Aroori Ramesh: లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఇతర పార్టీల్లోకి వలసలు కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీకి మరో షాక్ తగిలింది. వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే అరూరి రమేష్ బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశారు. ఈ మేరకు తన రాజీనామా లేఖను కేసీఆర్‌కు పంపారు. పార్టీ జిల్లా అధ్యక్ష పదవికి, ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్టు లేఖ విడుదల చేశారు. తన రాజీనామాను ఆమోదించాలని విజ్ఞప్తి చేశారు. కాగా, అరూరి రమేష్ బీజేపీలో చేరనున్నట్లు తెలుస్తోంది. ఆయన వరంగల్ పార్లమెంట్ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసే అవకాశం ఉంది. కాగా.. వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే అరూరి రమేష్ బీజేపీలో చేరుతున్నట్లు కొద్ది రోజులుగా రాష్ట్ర రాజకీయాల్లో జోరుగా ప్రచారం సాగుతోంది. ఈ క్రమంలో ఆయన నివాసం ఉంటున్న మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావును కారులో ఎక్కించుకుని హైదరాబాద్ నందినగర్ లో నివాసముంటున్న బీఆర్ ఎస్ అధినేత కేసీఆర్ వద్దకు తీసుకెళ్లారు.
Read also: Gun Fire : మరో మారు కాల్పులతో మార్మోగిన అమెరికా.. ముగ్గురిని కాల్చి చంపిన కేటుగాడు
ఈ క్రమంలో అరూరి రమేశ్‌ను బీఆర్‌ఎస్ నేతలు కిడ్నాప్ చేశారని ప్రచారం జరిగింది. దీనిపై అరూరి రమేష్ వివరణ ఇచ్చారు. తనను ఎవరూ కిడ్నాప్ చేయలేదని చెప్పాడు. తమ పార్టీ నేతలతో కలిసి కేసీఆర్ వద్దకు వచ్చానన్నారు. బీఆర్‌ఎస్‌లోనే ఉండాలని నిర్ణయించుకున్నాడు. తాను అమిత్ షాను కలిశానని వస్తున్న వార్తలను ఆయన కొట్టిపారేశారు. ఇటీవలే ఆయన బీఆర్‌ఎస్‌కు రాజీనామా చేశారు. బీజేపీలో చేరేందుకు సిద్ధమయ్యారు. గత కొద్ది రోజులుగా బీఆర్‌ఎస్ మాజీ ఎమ్మెల్యే అరూరి రమేశ్‌బీ జేపీలో చేరుతున్నారనే చర్చ రాష్ట్ర రాజకీయాల్లో జోరుగా సాగుతోంది. బీజేపీలో చేరేందుకు తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డితో కూడా చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. తెలంగాణ పర్యటనలో ఉన్న కేంద్ర హోంమంత్రి అమిత్ షాను మంగళవారం ఆయన కలిశారని వార్తలు వచ్చాయి. అరూరి రమేశ్‌కు బీజేపీ హైకమాండ్ వరంగల్ ఎంపీ టికెట్ ఆఫర్ చేసినట్లు తెలుస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన ఆయన ఎంపీ టికెట్ కోసం బీజేపీలో చేరేందుకు సిద్ధమైనట్లు సమాచారం.
Hi Nanna: టీవీలోకి రాబోతున్న ‘ Hi Nanna’.. ఎక్కడ చూడొచ్చంటే ?