టీడీపీ పై సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. టీడీపీ మళ్ళీ బతికే అవకాశం కేసీఆర్ ఇచ్చారని గ్గారెడ్డి సంచళన వ్యాఖ్యలు చేశారు. చాలా సమస్యలు ఈ ప్రభుత్వం పట్టించు కోలేదని ఆరోపించాఉ. మా పార్టీ సమస్య లు మీద ఏం మాట్లాడనంటూ తెలిపారు జగ్గారెడ్డి.
ఉపాధిహామీ పథకం.. తెలంగాణ ప్రభుత్వానికి అక్షయ పాత్రగా మారింది బీజేపీ నేత బూర నర్సయ్య గౌడ్ అన్నారు. రైతు కల్లాలు ఎక్కడ ఉన్నాయి ? అని ప్రశ్నించారు. బిల్లులు ఎత్తుకున్నారు ? చట్ట వ్యతిరేకంగా వాడారు ? కల్లాల పేరుతో బీఆర్ఎస్ నేతలు తిన్నది అడిగితే.. కేంద్రం రైతు వ్యతిరేకమని ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.
వ్యవసాయంలో 10 శాతం వృద్ధి రేటు తెలంగాణ సాధించిందని ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు అన్నారు. నాబార్డ్ స్టేట్ క్రెడిట్ సెమినార్ లో ముఖ్య అతిథిగా ఆర్ధిక శాఖ మంత్రి హరీష్ రావు, సీఎస్, ఆర్బీఐ, బ్యాంకర్లు.. హాజరయ్యారు.
రాష్ట్రంలోని ఉపాధి హామీ పనుల పైన కేంద్ర దుష్ప్రచారానికి వ్యతిరేకంగా బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో అన్ని జిల్లా కేంద్రాల్లో రేపు ఆందోళన కార్యక్రమాలు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ పిలుపు నిచ్చారు.
జమిలి ఎన్నికలు రావాలని కోరుకుంటున్నామని బీజేపీ పార్లమెంటరీ బోర్డ్ మెంబర్ డా.లక్ష్మణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కేంద్రం నుంచి ఎక్కువ నిధులు రాబట్టేందుకు కేసీఆర్ ఎలాంటి ప్రయత్నాలు చేయడం లేదని కోరారు.
దేశ రాజధాని ఢిల్లీలో BRS ఆఫీసు ప్రారంభించిన తర్వాత వివిధ రాష్ట్రాల్లో పార్టీ విస్తరణపై ఫోకస్ పెట్టారు గులాబీ దళపతి, సీఎం కేసీఆర్. అబ్కీ బార్.. కిసాన్ సర్కార్ అనే నినాదంతో పాగా వేయడానికి చూస్తున్నారు. ముఖ్యంగా బీజేపీకి వ్యతిరేకంగా పొలిటికల్ స్పేస్ ఉన్న రాష్ట్రాలపై కేసీఆర్ నజర్ ఉంది. ఆ విధంగా తెలుగు రాష్ట్రమైన ఏపీపైనా ఆరా తీస్తున్నారట. ఇప్పటికే BRS విస్తరణ దిశగా చర్యలూ మొదలైనట్టు తెలుస్తోంది. మరో ఏడాదిలో తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు…
టీఆర్ఎస్ను బీఆర్ఎస్గా మార్చి జాతీయ రాజకీయాల్లో అడుగుపెట్టారు గులాబీ దళపతి, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్.. ఆంధ్రప్రదేశ్లో బీఆర్ఎస్ను విస్తరించేందుకు వ్యూహాలు సిద్ధం చేస్తున్నారు. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో చంద్రబాబుకు వ్యతిరేకంగా.. వైసీపీ గెలుపునకు అన్ని విధాలా సహకరించారు. తెలంగాణలో అనుసరిస్తున్న వ్యూహాన్ని.. త్వరలో ఏపీలోనూ అమలు చేసే దిశగా కేసీఆర్ చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. ఓవైపు బీజేపీకి, మరోవైపు ఆ పార్టీకి అనుకూలంగా ఉన్న ప్రాంతీయ పార్టీలకు చెక్ పెట్టేందుకు కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. తెలంగాణ తర్వాత…