Beerla Ilaiah: కేసీఆర్ సూచనల మేరకే బీజేపీ అధ్యక్ష ఎంపిక.. ప్రభుత్వ విప్ సంచలన వ్యాఖ్యలు..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Beerla Ilaiah: రాష్ట్ర రాజకీయాల్లో కొత్త వివాదానికి తెరలేపుతూ ప్రభుత్వ విప్ బిర్ల ఐలయ్య సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీ అధ్యక్షుడి ఎంపికపై బీఆర్‌ఎస్, బీజేపీ మైత్రి మరోసారి బయటపడిందంటూ తీవ్ర ఆరోపణలు చేశారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సూచనల మేరకే బీజేపీ కొత్త అధ్యక్షుడి ఎంపిక జరిగిందని ఆయన మండిపడ్డారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ బీజేపీకి “అవయవ దానం” చేసిందని వ్యాఖ్యానించారు. తాజాగా రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా రామచందర్ రావు లాంటి బలహీన వ్యక్తిని నియమించడం కూడా, స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్‌కు సాయం చేసే వ్యూహం భాగమని తెలిపారు. ఈ ప్రక్రియ మొత్తం కేసీఆర్ డైరెక్షన్‌లో జరిగిందని ఆయన స్పష్టం చేశారు.
Read Also:ENG vs IND: అలా ఇంగ్లండ్‌కు రావొద్దు.. కుల్దీప్ యాదవ్‌కు పీటర్సన్ సూచనలు!
Also Read
- Botsa Satyanarayana Emotional: మరోసారి బొత్స కన్నీళ్లు.. అమర్నాథ్ వ్యాఖ్యలతో కన్నీటి పర్యంతం
- Saudi Arabia Oil: హోర్ముజ్ తర్వాత మరో షాక్.. మూతపడ్డ సౌదీ చమురు పైప్‌లైన్.. భారత్‌కు పెరిగిన కష్టాలు!
- The Paradise: ప్యారడైజ్ సినిమా కోసం ఎన్ని టన్నుల రక్తం వాడారో తెలుసా.?
- India Matches: రేపు భారత్‌కు డబుల్ ధమాకా.. అఫ్గాన్‌తో పురుషుల జట్టు.. శ్రీలంకతో మహిళల టైటిల్ పోరు.!
తెలంగాణలో బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు బీసీ వర్గాలను కించపరిచే విధంగా వ్యవహరిస్తున్నాయని బిర్ల ఐలయ్య విమర్శించారు. గతంలో ఎన్నికల ముందు బండి సంజయ్ ను బీజేపీ అధ్యక్ష పదవి నుండి తప్పించడమూ, ఇప్పుడు మళ్లీ బీసీలకు కాకుండా అగ్రవర్ణాల నేతకు పదవి కట్టబెట్టడమూ దానికి ఉదాహరణలని అన్నారు. కేటీఆర్, హరీష్ రావు లు ఢిల్లీలో అర్ధరాత్రి బీజేపీ నేతలతో సమావేశాలు జరిపి అగ్రవర్ణాల నేతను అధ్యక్షుడిగా నియమించేలా లాబీ చేసినట్లు బిర్ల ఐలయ్య ఆరోపించారు. ఈ చర్యలన్నీ బీజేపీ–బీఆర్ఎస్ మధ్య ఒప్పందాన్ని బలపరుస్తున్నాయని పేర్కొన్నారు.
Read Also:Control Room: ప్రమాద బాధితుల సహాయ చర్యల కోసం కంట్రోల్ రూమ్ ఏర్పాటు..!
ఇక రాష్ట్ర బీజేపీ పార్టీలోని కీలక వ్యక్తి రాజసింగ్ కూడా బీజేపీకి రాజీనామా చేయడాన్ని బిర్ల ఐలయ్య ప్రస్తావించారు. ఇది బీజేపీ పార్టీ ఆత్మ స్థితిగతులపై ప్రజలకు సంకేతం ఇచ్చే విషయమని వ్యాఖ్యానించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్‌ఎస్ పార్టీకి ప్రాణం పోసేందుకు బీజేపీ ప్రయత్నిస్తుందని పేర్కున్నారు.
తాజావార్తలు
-
Dhee 10 Raju Arrested: లైంగిక వేధింపులు.. ఢీ రాజు అరెస్ట్!
-
Botsa Satyanarayana Emotional: మరోసారి బొత్స కన్నీళ్లు.. అమర్నాథ్ వ్యాఖ్యలతో కన్నీటి పర్యంతం
-
Debt Trap: అప్పు మీద అప్పు! దాచుకునేది తక్కువ..లోన్లు ఎక్కువ…ఇదే భారతీయుల దుస్థితి!
-
Shah Rukh Khan: సౌత్ దర్శకులే కావాలంటున్న షారుఖ్.. నెక్స్ట్ సినిమాలపై భారీ స్కెచ్!
-
Saudi Arabia Oil: హోర్ముజ్ తర్వాత మరో షాక్.. మూతపడ్డ సౌదీ చమురు పైప్‌లైన్.. భారత్‌కు పెరిగిన కష్టాలు!
ట్రెండింగ్
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్‌తో సెప్టెంబర్ 15న భారత్‌లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!
-
BRICS Summit 2026: బ్రిక్స్ వేదికగా ఇరాన్‌తో భారత్ దౌత్యం.. చాబహార్‌తో కొత్త ట్రేడ్ రూట్.!