మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు మరోసారి ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. ఇచ్చిన హామీలను నెరవేర్చడంతో కాంగ్రెస్ పూర్తిగా విఫలమైందన్నారు. కొంతకాలం క్రితం వరకు ధీమాగా ఉన్న రైతాంగం ప్రస్తుతం దిగాలు పడుతోందని కేసీఆర్ అన్నారు. బస్సు యాత్రలో భాగంగా మిర్యాలగూడలో నిర్వహించిన కార్నర్ మీటింగ్ లో ఆయన మాట్లాడారు. దద్దమలకు దమ్ములేక పంటలు ఎండబెట్టారని విమర్శించారు. ఆనాటి నుండి ఈనాటి వరకు మన పోరాటం నీళ్ల కోసమే అని గుర్తుచేశారు. దద్దమ్మలు నాగార్జునసాగర్ మీద అధికారం కేంద్రానికి ఇచ్చారని మండిపడ్డారు. అసమర్థులు రాజ్యం ఏలుతున్నారన్నారు. కేసీఆర్ ను తిట్టడమే మంత్రుల లక్ష్యంగా మారిందన్నారు. తులం బంగారం కాదు కదా ఇనుము కూడా ఇవ్వరని విమర్శించారు. 1956 నుండి కాంగ్రెస్ మనకు శత్రువన్నారు. అడ్డగోలు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చారని చెప్పారు.
READ MORE: Nithin : ‘ తమ్ముడు ‘ సినిమా కోసం పెద్ద సాహసం చేస్తున్న నితిన్..
రుణమాఫీ చేయడంలో విఫలం అయ్యారని.. నిరుద్యోగ భృతిపై మాట మార్చారన్నారు. బీఆర్ఎస్ అభ్యర్థులు గెలిస్తేనే ప్రభుత్వం మెడలు వంచొచ్చని తెలిపారు. కేసీఆర్ ను జైల్లో వేస్తానని అంటున్నారని.. జైల్లో వేస్తాను అంటే భయపడనని.. అలా భయపడితే తెలంగాణ తెచ్చే వాడినే కాదన్నారు. అబద్దాల శ్వేత పత్రాలతో ప్రజలను మోసం చేస్తున్నారన్నారు. ప్రభుత్వం అంబేడ్కర్ ను అవమణించిందని..
ప్రజల పక్షాన కొట్లాడే కేసీఆర్ కు అండగా నిలబడాలని కోరారు. మన రాజ్యమే వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. పార్లమెంట్ ఎన్నికల్లో 10-13 సీట్లు గెలవాలన్నారు.