KCR: బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ రెగ్యులర్ మెడికల్ చెకప్ కోసం గచ్చిబౌలిలోని ఏఐజీ హస్పటల్ కి వెళ్లారు. కేసీఆర్ తో ఆసుపత్రికి కేటీఆర్, హరీష్ రావు వచ్చారు. అయితే, నిన్న కొన్ని టెస్టుల తర్వాత ఈ రోజు మరోసారి ఆసుపత్రికి వెళ్లారు కేసీఆర్. కాగా, గత కొన్ని రోజుల నుంచి ఆయన జలుబుతో బాధపడుతున్నారు. వైద్య పరీక్షలు పూర్తి అయిన వెంటనే నందినగర్ నివాసానికి వెళ్లనున్నారు. మరో ఐదు రోజుల పాటు బంజారా హిల్స్ లోని నందీనగర్ నివాసంలోనే కేసీఆర్ ఉండనున్నారు.
Read Also: Top Headlines @ 9 AM: టాప్ న్యూస్
అయితే, గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు కేసీఆర్ ఎర్రవల్లి ఫామ్ హౌస్ లోని బాత్ రూంలో కాలు జారీ పడటంతో యశోద ఆస్పత్రికి కొన్ని రోజుల పాటు చికిత్స పొందారు. ఆ తర్వాత ఫామ్ హౌస్ లోనే రెస్ట్ తీసుకుంటున్నారు. ఇక, గత కొంతకాలంగా జలుబుతో ఇబ్బంది పడుతున్న ఆయన శుక్రవారం నాడు సాయంత్రం ఏఐజీ ఆస్పత్రిలో చెకప్ కోసం వెళ్లారు. మిగతా టెస్టుల కోసమని ఈరోజు మరోసారి వెళ్లారు.