రాష్ట్రంలో నీళ్ల పంచాయితీ మళ్లీ మొదలైంది. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ తరువాత మొదటి అసెంబ్లీ సమావేశంలో ప్రాజెక్టుల విషయంపై అధికార పార్టీ, బీఆర్ఎస్ నాయకులు రాళ్లు రువ్వుకున్నారు. తప్పు మీదంటే.. మీదంటూ ఒకరినోకరు విమర్శించుకున్నారు. స్వేత పత్రాలు సైతం విడుదల చేశారు. తాజాగా రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. కేసీఆర్ హయంలో పోతిరెడ్డిపాడు నుంచి 92 వేల క్యూసెక్కుల నీరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వాడుకుందన్నారు. ఎన్టీఆర్, వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో కంటే ఎక్కువ నీరు దోపిడీ జరిగిందని తెలిపారు. కేసీఆర్ ను, జగన్ కలిసిన ప్రతి సారి తెలంగాణకి అన్యాయం జరిగిందని ఆరోపించారు. 2014 కి ముందు శ్రీశైలం నుంచి ఆంధ్రాకి రోజుకు 4.1 టీఎంసీలు వెళ్ళేదన్నారు. 2014 తరువాత 9.5 టీఎంసీలకు పెరిగిందన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో నీటి దోపిడీ జరిగిందని.. కేసీఆర్ అబద్ధాలు చెప్తున్నారన్నారు. మేము అధికారిక వివరాలు బయట పెడుతున్నాం.. కేసీఆర్ తెలివి మీరి మట్లాడుతున్నారన్నారు. డిండి లిఫ్ట్ ఇరిగేషన్ స్కింకి వాటర్ సోర్స్ ఫైనల్ చేయనే లేదని తెలిపారు. ఈ టర్మ్ లో డిండి లిఫ్ట్ ఇరిగేషన్ పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. కేసీఆర్ వల్ల నల్గొండకు జరిగిన అన్యాయాన్ని తాము సెట్ చేస్తామన్నారు.
READ MORE: congress: మూడు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన కాంగ్రెస్.. వారెవరంటే?
ఎస్ఎల్ బీసీ(SLbc) టన్నెల్ ఎందుకు పూర్తి చేయలేదని ప్రశ్నించారు. ఉమ్మడి నల్గొండ జిల్లా ప్రాజెక్టులు పూర్తి చేస్తామన్నారు. కేఆర్ఎంబీ ని(Krmb) ని మీరు అప్పగిస్తే.. మేము కొట్లాడుతున్నామన్నారు. లిఖిత పూర్వకంగా అప్పగించింది మీరు.. కొట్లాడుతుంది తామని తెలిపారు. కేఆర్ఎమ్ బీకి ప్రాజెక్టులు అప్పగిస్తూ.. 2023 డిసెంబర్ 1న స్మితా సబర్వాల్ లేఖ రాశారని వెల్లడించారు. కేసీఆర్.. ఇంజనీర్ ఆయనే.. క్వాలిటీ కంట్రోల్ ఆయనే.. అందుకే మేడిగడ్డ పరిస్థితి అట్లుందని విమర్శించారు. కేసీఆర్, బీఆర్ఎస్ నేతలు మాట్లాడే మాటలన్నీ అబద్ధాలన్నారు. బీఆర్ఎస్ కోలాప్స్ అయ్యే పరిస్థితిలో ఉందని.. పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఒక్క ఎంపీ సీటు కూడా గెలవదన్నారు.