Alleti Maheshwar Reddy : బీఆర్ఎస్ లో జరుగుతున్న పరిణామాలపై బీజేపీ ఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి ఘాటుగా స్పందించారు. కల్వకుంట్ల కవిత చేసిన వ్యాఖ్యలపై స్పందించిన ఆయన, ఆమె అసంతృప్తి అనేది గత కొంతకాలంగా బయటపడుతోందని, ఇది ఇక బహిరంగంగానే మారిపోయిందని పేర్కొన్నారు. కవిత ఇటీవల పార్టీకి రాసిన లేఖలో తనకు జరిగిన అన్యాయాన్ని స్పష్టంగా ప్రస్తావించారని మహేశ్వర్ రెడ్డి తెలిపారు. BRS పార్టీలో తన పాత్రను పూర్తిగా విస్మరిస్తున్నారనే అభిప్రాయం ఆమెలో ఉందని, కేటీఆర్కు…
MLC Kavitha: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తాజాగా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తనపై, తన రాజకీయ భవిష్యత్తుపై జరుగుతున్న కుట్రలపై స్పష్టంగా మాట్లాడారు. బీఆర్ఎస్లోనే ఉన్న కొందరు కోవర్టులు నన్ను ఓడించేందుకు ప్రయత్నించారని, పేయిడ్ న్యూస్లు వేసి, లేఖల్ని లీక్ చేసి, బీజేపీలోకి బీఆర్ఎస్ను కలిపే కుట్రలు చేస్తున్నారు అని విమర్శించారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ను లక్ష్యంగా చేసుకుని కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. “వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉండాలంటే ట్వీట్లు చేయడం మాత్రమే కాదు,…
నా పేరుతో పద్మశ్రీ వచ్చినా.. ఇది ఉద్యమకారులందరికీ దక్కిన గౌరవం! వ్యక్తిగతంగా నా పేరుతో పద్మశ్రీ వచ్చినా.. ఇది ఉద్యమకారులందరికీ దక్కిన గౌరవం అని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ పేర్కొన్నారు. పద్మశ్రీ పురస్కారం ఉద్యమానికి దక్కిన అభినందనలు అని తెలిపారు. 1994లో ఉద్యమం మొదలైందని, ఎమ్మార్పీఎస్ది ముప్పై ఏళ్ల పోరాటమన్నారు. సమాజంలో అన్ని వర్గాల అండదండలతోనే ఉద్యమం సాధ్యమయిందన్నారు. సుప్రీంకోర్టు సైతం ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా తీర్పు ఇచ్చిందని మందకృష్ణ మాదిగ అన్నారు. మంగళవారం…
KCR-Harish Rao : సిద్దిపేట జిల్లా ఎర్రవల్లిలోని ఫామ్ హౌస్లో బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు మూడున్నర గంటలగా సమావేశమయ్యారు. ఈ సమావేశంలో కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుపై విచారణ జరుపుతున్న కమిషన్ ఇచ్చిన నివేదిక, అందించిన నోటీసులపై సుదీర్ఘంగా చర్చించారు. ఈ నెల 5న కమిషన్ ముందు విచారణకు హాజరుకానున్నట్లు ఇప్పటికే నిర్ణయం తీసుకున్న కేసీఆర్, ముందు జాగ్రత్తగా కమిషన్ వద్ద ఉత్పన్నమయ్యే ప్రశ్నలు, వాటికి ఇవ్వాల్సిన సమాధానాలపై…
భారత రాష్ట్ర సమితిలో తన పాత్రపై స్పష్టత కోరుతున్న కవిత ఇక దూకుడు పెంచాలనుకుంటున్నట్టు తెలుస్తోంది. ఏదో... ఇస్తే తీసుకున్నట్టు కాకుండా.... తానేంటో నిరూపించుకోవాలనుకుంటున్నారట ఆమె. తండ్రి కేసీఆర్కు ఆమె రాసిన లేఖ బయటికి లీకవడం, దాని మీద పెద్ద స్థాయిలో రాజకీయ రచ్చ అవుతున్న క్రమంలో కేసీఆర్ దూతలు ఇద్దరు కవితతో నేరుగా సమావేశమై చర్చించినట్టు తెలుస్తోంది.
MP Raghunandan Rao: మెదక్ ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. కవిత ఎపిసోడ్ ని ఫ్యామిలీ డ్రామాతో పోల్చారు. తెలంగాణలో దేవుళ్ళు ఉన్నారా దెయ్యాలు ఉన్నాయా అన్న విషయంపై చర్చ జరుగుతుంది.. దేవుడి పక్కన దెయ్యం ఉంటే 12 ఏళ్లుగా ఏం చేస్తున్నారు అని ప్రశ్నించారు. బీఆర్ఎస్ పార్టీ ఖాళీ అవుతుందని వాళ్లే నాటకం ఆడుతున్నారు.
NVSS Prabhakar : నీతి ఆయోగ్ 10వ సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొనడాన్ని స్వాగతిస్తున్నట్లు బీజేపీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ తెలిపారు. అయితే 9వ సమావేశానికి హాజరుకాలేదని గుర్తుచేస్తూ, “అప్పుడు ముఖ్యమంత్రి ఎవరినిమిత్తం, ఎందుకోసం గైర్హాజరయ్యారు?” అనే ప్రశ్నను ఆయన లేవనెత్తారు. నీతి ఆయోగ్ సమావేశాల ఉద్దేశం రాష్ట్రాలు అభివృద్ధి చెందితేనే దేశం అభివృద్ధి చెందుతుందన్న దానిపై కేంద్రం నమ్మకం పెట్టుకున్నదని ఆయన అన్నారు. “రెవంత్ రెడ్డి ఫెడరల్ స్పూర్తితో సమావేశంలో…
కోనేరు కోనప్ప..సిర్పూర్ టీ మాజీ ఎమ్మెల్యే. ముందు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారాయన. ఆ తర్వాత బీఎస్పీ ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ తర్వాత బీఆర్ఎస్ కండువా కప్పుకుని మరోసారి ఎమ్మెల్యే అయ్యారు. ఇక 2023 అసెంబ్లీ ఎన్నికల్లో... కూడా... బీఆర్ఎస్ తరపున పోటీ చేసి ఓడిపోయాక పాత గూడు కాంగ్రెస్ దరికే చేరారు కోనప్ప. కానీ.... చేరినప్పటి నుంచే ఆ పార్టీతో అంటీముట్టనట్టుగా ఉంటున్నారాయన. ఆ క్రమంలో మెల్లిగా నియోజకవర్గంలో ప్రాధాన్యత కూడా తగ్గుతూ వస్తోందట. ఇలాంటి పరిస్థితుల్లో...…
మన పార్టీ నుంచి వెళ్లిన పది మంది ఎమ్మెల్యేలను ఉప ఎన్నికల్లో పండబెట్టి తొక్కే విదంగా ఓడించాలి.. మీ ఆవేశం చూస్తుంటే రాబోయే గద్వాల ఉప ఎన్నికల్లో మనం సామాన్య వ్యక్తిని పెట్టినా గెలుస్తాం అన్నారు.. ఈ శతాబ్దపు అతి పెద్ద మోసం కాంగ్రెస్ ఇచ్చిన అభయహస్తం హామీ అని ఎద్దేవా చేశారు. ఎన్ని రోజులు చూడాలి ఈ కాంగ్రెస్ దరిద్రాన్ని అని అందరూ అడుగుతున్నారు అని కేటీఆర్ చెప్పుకొచ్చారు.