రాముల వారి పై ఒట్టేసి ఇచ్చిన హామీలు.. ఏ ఏడాది ఆగస్టున నెరవేస్తారో చెప్పాలని మాజీ ఎంపీ కవిత కాంగ్రెస్ ను ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ గ్యారెంటల కే గ్యారెంటీ లేదని విమర్శించారు. ముఖ్యమంత్రి మానుకోట సభ దానికి నిదర్శనమన్నారు. ప్రజల్లో విశ్వాసం కోల్పోయారు.. కాబట్టి మీ సభలకు దిక్కు దివాన లేదన్నారు. కాంగ్రెస్ పార్టీవి అన్ని లంగా ముచ్చట్లేనని.. జరిగే పార్లమెంట్ ఎన్నికల్లో ఓటేసి తనను గెలిపించాలని కోరారు. రెండు లక్షల రుణమాఫీ అయితే కాంగ్రెస్కు ఓటెయ్యండి.. రుణమాఫీ కాకపోతే మీ ఆడబిడ్డ కవిత కారు గుర్తుకు ఓటేయండి.. తులం బంగారం ఇస్తే కాంగ్రెస్కు ఓటెయ్యండి ఇవ్వకుంటే కారు గుర్తుకు ఓటెయ్యండి.. రైతుబంధు పెంచితే కాంగ్రెస్కు ఓటెయ్యండి.. పెంచరని తెలిస్తే కారు గుర్తుకు ఓటెయ్యండని ఓటర్లకు తెలిపారు.
READ MORE: Nitin Gadkari: ఎండల ధాటికి ఎన్నికల ర్యాలీలో కుప్పకూలిన నితిన్ గడ్కరీ..
బీఆర్ఎస్ పై అన్ని ప్రాంతాల్లో మంచి స్పందన ఉందని.. మార్పు కోసమే ఎమ్మెల్యేలను, కేసీఆర్ ను ఓడించారని మాజీ ఎంపీ కవిత అన్నారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలకు ఆశపడి ఓట్లేసిన ప్రజలు ఇప్పుడు చెంపలు కొట్టుకుంటున్నారన్నారు. కాంగ్రెస్ మార్పు పేరిట ఎమ్మెల్యేలను ఎలా ఓడించారో.. నేడు కాంగ్రెస్ పై వ్యతిరేకతో అదే మార్పుతో బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థులను ప్రజలే గెలిపించేందుకు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. గతంలో వర్షాల కోసం ఆకాశాన్ని చూసేదని.. ఇప్పుడు రైతుబంధు కోసం కేసీఆర్ వైపు చూస్తున్నారన్నారు. కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థులకు ప్రజా సంబంధాలు లేవు.. వారు అడ్రస్సు లేరని.. గెలుపొందది తానే అని ధీమా వ్యక్తం చేశారు. ప్రజలకు ఏమైనా ఇబ్బందులు ఎదురైతే ఆడబిడ్డగా తాను చూడాల్సిందే అన్నారు. కాంగ్రెస్, బీజేపీ నాయకులు పట్టించుకోరన్నారు.