Srikanta Chari Mother: బీఆర్ఎస్ పార్టీ టికెట్ ఇవ్వకపోతే ఇండిపెండెంట్ గా పోటీ చేస్తా అని తెలంగాణ అమరుడు శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మ సంచలన వ్యాక్యలు చేశారు. భువనగిరి ఎంపీ అభ్యర్థిగా అవకాశం ఇవ్వాలని.. బీఆర్ఎస్ పార్టీని టికెట్ అడిగామని క్లారిటీ ఇచ్చారు. ఉద్యమ ద్రోహులకు బీఆర్ఎస్ పదవులు ఇచ్చిందన్నారు. కేసీఆర్ నాకు టికెట్ ఇచ్చి గెలిపించాలని కోరారు. ఏ పార్టీ టికెట్ ఇవ్వకపోతే ఇండిపెండెంట్ గా పోటీ చేస్తా అని కీలక వ్యాఖ్యలు చేశారు. అన్ని పార్టీలు అభ్యర్థులను ప్రకటించకుండా మద్దతు ఇవ్వాలన్నారు. ఇదే తెలంగాణ అమరవీరులకు ఇచ్చే గౌరవం అని తెలిపారు.
Read also: Komatireddy Venkat Reddy: బీఆర్‌ఎస్ లో మిగిలేది ఆ నలుగురే.. కోమటిరెడ్డి వెంకటరెడ్డి కీలక వ్యాఖ్యలు
గన్ పార్క్ అమరవీరుల స్తూపం వద్ద శ్రీకాంతా చారి చిత్రపటానికి నివాళులార్పించారు. తెలంగాణ రాష్ట్రం కోసం ప్రాణాలు ఇచ్చిన అమరుల కుటుంబాలకు 10 ఏళ్లుగా న్యాయం జరగలేదని మండిపడ్డారు. నా బిడ్డతో పాటు 1000 మంది బిడ్డలు అమరులయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆ కుటుంబాలకు ఇప్పటి వరకు చట్ట సభల్లో గాని, కనీసం నామినేటెడ్ పదవులు కూడా రాలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ ఉద్యమంలో పనిచేయని వారు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీ లు అయ్యారని మండిపడ్డారు. ఇప్పటికైనా అన్ని రాజకీయ పార్టీలు అమరవీరుల కుటుంబాలను గుర్తించాలని కోరారు. రాష్ట్రం కోసం ప్రాణాలు త్యాగం చేసిన శ్రీకాంతాచారి తల్లిగా ఎంపీ ఎన్నికల్లో అవకాశం ఇవ్వాలని అన్ని రాజకీయ పార్టీలను కోరుతున్నానని ఆమె అన్నారు.
MLC Balmoor Venkat: కాంగ్రెస్ 100 రోజుల పరిపాలనపై ప్రజలు పండుగ చేసుకోవాలి..