మాజీ ముఖ్యమంత్రి తాను ఒక్కడే తెలంగాణ తెచ్చానని చెప్పుకుంటారని.. అది పచ్చి అబద్ధమన్న విషయం ప్రజలందరికీ తెలుసని కోదండ రామ్ అన్నారు. కాజిపేట్, మడికొండలో జరిగిన జన జాతర సభలో ఆయన మాట్లాడుతూ.. కడియం కావ్యకి సంపూర్ణ మద్దతు ఇస్తున్నట్లు తెలిపారు. ఒక నిరంకుశత్వ పాలన నుంచి భయటపడ్డామన్నారు. కేసీఆర్, బీజేపీకి సంబంధించిన అన్ని అంశాలకు మద్దతు పలికాడన్నారు. మోడీ ప్రభుత్వం కోచ్ ఫ్యాక్టరీని నిరాకరించిందని చెప్పారు. బీజేపీ ప్రభుత్వం వరంగల్ కి చాలా రకాలుగా అన్యాయం చేసిందన్నారు. కాళేశ్వరంలో మూడే పిల్లర్లు కుంగాయని కేసీఆర్ చెబుతున్నారని..ఆ పిల్లర్లే ముఖ్యమని ఆయన తెలిపారు. తెలంగాణాను కాపాడుకోవడానికి కాంగ్రెస్ కి ఓటు వేయాలని కోరారు. వరంగల్ ఎంపీ అభ్యర్థి కడియం కావ్యను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు
READ MORE: Inter Students Suicide: క్షణికావేశంలో విద్యార్థులు బలి.. తల్లిదండ్రులకు కడుపుకోత
వరంగల్ కి గొప్ప చరిత్ర ఉందని.. వరంగల్ ని ప్రజలు ఎవ్వరూ కోరుకోకుండానే 6 ముక్కలు చేశారని కాంగ్రెస్ నేత కడియం శ్రీహరి అన్నారు. తాను ఇది సరైంది కాదని చెప్పినప్పటికీ ప్రభుత్వ పెద్దలెవ్వరూ పట్టించుకోలేదని తెలిపారు. వ్యవసాయానికి వరంగల్ పెట్టింది పేరని.. తెలంగాణలో రెండో అతి పెద్ద జిల్లా ఆయన వరంగల్ కు చెందాల్సిన అభివృద్ధి జరగలేదన్నారు. కనీసం ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో అయినా అభివృద్ధి చెందాలని కోరుకుంటునని అన్నారు. వరంగల్ జిల్లా అభిృద్ధికి కోసమే తాను కాంగ్రెస్ లో చేరినట్లు స్పష్టం చేశారు. వరంగల్ కు ఐటీ (it hab) గా.. ఇండస్ట్రియల్ హబ్ గా, విద్య హబ్ గా అభివృద్ధి చెందే అవకాశం ఉందని తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి వరంగల్ జిల్లా అభివృద్ధి పైన దృష్టి సారించాలని కోరారు. బీజేపీ ప్రజాస్వామ్య వ్యవస్థను ఖూని చేస్తోందని.. ప్రజాస్వామ్యాన్ని రక్షించేందుకు కాంగ్రెస్ కి ఓటు వేయాలన్నారు.