Hyderabad : నానమ్మ జ్ఞాపకార్థంగా స్కూల్ భవనం.. కేటీఆర్ ట్వీట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ మరో గొప్ప నిర్ణయం తీసుకున్నారు. తన నానమ్మ వెంకటమ్మ జ్ఞాపకార్థంగా స్కూల్ భవనాన్ని నిర్మిస్తున్నట్లు కేటీఆర్ ట్వీట్ చేశారు. నానమ్మను స్మరించుకోవడానికి ఇంతకంటే మంచి మార్గం గురించి ఆలోచించడం లేదన్నారు. నా గ్రామం – నా పాఠశాల కార్యక్రమం కింద తన సొంత ఖర్చులతో పాఠశాల భవనాన్ని నిర్మిస్తున్నట్లు చెప్పారు.
అయితే.. ఇటీవలె ట్విట్టర్ వేదికగా.. యంగ్ ఇండియా కల సాకారం కావాలంటే.. కుల, మతాలను పక్కన పెట్టాలని మంత్రి కేటీఆర్ సూచించించారు. ఆ తర్వాత ప్రపంచంలోని అత్యుత్తమైన వాటితో పోటీ పడాలని విజ్ఞప్తి చేశారు. డెవలప్‌మెంటల్ నేషనలిజమ్ యువత ఎంజెడాగా ఉండాలని కేటీఆర్ పేర్కొన్నారు. భారతదేశాన్ని ప్రపంచంలోనే సముచిత స్థానంలో నిలిపేందుకు దారులను వెతుక్కోవాలన్నారు. ఇది ఇప్పటికీ కాకపోతే ఎప్పటికీ కాదు అని కేటీఆర్ తన ట్వీట్‌లో పేర్కొన్నారు.
Also Read
రెండు రోజుల క్రితం రాహుల్ గాంధీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాను ఉద్దేశించి విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. ‘పొలిటికల్ టూరిస్టులు రావొచ్చు, వెళ్ళొచ్చు. కేసీఆర్ గారు మాత్రమే తెలంగాణలో ఉంటారు’ అంటూ తన శైలిలో కేటీఆర్ ట్వీట్ వేదిగా పంచ్ వేశారు. తాజాగా జేపీ నడ్డాను ఉద్దేశించి చేసిన ట్వీట్ చేశారు.
హాలో.. నడ్డా జీ.. కర్ణాటకలో ముఖ్యమంత్రి కావాలంటే 2,500 రూపాయలు కోట్లు అడుగుతున్నారు అంట కదా..? అని కేటీఆర్ అడిగారు. 40 శాతం కమీషన్ ఇవ్వాలని కాంట్రాక్టర్, 30 శాత కమీషన్ ఇవ్వాలని హిందూ మఠం వాళ్లు కూడా అడుగుతున్నారని అన్నారు. వీటన్నింటిపై ఎలా స్పందిస్తారని ప్రశ్నించారు. ఈడీ, ఐటీ, సీబీఐల విచారణకు ఏమైనా ఆదేశాలు ఉన్నాయంటూ మంత్రి చేసిన ట్వీట్ వైరల్ అయ్యింది.
కాగా.. కామారెడ్డి జిల్లా బేబీ పేట మండలం కోనాపూర్ గ్రామానికి ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ చేరుకున్న ఆయన్ను మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్, ఎంపీ బీబీ పాటిల్, జిల్లా కలెక్టర్ జి వి పాటిల్ ఘన స్వాగతం పలికారు. గాంధీ, అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలవేసి కేటీఆర్ నివాళులర్పించారు. గ్రామంలో సీసీ రోడ్డు పనులను, కార్పొరేట్ స్థాయిలో పాఠశాలకు భూమి పూజ నిర్వహించారు. 20 లక్షలతో నిర్మించిన గ్రామ పంచాయితీ భవనాన్ని కేటీఆర్ ప్రారంభించారు. కామారెడ్డి జిల్లాలోని కోనాపూర్‌లో స్కూల్ భవనానికి శంకుస్థాపన చేయడం ఆనందంగా ఉందని కేటీఆర్ పేర్కొన్నారు.
Snake Hulchul: కలెక్టరేట్‌లో పాము కలకలం
- Tags
- Grandmother
- kcr
- ktr twitter
- memory
- Nadda
తాజావార్తలు
-
Rahul Gandhi: బ్రిక్స్ డిన్నర్ మెనూపై రాహుల్ రాజకీయం..
-
India: అమెరికా, చైనాలను దాటి భారత్ నెంబర్-1.. యూఎస్ ఆర్థికవేత్త సంచలన వ్యాఖ్యలు..
-
Ganesh Idol Protest: ‘వినాయకుడి’తో వినూత్న నిరసన.. దేవుడికి ఈ తిప్పలు తప్పలేదా..?
-
New Smart Phone: 10,000mAh బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా.. కనీవినీ ఎరుగని రీతిలో రెడ్ మీ కొత్త సిరీస్.. సెప్టెంబర్ 15న లాంచ్..
-
AA24 Secret Out: ఇండస్ట్రీని షేక్ చేస్తున్న AA24 సీక్రెట్ లీక్! అల్లు అర్జున్ అడ్డాలో ఆ స్టార్ రైటర్..
ట్రెండింగ్
-
International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్‌తో సెప్టెంబర్ 15న భారత్‌లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!