ఆత్మ గౌరవాన్ని తాకట్టు పెట్టారని కేటీఆర్ మాట్లాడితే ఆశ్చర్యంగా అనిపిస్తుందని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ నేతలు మా మధ్య పుల్లలు పెడుతున్నారని.. సీతక్క ఆడ బిడ్డలందరికీ ప్రతీక అని ఆయన అన్నారు. సీతక్క అత్యంత ప్రతిష్ఠాత్మకమైన పోర్ట్ ఫోలియో నిర్వహిస్తున్నారన్నారు.
బుధవారం సీఎం రేవంత్ రెడ్డి మహబూబ్ నగర్లో చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. రేవంత్ రెడ్డి తిట్టాలి అంటే చంద్రబాబుని తిట్టాలి.. నిందించాలి అంటే కాంగ్రెస్ పార్టీని నిందించాలని ఆయన పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ లోపాలు, చంద్రబాబు పాపాలు.. మహబూబ్ నగర్‌కి శాపాలు అంటూ ఆయన విమర్శించారు.
పదేళ్ల తర్వాత పేదల కళ్లలో ఆనందం చూస్తున్నామన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ మూడు నెలల పాలనతో అన్నీ వర్గాల ప్రజలు సంతోషంగా ఉన్నారన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రతిష్ట పెరిగింది, బీఆర్ఎస్ ప్రతిష్ట అథ:పాతాళానికి దిగజారిందని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి విమర్శించారు. సిట్టింగ్ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఛైర్మన్లు ఆ పార్టీని వీడటం ఆ పార్టీ భవిష్యత్తును చూపెడుతుందని, గతిలేకనే కేసీఆర్ – బీఎస్పీతో పొత్తుపెట్టుకున్నాడని ఆయన విమర్శించారు. తుంటివిరిగి…
తెలంగాణ రాష్ట్రాన్ని సాధించేందుకు బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ కరీంనగర్ నుంచి శంఖారావం పూరించారు అని మాజీ మంత్రి కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ అన్నారు. సింహ గర్జన సభతో ఎస్ఆర్ఆర్ కళాశాల మైదానం నుంచే ప్రారంభించారు.
మేడిగడ్డకు రిపేర్ చేయాలని నేషనల్ డ్యాన్స్ సేఫ్టీ అథారిటీ రిపోర్ట్ ఇస్తే రిపేర్లు చేస్తాం.. కేసీఆర్ చదివింది కేవలం బీఏనే.. పార్లమెంట్ ఎన్నికల్లో పీజీ చేసినట్టు సమాచారం ఇచ్చాడు.. కేటీఆర్, కేసీఆర్, హరీష్ రావులే మేడిగడ్డలో దొంగలు.. ఈ దొంగల సలహాలు తీసుకొని రిపేర్లు చేయమంటారా అంటూ సీఎం అడిగారు.
కేసీఆర్ మాట్లాడుతూ.. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో BRS- BSP కలిసి పోటీ చేయాలని నిర్ణయించామన్నారు. చాలా అంశాల్లో కలిసి పని చేశాం.. ఎన్ని సీట్లలో పోటీ చేయాలి అనేది రేపు నిర్ణయం తీసుకుంటామన్నారు.
బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ ఇవాళ మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్ నేతలతో సమావేశం కానున్నారు. అలాగే నేడు మరో రెండు సీట్లకు ఎంపీ అభ్యర్థులను ప్రకటించనున్నారు. ఇప్పటికే బీఆర్ఎస్ నాలుగు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. ఖమ్మం లోక్‌సభ స్థానం నుంచి నామ నాగేశ్వర్రావు, మహబూబాబాద్ నుంచి మాలోత్ కవిత, కరీంనగర్ లోక్‌సభ స్థానం నుంచి బోయినపల్లి వినోద్‌కుమార్, మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ పెద్దపల్లి నుంచి బరిలో దిగనున్నారు. Multi-Starrer Movie: టాలీవుడ్లో మరో మల్టీస్టారర్..…