మామా అల్లుళ్లు తోక తెగిన బల్లుల్లా ఎగిరిపడుతున్నారని..అసెంబ్లీకి రాని ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్ నిన్న నాలుగు గంటలు టీవీ స్టుడియోలో ఎలా కూర్చున్నాడని ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. కాళేశ్వరం ప్రాజెక్టు డిజైన్ మందేసి గీశాడో.. దిగాక గేసాడోగానీ కూలిపోయిందని విమర్శించారు. నువ్వు కట్టిన కాళేశ్వరం అద్భుతమైతే దమ్ము ధైర్యం ఉంటే చర్చకు రమ్మని.. కేసీఆర్ కు సవాల్ విసిరారు. హరీష్ రావు.. రాజీనామా పత్రం జేబులో పెట్టుకుని రెడీగా ఉండమన్నారు. రామప్ప శివుడి సాక్షిగా, వేయి స్తంభాల గుడి సాక్షిగా, భద్రకాళి అమ్మవారి సాక్షిగా మాట ఇస్తున్నా.. పంద్రాగస్టులోగా రూ.2లక్షల రుణమాఫీ చేస్తా అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. పంద్రాగస్టులోగా రైతు రుణమాఫీ చేసి నీ సంగతి తెలుస్తానన్నారు. ఆనాడు పెట్రోల్ పోసుకున్న నీకు అగ్గిపెట్టే దొరకలేదని చెప్పినట్లు కాదని విమర్శించారు.
READ MORE: BC Janardhan Reddy: అరుంధతి కోటపై టీడీపీ జెండా ఎగరడం ఖాయం..!
రైతు ఆదాయాన్ని రెట్టింపు చేసి ఆత్మహత్యలు ఆపుతానని మోడీ హామీ ఇచ్చారని.. కానీ ఆత్మహత్యలు ఆగలేదన్నారు. రైతుల ఆదాయం పెరగలేదని.. జన్ ధన్ ఖాతాల్లో రూ.15 లక్షలు వేస్తానన్న మోడీ మోసం చేశారన్నారు. బయ్యారం ఉక్కు కర్మాగారం ఏర్పాటు చేయకుండా ఈ ప్రాంతానికి అన్యాయం చేశారని తెలిపారు. కాజీపేటకు రావాల్సిన రైల్వే కోచ్ ఫ్యాక్టరీని తరలించుకుపోయారన్నారు. బీజేపీ నేతలకు మత పిచ్చి పట్టుకుందని.. భూములు ఆక్రమించుకునే ఆరూరి రమేష్ కావాలో.. పేదలకు వైద్యం అందించే కడియం కావ్య కావాలో తేల్చుకోండని ఓటర్లకు సూచించారు. కడియం శ్రీహరి నిజాయితీ చూసి పార్టీలో చేర్చుకున్నామన్నారు. ఈ ప్రాంతం నుంచి మరొక ఆడబిడ్డ కావ్యను ఆశీర్వదించండని కోరారు. ఆరూరి రమేష్ కు ఓటు వేస్తే.. అనకొండగా మారి మీ భూములను మింగేస్తాడని విమర్శించారు. నిజాయితీని వారసత్వంగా తీసుకున్న.. మీ కోసం కొట్లాడే కావ్యను గెలిపించండి.. వరంగల్ ను అభివృద్ధి చేసే బాధ్యత తనదని భరోసా ఇచ్చారు.