తక్షణమే పదవికి సోమేశ్ కుమార్ రాజీనామా చేయాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ శ్రీ బండి సంజయ్ కుమార్ హైదరాబాద్ లో ప్రకటన విడుదల చేసారు. తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా సోమేశ్ కుమార్ కొనసాగింపును రద్దు చేస్తూ రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం వెలువరించిన తీర్పు నేపథ్యంలో తక్షణమే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పదవికి సోమేశ్ కుమార్ రాజీనామా చేయాలని బీజేపీ సూచిస్తోందన్నారు.
6 నెలల్లో ఎప్పుడైనా ఎన్నికలు రావొచ్చని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కార్యకర్తలను జైళ్లకు పంపించే కుట్ర కేసీఆర్ చేస్తున్నారని మండిపడ్డారు. ఎన్నికల లిస్ట్ నుండి బీజేపీ వాళ్ళ ఓట్లను తొలగించే ప్రయత్నం జరుగుతుంని ఆగ్రహం వ్యక్తం చేశారు.
గతంలో సవాల్ చేసి తోక ముడుచుకొని పారిపోయింది మీరంటూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కేంద్ర నిధులపై కేటీఆర్ మీ అయ్యతో చర్చకు సిద్దం.. రాజీనామ పత్రం పట్టుకొని మీ అయ్యను రమ్మను అంటూ సవాల్ విసిరారు.
2 లక్షల మంది పోలీస్ అభ్యర్థుల విన్నపాన్ని వినే సమయం సీఎం కు లేదా? అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ కుమార్ మండిపడ్డారు. బీజేవైఎం కార్యకర్తలు, పోలీసు పరీక్ష అభ్యర్థుల అరెస్టును ఖండించారు.
ఢిల్లీ లిక్కర్ స్కాంపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కీలక వాఖ్యలు చేశారు. లిక్కర్ కేసులోకి తెలంగాణ వాళ్ళను రమ్మని మేం పిలవలేదన్నారు. దర్యాప్తు జరుగుతుంటే కల్వకుంట్ల కుటుంబ సభ్యుల పేర్లు వచ్చాయని సంచలన వ్యాఖ్యలు చేశారు కేంద్రమంత్రి. నిప్పులు వస్తుందో లిక్కర్ వస్తుందో మాకు తెలియదని చురకలంటించారు.
Chinta Mohan: ఇద్దరు చంద్రుల మధ్య వివాదమే ఏపీలో బీఆర్ఎస్ ఎంట్రీకి కారణంగా అభివర్ణించారు కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ చింతా మోహన్.. చంద్రబాబు అక్కడ (తెలంగాణలో) సభ పెడితే.. కేసీఆర్ ఇక్కడ (ఆంధ్రప్రదేశ్లో) పెడుతున్నాడన్నారు. ఇక, ఎన్టీఆర్ లాగా కేసీఆర్ కు కూడా ప్రధాని కావాలనే ఆశ ఉందేమో..? అనే అనుమానాలను వ్యక్తం చేశారు.. ఏపీలో వైసీపీ ప్రభుత్వం మళ్లీ రానే రాదు అని జోస్యం చెప్పారు.. వైసీపీ పైకి ఎన్ని గొప్పలు చెప్పినా..…
Revanth Reddy : తెలంగాణలో పలువురు ఐపీఎస్లకు బదిలీలతో పాటు పదోన్నతి కలిగింది. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే టీపీసీసీ రేవంత్ రెడ్డి ట్విట్టర్ వేదికగా ఓ పోస్ట్ పెట్టారు.
Bandi Sanjay: తెలంగాణలో ఎలాగైనా అధికారం సాధించడానికి బీజేపీ వేగంగా పావులు కదుపుతోంది. ఎన్నికలు దగ్గర పడుతుండడంతో అధిష్టానం నుంచి స్పష్టమైన ఆదేశాలు వచ్చాయి.
రాష్ట్ర వ్యాప్తంగానే కాకుండా దేశ వ్యాప్తంగా నిందుల డేటా బేస్ మన దగ్గర ఉందని డీజీపీ మహేందర్ రెడ్డి తెలిపారు. తెలంగాణ రాష్ట్రం మావోయిస్టు రహిత రాష్ట్రంగా ఉండాలని ప్రభుత్వం దిశా, నిర్దేశం చేసిందని పేర్కొన్నారు.