కాళేశ్వరం ప్రాజెక్ట్‌పై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ పనికిరాదని.. ఆ ప్రాజెక్ట్‌ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. హనుమకొండ జిల్లా పర్యటనలో కూనంనేని ఈ వ్యాఖ్యలు చేశారు. జనాల సొమ్మును ఇకపై కాళేశ్వరం ప్రాజెక్ట్ కోసం ఖర్చు చేయొద్దని కోరారు. కేసీఆర్ అంటే కాళేశ్వరం.. కాళేశ్వరం అంటే కేసీఆర్ అన్నోళ్లు నోరు మూసుకున్నారని వ్యా్ఖ్యానించారు. అన్నీ తానే అన్నట్టుగా వ్యవహరించిన కేసీఆర్.. ఇప్పుడేమో తనకు సంబంధం లేనట్టుగా వ్యవహారిస్తున్నారని విమర్శించారు. కాళేశ్వరం నిర్మించాక.. ఒక్క చుక్కనీరు అదనంగా ఇవ్వలేదన్నారు. పంటలకు వస్తున్న నీళ్లు… ఎల్లంపల్లి నీళ్లే అన్నారు. 140 మీటర్ల ఎత్తులో తుమ్మిడిహెట్టి దగ్గర ప్రాజెక్ట్ కట్టాలని సీపీఐ డిమాండ్ చేసిందని గుర్తుచేశారు. కానీ మహారాష్ట్ర పర్మిషన్ ఇవ్వలేదని హరీశ్‌రావు అంటున్నారన్నారు.
ఇది కూడా చదవండి: Revanth Reddy: సోమవారం రైతులతో రేవంత్‌రెడ్డి ముఖాముఖి.. కలెక్టర్లు ప్రత్యేక ఏర్పాట్లు
కేంద్ర ప్రభుత్వం మానవ హక్కులను ఉల్లంఘిస్తోందని ధ్వజమెత్తారు. పోలీసుల కాల్పుల్లో చనిపోయిన నంబాల కేశవరావు మృతదేహాన్ని ఇవ్వకపోవడం దారుణం అన్నారు. కమ్యూనిస్టుల మృతదేహాలను చూసి కేంద్రం భయపడుతోందన్నారు. కృత్రిమంగా పేదలు లేని దేశంగా చూపాలని కుట్ర చేస్తున్నారని తెలిపారు. నెలకు 8 రూపాయల ఆదాయం ఉంటే ధనికుడవుతారా? ఇదొక దగా అన్నారు. నెలకు రూ.20వేల ఆదాయం ఉన్న కూడా పేదవారిగానే పరిగణించాలని కోరారు. అమెరికా చెప్పు చేతల్లోనే నరేంద్ర మోడీ పని చేస్తున్నారని ఆరోపించారు. ఇజ్రాయెల్-ఇరాన్ యుద్ధంలో మోడీ ఇజ్రాయెల్‌కు సపోర్ట్ చేస్తున్నారన్నారు. భారతదేశ విదేశాంగ విధానం మారాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.
ఇది కూడా చదవండి: India Canada: దారికి వచ్చిన కెనడా.. ఇండియా దౌత్య విజయం..
తెలంగాణ రాష్ట్రంలో పెద్దలకు మాత్రమే బిల్లులు చెల్లిస్తున్నారని ఆరోపించారు. చిన్నవాళ్లకు బిల్లులు చెల్లించడం లేదన్న వాదన ఉందని తెలిపారు. చిన్నవాళ్లకు బిల్లులు చెల్లించి వాళ్లను కాపాడాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. బిల్లులు రాక చిన్నవాళ్లు చాలా ఇబ్బందులు పడుతున్నారన్నారు.