Gangula Kamalakar:సీఎం కేసీఆర్ కు బీసీలు రుణ పడి ఉంటారు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రాష్ట్రంలో బీసీ అభ్యున్నతికి కృషి చేస్తున్న సీఎం కేసీఆర్ కు బీసీలు రుణపడి ఉంటారని రాష్ట్ర బీసీ సంక్షేమం, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. ఖమ్మం జిల్లాలో బీసీ స్టడీ సర్కిల్ భవన్ ప్రారంభోత్సవం సందర్భంగా మంత్రి గంగుల మాట్లాడారు.
తెలంగాణ రాష్ట్రం రాక ముందు మంత్రులు ఉన్నారు, ముఖ్యమంత్రులు ఉన్నారు కానీ.. బీసీలకు చేసింది ఏమి లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. 75ఏళ్లలో ఏ.. ప్రభుత్వం బీసీలను పట్టించుకోలేదని మండిపడ్డారు.
Also Read
- Congress Councillors: కాంగ్రెస్కు ఏడుగురు కౌన్సిలర్ల రాజీనామా.. !
- Vemulawada: శవం ముందు ఆస్తి పంచాయితీ! వేములవాడలో మానవత్వం మంటగలిసిన వైనం..
- CM Revanth Reddy: మనకు ఏ రాష్ట్రంతోనూ పోటీ లేదు, నేరుగా చైనా, జపాన్తోనే పోటిపడుతున్నాం..
- Harassment: గురూజీ వలలో సాఫ్ట్వేర్ ఉద్యోగి భార్య.. అంతా చాటింగ్ల ద్వారానే..
తెలంగాణ వచ్చిన తర్వాత సీఎం కేసీఆర్ నేతృత్వంలో బీసీల అభ్యున్నతికి కృషి చేస్తున్నారని తెలిపారు. బీసీ కులాలకు గత పాలకులు చదువును దూరం చేశారని, 75 ఏళ్ల పాలనలో 19 బీసీ గురుకులు మాత్రమే ఉన్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ వచ్చిన తర్వాత బీసీ బిడ్డలను ముందుకు తీసుకొని పోవటానికి 200 బీసీ గురుకులను సీఎం కేసీఆర్ ఏర్పాటు చేశారని గుర్తు చేశారు.
బీసీ బిడ్డలు సీఎం కేసీఆర్ కల్పించిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని పిలుపు నిచ్చారు. బీసీ కులాల బిడ్డలు ప్రభుత్వ ఉద్యోగులు కోసం పోటీ పడుతున్నారు. వారి కోసం స్టడీ సెంటర్లను సీఎం కేసీఆర్ ఏర్పాటు చేస్తున్నారని అన్నారు. ఈ స్టడీ సెంటర్లను ఉపయోగించుకొని బీసీలు మంచి భవిష్యత్తు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు.
1.20వేల మంది బీసీలకు ఉచిత కోచింగ్ ఇస్తున్నామని, గ్రూప్1 ఉద్యోగల భర్తీలో ఎటువంటి పైరవీలకు తావు లేదని అన్నారు. ఈ ప్రభుత్వం వెనుకబడిన ప్రజల ప్రభుత్వం, బీసీ కులాలు అభివృద్ధికీ పాటుపడే ప్రభుత్వమని పేర్కొన్నారు. ప్రపంచంలో ఎక్కడలేని విధంగా ఆడబిడ్డల పెళ్లిళ్లకు కళ్యాణలక్ష్మీ పథకం ద్వారా డబ్బులు ఇస్తున్న ఏకైక నాయకులు సీఎం కేసీఆర్ అని తెలిపారు.
నా చేతుల మీదుగా.. ఎంతో మంది ఆడబిడ్డలను చెక్కులు అందజేశానని అందుకు నాకు ఎంతో ఆనందంగా వుందని పేర్కొన్నారు. మా బీసీల అభివృద్ధికీ జిల్లాలో పాటుపడుతున్న మంత్రి అజయ్ కుమార్ కు కృతజ్ఞతలు అని అన్నారు.
ఒక్క క్షణం.. ఆలోచించండి.. సోషల్ మీడియా దేనికి వాడుతున్నారు మీరు..?
తాజావార్తలు
-
IDBI Bank Stake Sale: IDBI బ్యాంక్లో భారీ మార్పు! 60.72% వాటాల విక్రయం.. డీల్ విలువ రూ.52,878 కోట్లు
-
Tirumala Laddu Ghee Case: కల్తీ నెయ్యి వ్యవహారంలో కీలక పరిణామం.. భారీగా ఆస్తులు అటాచ్ చేసిన ఈడీ
-
Congress Councillors: కాంగ్రెస్కు ఏడుగురు కౌన్సిలర్ల రాజీనామా.. !
-
Meerut Blue Drum Murder: మీరట్ ‘‘బ్లూ డ్రమ్ మర్డర్’’.. మరణశిక్ష విధిస్తూ ‘‘భగవద్గీత’’ను ప్రస్తావించిన న్యాయమూర్తి.!
-
Tecno Spark 50s 5G: టెక్నో Spark 50s 5G లాంచ్ డేట్ ఫిక్స్.. iPhone 18 Pro తరహా Burgundy Red కలర్లో కొత్త ఫోన్!
ట్రెండింగ్
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్‌ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!
-
Qais Ahmad: మాములు యాక్టింగ్ కాదయ్యా.. నీ పెర్ఫార్మన్స్కు ఆస్కార్ కూడా పనికిరాదేమో.! వీడియో వైరల్..
-
టాటా.. బైబై.. గయా.. WCL 2026 లీగ్ స్టేజీలోనే ఇండియా చాంపియన్స్ ఔట్..!
-
How To Grow Tej Patta In Pots: మార్కెట్ నుంచి తెచ్చే పని లేదు.. ఇంట్లోనే ఈజీగా బిర్యానీ ఆకు మొక్కను పెంచండి..