మన రాష్ట్ర సంస్కృతి, సంప్రదాయాల గురించి అస్సాం సీఎంకు ఏం తెలుసు అని ఎమ్మెల్యే దానం నాగేందర్ మండిపడ్డారు. ఖైరతాబాద్ నియోజకవర్గం హిమాయత్ నగర్ లోని హైదర్ గుడాలో దానం నాగేందర్ చేతుల మీదుగా 900 వందల మందికి అసారా పెన్షన్ల గుర్తింపు కార్డుల పంపిణీ చేశారు. వృద్ధులు, వితంతువులు, వికలాంగులు, ఒంటరి మహిళలు, డయాలసిస్ రోగులకు, 57 సంవత్సరాలు నిండిన ప్రతి మనుషులు అర్హువులుగా గుర్తించి సీఎం కేసీఆర్ ఈ ఆసరా పథకం ముందుకు తెచ్చారన్నారు. తెలంగాణ రాష్ట్ర సంస్కృతి, సంప్రదయాలగూర్చి అస్సాం ముఖ్యమంత్రికి ఏం తెలుసని ప్రశ్నించారు. తెలంగాణలో 100ల సంవత్సరాలుగా గణేష్ నిమర్జన కార్యక్రమాలు జరుగుతున్నాయని అన్నారు.
read also: Revanth Reddy Letter to CM KCR: వారి సమస్యలు పరిష్కరించండి.. సీఎం కు రేవంత్ రెడ్డి లేఖ
ఒక ముఖ్యమంత్రి గూర్చి అస్సాం ముఖ్యమంత్రి మాట్లాడడం వారి విజ్ఞతకే వదులుతున్నామన్నారు. తెలంగాణలో ముఖ్యమంత్రి కేసీఆర్ మత సమరష్యాలకు కృషి చేస్తుంటే.. బీజేపీ వాళ్ళు వినాయక నిమార్జనంలో మత ఘర్షణలు చేయాలని చూశారని మండిపడ్డారు. నందుబిలాల్ ఏం తప్పు చేశారు? అని ప్రశ్నించారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ను, తెలంగాణ సంస్కృతి కి వ్యతిరేకంగా మాట్లాడడం తప్పు అన్నారు. మొదటి సారి చార్మినార్ భాగ్యలక్ష్మి ఆలయ ప్రాంగణంలో బీజేపీ స్వాగత వేదిక ఏర్పాటు చేయడం వెనుక, అక్కడ అల్లర్లు చేయడమే కుట్రగా తెలిపారు. ఇతర రాష్ట్రాలకు చెందిన బీజేపీ మంత్రులు, ముఖ్యమంత్రులు తెలంగాణ రాష్ట్రానికి వచ్చిన భాగ్యలక్ష్మి ఆలయం వద్దకు పోవడం బీజేపీకి అలవాటు అయ్యిందన్నారు. అస్సాం ముఖ్యమంత్రి వినాయక వేధికలమీద రాజకీయాలు చేయడం అస్సాం సంస్కృతికి హాని అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
read also: Rebel Star Krishnam Raju Passes Away Live Report: వెండితెర రారాజు ఇకలేరు
తన నియోజక వర్గంలో ఇప్పటికి 100మందికి దళిత బంధువు ఇచ్చి దళితులకు ఈ ప్రభుత్వం అండగా నిలిచిందని అన్నారు. రానున్న రోజుల్లో ఖైరతాబాద్ నియోజకవర్గంలో మరో 3000వేలు మందికి దళిత బంధువు ఇవ్వబోతున్నామని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతి నిరుపేద ఆర్థికంగా అభివృద్ధి చెందలన్నదే వారి అశేయమన్నారు. గతంలో ఎప్పుడు లేనివిధంగా ఖైరతాబాద్ నియోజకవర్గం ఎంతో అభివృద్ధి చెందిందని అన్నారు. డబుల్ బెడ్రమ్,ఆసరా పెన్షన్,దళిత బందు,కల్యాణ లక్ష్మీ,లాంటివి ఇప్పిస్తామని చెప్పి డబ్బులు వసూలు చేస్తే వారిపట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. ప్రభుత్వం ఇస్తున్న పతకాలు కాబట్టి దళారులకు ఎవరికి డబ్బులు ఇవ్వవొద్దన్నారు. ప్రతి ఒక ఇంటికి ముఖ్యమంత్రి కేసీఆర్ పథకాలు అందుతున్నాయన్నారు.
Surat Fire Accident: సూరత్‌లో భారీ అగ్నిప్రమాదం… ఒకరి మృతి, 20 మందికి గాయాలు