నరేంద్ర మోడీ నీ దేశం నుండి తరిమి కొట్టేందుకు మీరు ఎవరు? కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రశ్నించారు. గవర్నర్ ను అవమానిస్తారు… మంత్రులతో తిట్టిపిస్తారని మండిపడ్డారు. అధికారం పోతుంది అనే భయంతో కేసీఆర్ ఉన్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారం దూరం అవుతుందని అందరినీ గోకుతున్నారని విమర్శించారు. సీబీఐ, ఈడి రావాలి మళ్ళీ సానుభూతి పొందాలి, సెంటిమెంటు వాడుకోవాలి అని అనుకుంటున్నారని ఎద్దేవ చేశారు. అహంకారంతో మాట్లాడుతుంది మేము కాదు మీరని కిషన్ రెడ్డి అన్నారు.
నరేంద్ర మోడీ నీ దేశం నుండి తరిమి కొట్టేందుకు మీరు ఎవరు? అని ప్రశ్నించారు కిషన్ రెడ్డి. మా పార్టీ ఫౌండర్ కాశ్మీర్ కోసం ప్రాణం అర్పించారని గుర్తు చేశారు. దళితులకు వెన్నుపోటు పొడిచిన నువ్వు! మోడీ ని తరిమి కొడతావా? అంటూ మండిపడ్డారు. కరెంట్ మోటర్ లకు మీటర్ లు పెట్టాలని కేంద్రం కి లేదని స్పష్టం చేశారు. అధికారం కోసం కేసీఆర్ రైతులను, విద్యుత్ ఉద్యోగులను మభ్యపెడుతున్నారని మండిపడ్డారు. పచ్చి అబద్ధాలు కేసీఆర్ మాట్లాడుతున్నారని, తొండి ఆట ఆడుతున్నాడని ఆగ్రమం వ్యక్తంచేశారు. కేంద్ర ప్రభుత్వం రుణాలు ఇవ్వకుండా.. ఒక్క ప్రాజెక్ట్ కట్టావా? అంటూ ప్రశ్నించారు. ఈటెల సస్పెన్షన్ అతి చర్య అన్న కిషన్ రెడ్డి.. సీఎం మాటల పట్ల స్పీకర్ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
Kishan Reddy: మోడీ నీ గద్దె దించుతాడు అట.. కేసీఆర్ నోటి నుండి వస్తే అమృత పదాలా?