ఎర్రవల్లి ఫాంహౌస్‌లో తన తండ్రి కేసీఆర్‌తో మాట్లాడానో.. లేదన్నది ఇప్పుడు అవసరం లేదని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత తేల్చిచెప్పారు. కవిత మీడియాతో చిట్‌చాట్ చేశారు. ఇటీవల ఎర్రవల్లి ఫాంహౌస్‌లో కేసీఆర్‌ను కలిసేందుకు కవిత వెళ్లింది. కవితను పలకరించకుండానే కేసీఆర్ బయటకు వెళ్లిపోయారంటూ వార్తలు వచ్చాయి. తాజాగా ఇదే అంశంపై కవిత నోరు విప్పారు. ఫాంహౌస్‌కు వెళ్లినప్పుడు మా నాన్నతో మాట్లాడానో లేదో అనేది ఇప్పుడు అనవసరమైన మేటర్ అంటూ కొట్టిపారేశారు. ఇక కేటీఆర్ విచారణకు వెళ్తున్నప్పుడు వెళ్లాలో.. వద్దో అనేది ఇంకా నిర్ణయం తీసుకోలేదన్నారు. అయినా విచారణ సమయంలో ఎవరినీ రానీయకుండా దూరంగానే అడ్డుకుంటున్నారు కదా? అని వ్యాఖ్యానించారు. ఇక కేసీఆర్ నార్మల్ చెకప్ కోసమే ఆస్పత్రికి వెళ్లారన్నారు. బోన్‌కు ఇంజక్షన్ వేయించుకుంటున్నారని.. ఎప్పటినుంచో పెండింగ్‌లో ఉన్న ట్రీట్‌మెంట్ ఇప్పుడు జరుగుతోందని కవిత వెల్లడించారు.
ఇది కూడా చదవండి: Vijay Rupani: రెండుసార్లు ఫ్లైట్ టికెట్ క్యాన్సల్.. మూడోసారి మృత్యువు ఒడిలోకి..
సీఎం రేవంత్‌రెడ్డి.. మోడీని కలిసి 26 అంశాలై వినతిపత్రం ఇచ్చారని.. కానీ అందులో బీసీ బిల్లు లేదన్నారు. బీసీ బిల్లు అమలు కావాలనే చిత్తశుద్ధి రేవంత్‌రెడ్డికి లేదని ఆరోపించారు. బీసీ బిల్లు అమలు కోసం గట్టిగా పోరాటం చేస్తామని తెలిపారు. ఈనెల 17న జాగృతి ఆధ్వర్యంలో మెదక్‌లో రౌండ్ టేబుల్ సమావేశం పెట్టినట్లు చెప్పారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు పార్టీ పరంగా ఇస్తామని కాంగ్రెస్ చెప్పడం కరెక్ట్ కాదన్నారు. రాష్ట్రంలో పాఠ్య పుస్తకాలను మార్చారని.. పుస్తకాలపై కొమురం భీమ్ బొమ్మను తీసివేశారని ఆరోపించారు. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ఉద్యోగి అని ఆయనే చెప్పారని… ఆయనకు వాళ్ల ముఖ్య నేతలే అపాయింట్‌మెంట్ ఇవ్వట్లేదన్నారు. వేరే వాళ్ల గురించి మాట్లాడే అర్హత రేవంత్ రెడ్డికి లేదన్నారు.
ఇది కూడా చదవండి: Air India Crash: విమానాల్లో సురక్షితమైన సీట్లు ఉంటాయా.? నిపుణులు ఏం చెబుతున్నారు..