. పదేండ్లు అధికారంలో ఉండి నల్గొండలో 70 శాతం పూర్తయిన ప్రాజెక్టులను…
మేడిగడ్డ ప్రాజక్ట్‌ను పరిశీలించేందుకు నేడు సీఎం రేవంత్ రెడ్డి బృందం వెళ్లారు. అయితే.. ఈ నేపథ్యంలో ప్రాజెక్ట్ పరిశీలన అనంతరం ఏర్పాటు చేసిన పవర్ పాయింట్ ప్రజంటేషన్ అనంతరం మాట్లాడుతూ.. కేసీఆర్ కాలు విరిగినది అని సభకు రాలేదని, కానీ నల్గొండకు పోయాడంటూ విమర్శలు గుప్పించారు. కాలు విరిగిన కేసీఆర్ కి అసెంబ్లీ దగ్గరా… నల్గొండ దగ్గరా..? అని ఆయన అన్నారు. నల్గొండ దాకా పోయిన నువ్వు.. అసెంబ్లీ కి ఎందుకు రావు అని ఆయన ప్రశ్నించారు.…
కృష్ణాజలాలు మన జీవన్మరణ సమస్య అని, నీళ్లు లేకపోతే మనకు బతుకు లేదన్నారు మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేటీఆర్. ఇవాళ ఆయన నల్గొండలో ఏర్పాటు చేసిన సభలో మాట్లాడుతూ… గతంలో ఫ్లోరైడ్‌తో నల్గొండ జిల్లా వాసుల నడుములు వంగిపోయాయని, మా బతుకు ఇది అని చెప్పినా గతంలో ఏ పార్టీ పట్టించుకోలేదన్నారు. బీఆర్ఎస్ వచ్చాక నల్గొండను ఫ్లోరైడ్ రహితంగా చేశామన్నారు. భగీరథ నీళ్లతో ఫ్లోరైడ్ బాధలు పోయాయి. ఇది రాజకీయ సభ కాదు.. పోరాట సభ…
మేడిగడ్డ ప్రాజెక్ట్‌ను సీఎం రేవంత్ రెడ్డి బృందం పరిశీలించింది.. అనంతరం మేడిగడ్డ ప్రాజెక్ట్‌పై ఏర్పాటు చేసిన పవర్ పాయింట్ ప్రజంటేషన్ వీక్షించిన అనంతరం సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. కేసీఆర్ కోటి ఎకరాలకు నీళ్లు ఇచ్చామనడం పచ్చి అబద్ధమన్నారు. లక్ష కోట్లు ఖర్చు చేసి కనీసం లక్ష ఎకరాలకు నీళ్లు ఇవ్వలేదని, రూ.94 కోట్లు ఖర్చు చేసి నీళ్లు ఇచ్చింది 98, 570 ఎకరాలకు మాత్రమేనని ఆయన వ్యాఖ్యానించారు. కేవలం కరెంటు బిల్లులే ప్రతీ ఏటా రూ.10,…
భారత క్రికెట్లో విషాదం.. మాజీ కెప్టెన్ కన్నుమూత! భారత క్రికెట్లో విషాదం చోటు చేసుకుంది. టీమిండియా మాజీ కెప్టెన్ దత్తాజీరావు గైక్వాడ్ కన్నుమూశారు. ఆయన వయసు 95 ఏళ్లు. వృద్ధాప్య సంబంధిత సమస్యలతో మంగళవారం తెల్లవారుజామున బరోడాలోని తన నివాసంలో ఆయన తుది శ్వాస విడిచారు. గత 12 రోజులుగా ఐసీయులో ఉన్న దత్తాజీరావు ఈ తెల్లవారుజామున మరణించినట్లు కుటుంబ సభ్యులు పీటీఐకి తెలిపారు. భారత మాజీ ఓపెనర్, జాతీయ కోచ్ ఔన్షుమాన్ గైక్వాడ్ తండ్రే దత్తాజీరావు…
రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆధ్వర్యంలో మేడిగడ్డ ప్రాజెక్ట్ సందర్శనకు మంత్రులతో పాటు ఎంఐఎం, సీపీఐ ఎమ్మెల్యెలు వెళ్తున్నారు. మేడిగడ్డ ప్రాజెక్ట్ సందర్శనకు దూరంగా బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలు దూరంగా ఉన్నారు.
తెలంగాణలో జరిగిన అతి పెద్ద కుంభకోణం కాళేశ్వరం ప్రాజెక్ట్ అని ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. మేడిగడ్డతో పాటు సుందిళ్ల, అన్నారం డ్యామేజీలో ఉన్నాయన్నారు.
నేడు జరిగిన తెలంగాణ అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. మేడిగడ్డకు అన్ని పార్టీల సభ్యులను ఆహ్వానించాం.. సభ్యులు వాస్తవాలు చూడాలన్నారు. మేడిగడ్డకు కేసీఆర్ వస్తానంటే హెలికాఫ్టర్ కూడా సిద్ధం చేస్తామన్నారు.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత గులాబీ బాస్ కేసీఆర్ తొలిసారి జనం మధ్యలోకి రాబోతున్నారు. నల్లగొండ జిల్లా కేంద్రంలోని మర్రిగూడ బైపాస్ రోడ్డులోని 50 ఎకరాల స్థలంలో ఇవాళ మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు రైతు గర్జన పేరుతో బీఆర్ఎస్ బహిరంగసభ నిర్వహిస్తుంది.