Y. S. Sharmila: దమ్ము ఉంటే నన్ను అరెస్ట్ చేయండి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Y. S. Sharmila: మీకు దమ్ము ఉంటే మమ్మల్ని అరెస్ట్ చేయండి. నాకు భేడిలు అంటే భయం లేదు. మీకు చేతనైతే అరెస్ట్ చేయండని YSR తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల సవాల్ విసిరారు. పాదయాత్ర ఆపుతారట..నా పాదయాత్ర తో ప్రజల్లో అభిమానం పెరుగుతుందని మీకు అర్థం అయ్యింది. పాదయాత్ర తో ప్రజా సమస్యలు బయటకు వస్తున్నాయని మీకు తెలిసింది. మీ ప్రభుత్వం మీద వ్యతిరేకత బయట పడింది. అందుకే వైఎస్సార్ తెలంగాణ పార్టీ నీ కట్టడి చెయ్యడానికి కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. నన్ను అరెస్ట్ చేసి, పాదయాత్ర ఆపే కుట్ర చేస్తున్నారని మండిపడ్డారు. కేసీఅర్ కి తెలిసింది ఒకటే.. ప్రశ్నిస్తే అరెస్ట్ లు చేస్తారు అని ఆగ్రహం వ్యక్తం చేశారు. మీ బెదిరింపులకు భయపడే వ్యక్తిని నేను కాదు. నేను వైఎస్సార్ బిడ్డ వైఎస్ షర్మిలను. మీకు దమ్ముంటే నన్ను ఆపండి అని సవాల్ విసిరారు. మాపై నిరంజన్ రెడ్డి పిర్యాదు చేస్తే వెంటనే FIR ఫైల్ చేశారు. అదే నిరంజన్ రెడ్డి మీద మేము పిర్యాదు చేస్తే యాక్షన్ లేదు అని మండిపడ్డారు. కనీసం FIR కూడా నమోదు చేయడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. మరదలు అని అసభ్యకర పదజాలంతో దోషిస్తే కేసు పెట్టడం లేదు.
నా ఆత్మాభిమానం దెబ్బ తీస్తున్నారు. నన్ను మరదలు అంటే నేను పట్టించుకోకుండా ఉండాలా..? అని ప్రశ్నించారు. ఇదేనా తెలంగాణలో మహిళల మీద గౌరవం? అని మండిపడ్డారు. తెలంగాణలో మంత్రుల మీద కేసులు వేయకూడదా…? డైరెక్ట్ గా చెప్పండి. మేము మంత్రుల మీద కేసులు నమోదు చేయం అని. నేను వైఎస్సార్ బిడ్డ అయి ఉండి కూడా కేసు పెడితే నమోదు చేయడం లేదు. ఇక సామాన్యుల పరిస్థితి ఎంటి..? అని ప్రశ్నించారు. ఇది నిజంగా తాలిబన్ల రాజ్యమే.. తెలంగాణలో ప్రజా స్వామ్యమే లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒకడు మరదలు అంటాడు…ఒకడేమో వ్రతాలు అంటాడు. పోలీస్ శాఖ ను టీఆర్‌ఎస్ లో విలీనం చేయండి అని షర్మిల మండిపడ్డారు. RSS లా trs కి ఒక సైన్యం లా పని చేయండి. మీకు దమ్ము ఉంటే మమ్మల్ని అరెస్ట్ చేయండి. నాకు భేడిలు అంటే భయం లేదు. మీకు చేతనైతే అరెస్ట్ చేయండి. నా పేరు వైఎస్ షర్మిల..నేను వైఎస్సార్ బిడ్డను. గుర్తు పెట్టుకో కేసీఅర్.. నేను పులి బిడ్డను. వైఎస్సార్ ను కుట్ర చేసి చంపారు..నన్ను కూడా చంపగలరు. నా గొంతు నొక్కడం, నన్ను ఆపడం మీ తరం కాదు. మీతో పోలీస్ లు ఉంటే..నాతో జనం ఉన్నారన్నారు. తెలంగాణలో ఏ మహిళ నైనా అడగండి మరదలు అంటే చెప్పుతో కొడతారా..లేదా? రైతుల మీద ప్రేమ లేని నిరంజన్ రెడ్డి వ్యవసాయ శాఖ మంత్రి. రైతులను సినిమా టిక్కెట్లు తో పోల్చారు. ఉద్యోగాలు అడిగితే హమాలి పని చేసుకో అంటారని మండిపడ్డారు షర్మిళ అన్నారు.
Also Read
తాజావార్తలు
-
Telangana Cabinet: తెలంగాణలో కరువు టెన్షన్.. 235 మండలాల్లో వర్షభావం..
-
Flydubai: మహిళలతో కరచాలనానికి కో-పైలట్ ఎందుకు నిరాకరించాడు? కారణమిదేనా?
-
Sumalatha: ఫిల్మ్ ఛాంబర్ మీట్.. జానీమాస్టర్ భార్య సుమలత హల్చల్.. వైరల్ అవుతున్న వీడియో!
-
Smit Machchhar: భారత హీరో పైలట్‌కు గుజరాత్ అత్యున్నత పురస్కారం..
-
TG TET 2026 : టీచర్లకు గుడ్ న్యూస్.. ప్రత్యేక TG TET-2026-II నోటిఫికేషన్.!
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?