ఆపదలోనైనా ప్రజలకు మేమున్నామంటూ చేదోడుగా నిలిచి, తమ కర్తవ్యాన్ని నిర్వర్తిస్తున్న జర్నలిస్టులకు ప్రభుత్వం అండగా ఉంటుందని మంత్రి హరీశ్ రావు భరోసా ఇచ్చారు. టీయూడబ్ల్యూజే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.విరాహత్ అలీ అధ్యక్షతన బాగ్ లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో మీడియా, సాహిత్యం అవార్డుల ప్రధానోత్సవ సమావేశం జరిగింది. ఆర్ఎస్ఎన్ సేవా ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ సభకు ముఖ్యఅతిథిగా హాజరైన హరీశ్ రావు మాట్లాడుతూ జర్నలిస్టులు ప్రజాసమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తున్నారని కొనియాడారు. జర్నలిస్టుల సంక్షేమానికి…
తెలంగాణ బీజేపీకి తొమ్మిది మంది అధికార ప్రతినిధులు ఉన్నారు. ఇందులో ముగ్గురు గతంలో నియమితులు కాగా.. రీసెంట్ గా మరో ఆరుగురునీ నియమించారు బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. అధికార ప్రతినిధుల ప్రధాన బాధ్యత.. రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న పరిణామాల పై, సంఘటనల పై స్పందించడం… వివిధ అంశాల పై పార్టీ వైఖరి ఏంటో చెప్పడం. దీంతో పాటు సీనియర్ నేతల మీడియా సమావేశాలు ఉంటే.. ముందే మెటీరియల్ సమకుర్చడం.. బ్యాక్ ఆఫీసు సపోర్ట్ గా…
తెలంగాణలో చరిత్ర కలిగిన శివాలయ అభివృద్ధికి నిధులు ఏదైనా తెచ్చవా..? మసీదు తవ్వితే శివ లింగాల గురించి పక్కన పెట్టు.. కాకతీయుల కాలం నుంచి ఉన్న శివాలాయాలకు నిధులు ఏమైనా ఇప్పించావా.? అని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ ను ప్రశ్నించారు కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి. సంగారెడ్డి లో కల్పకుర్ గ్రామంలో వెయ్యేళ్ళ క్రితం శివాలయం ఉందని.. ఈ దేశాలయానికి కేంద్రం నుంచి నిధులు ఇప్పంచు అని డిమాండ్ చేశారు. తవ్వకాలు వదిలి, భూమి మీద…
ప్రజా ప్రస్థాన యాత్రలో భాగంగా వేయి కిలోమీటర్లు పూర్తి చేసుకుని ప్రతిక్షణం, ప్రతిరోజు రైతుకోసం చేస్తున్న రైతుగోస ధర్నాలో పాల్పంచుకున్న అందరికి ధన్యావాదాలు తెలిపారు వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల. సదాశివునిపేటలో రైతుగోస ధర్నాలో పాల్గొన్నషర్మిల సీఎం కేసీఆర్పై విమర్శలు గుప్పించారు. యాసంగి ధాన్యం కొనుగోలు చేయాలని, పంట వేయని రైతులకు ఎకరాకు 25 వేలు పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. సీఎం కేసీఆర్ మోసం చేయని వర్గం లేదని, దొంగ హామీలు ఇచ్చేందుకు…
కేసీఆర్ ఇతర రాష్ట్రంలో రైతులకు పరిహారం ఇవ్వడంపై అత్త సొమ్ము అల్లుడి దానం చేసినట్లు ఉందని వైఎస్ షర్మిల ఎద్దేవచేశారు. వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు షర్మిల ప్రజాప్రస్థానం పాదయాత్రను ఇవాల్టి (శనివారం) నుంచి పునఃప్రారంభించనున్న సంగతి తెలిసిందే.. ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గం తాళ్లమడ గ్రామం వద్ద పాదయాత్ర 1000 కి.మీ పైలాన్ నుంచే పాదయాత్ర సందర్భంగా మాట్లాడుతూ.. టిఆర్ ఎస్ ప్రభుత్వ తీరుపై నిప్పులు చెరిగారు. ఖజానా ఖాళీ కావడం కేసీఆర్ అసమర్థ పాలనకు నిదర్శనమని ఆగ్రహం…
దావోస్ ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సులో మంత్రి కే తారకరామారావుకు వచ్చిన ఆదరణను చూసి బీజేపీ నేతలకు భయం పట్టుకొన్నదని మంత్రి తలసాని ఎద్దేవా చేశారు. అక్కడికి అన్ని రాష్ట్రాల మంత్రులు వెళ్లినా కేటీఆర్ సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్గా నిలిచారని, రాష్ట్రానికి భారీ ఎత్తున పెట్టుబడులు తీసుకొస్తున్నారని తెలిపారు. తెలంగాణ పథకాలనే కేంద్రం కాపీ కొట్టి అమలు చేస్తున్నదని గుర్తుచేశారు. మోదీ రోజుకు పది డ్రెస్సులు మార్చుడు తప్ప.. ఎనిమిదేండ్లలో దేశానికి ఏమైనా మంచి చేశారా? అని…
అమిత్ షా మాటలను మరోసారి నరేంద్రమోదీ రిపీట్ చేశారు అంతే.. అంటూ.. ఎమ్మెల్యే బాల్క సుమన్ అన్నారు. నిన్న జరిగిన మోడీ హైదరాబాద్ పర్యటలో భాగంగా.. సీఎం కేసీఆర్ కుటుంబ పాలనపై మోడీ ప్రస్తావించడంతో.. టీఆర్ ఎస్ ఎమ్మెల్యే బాల్క సుమన్ స్పందించారు. మోడీ మాటలకు ఈ సందర్భంగా చురకలంటించారు. నరేంద్రమోదీ మాటలను టీఆరెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తోందని ఎమ్మెల్యే బాల్క సుమన్ అన్నారు. తెలంగాణ ఏర్పాటుకు నరేంద్రమోదీ పచ్చివ్యతిరేకి అంటూ మండిపడ్డారు. తెలంగాణ ప్రజలు రాష్ట్రం…
సీఎం కేసీఆర్ శుక్రవారం (ఇవాళ) చేపట్టాల్సిన రాలేగావ్ సిద్ది (మహారాష్ట్ర) పర్యటన రద్దయినట్లు సమాచారం. ఇదివరకు సీఎంవో ప్రకటించినదాని ప్రకారం.. ముఖ్యమంత్రి మే 26న బెంగళూరు, 27న రాలేగావ్ సిద్ది పర్యటన చేపట్టాల్సి ఉంది. రాలేగావ్ సిద్దిలో ప్రముఖ సామాజిక ఉద్యమకారుడు అన్నాహజారేతో భేటీ కావాల్సి ఉంది. అనంతరం షిర్డీ వెళ్లి సాయిబాబాను దర్శించుకుని హైదరాబాద్కు చేరుకుంటారని సీఎంవో గతంలో వెల్లడించింది. ఈమేరకు సీఎం 26న బెంగళూరుకు వెళ్లి, సాయంత్రం 7 గంటల ప్రాంతంలో హైదరాబాద్కు తిరిగి…
హైదరాబాద్ పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలు తెలంగాణ ప్రజల్ని బాధించిందని విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి వ్యాఖ్యానించారు. ఐటీఐఆర్, పాలమూరు ప్రాజెక్ట్లకు జాతీయ హోదా ప్రకటిస్తారేమోనని ఎదురుచూస్తే.. అవేమీ ఇవ్వకపోగా తన హోదాకు తగినట్లు మాట్లాడలేదని అన్నారు. ఒక విద్యాలయం కార్యక్రమంలో పాల్గొనటానికి వచ్చి రాజకీయాలు మాట్లాడటం సమంజం కాదన్నారు. రాజకీయాలకు బదులు తెలంగాణ విద్యార్థుల కోసం నూతన విద్యాలయాలపై ఏదైనా ఒక ప్రకటన చేసి ఉంటే, తెలంగాణ సమాజం హర్షించేదన్నారు. ‘బేటి…