Kishan Reddy: ఢిల్లీ లిక్కర్ స్కాంపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కీలక వాఖ్యలు చేశారు. లిక్కర్ కేసులోకి తెలంగాణ వాళ్ళను రమ్మని మేం పిలవలేదన్నారు. దర్యాప్తు జరుగుతుంటే కల్వకుంట్ల కుటుంబ సభ్యుల పేర్లు వచ్చాయని సంచలన వ్యాఖ్యలు చేశారు కేంద్రమంత్రి. నిప్పులు వస్తుందో లిక్కర్ వస్తుందో మాకు తెలియదని చురకలంటించారు. తెలంగాణ వ్యక్తుల కోసం దర్యాప్తు ప్రారంభం కాలేదన్నారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ ను దర్యాప్తు చేస్తుంటే తెలంగాణ వాళ్ళ పేర్లు వచ్చాయని ఎద్దేవ చేశారు. కావాలనే కేంద్రం కక్ష్య కట్టింది అని ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. BRS కాదు WRS పెట్టుకున్నా మాకు నష్టం లేదని కొట్టిపడేశారు కిషన్ రెడ్డి. మాకు ముందస్తు ఆలోచన లేదని స్పష్టం చేశారు. గజ్వేల్, సిద్దిపేటల్లో రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు ఎలా పెడుతోంది? అని ప్రశ్నించారు. నిబంధనలకు విరుద్ధంగా ఉపాధి హామీ పథకం నిధులు మళ్లించి, పైగా కేంద్రానికి వ్యతిరేకంగా ధర్నాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
తెలంగాణలో ఆర్ధిక వ్యవస్థ దివాళా..
తెలంగాణలో ఆర్ధిక వ్యవస్థ దివాళా తీస్తోందని, జీతాలు ఇవ్వలేని పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. కేసీఆర్ వైఖరి ఇలాగే ఉంటే ఆర్ధిక సంక్షోభం తప్పదని మండిపడ్డారు. కల్వకుంట్ల రాజ్యంగం కొనసాగితే, రాష్ట్రం దివాళా తీయక తప్పదని సంచల వ్యాఖ్యలు చేశారు. కంటోన్మెంట్ విలీనంపై చర్చ జరుగుతోందని తెలిపారు. గ్రామ పంచాయితీల్లో అభివృద్ధి కోసం ఆర్థిక సంఘం సిపారస్ మేరకు నిధులు విడుదల చేసిందని అన్నారు. పంచాయితీల్లో త్రాగునీరు, పారిశుద్ధ్య కార్యక్రమాల కోసం, సిబ్బంది జీతాలు.. పంచాయతీలకు కేంద్రం ఇచ్చిన నిధులను గద్దల్లా రాష్ట్ర ప్రభుత్వం దారి మళ్లించిందని అన్నారు. బ్యాంకుల్లో పడ్డ డబ్బుల్ని గంటలోనే దారి మళ్లించారని ఆరోపించారు. డబ్బులు పడ్డ మెసేజ్ చూసి సర్పంచులు బ్యాంకులకు వెళ్తే అప్పటికే దారి మళ్లించారని అన్నారు. సర్పంచులకు తెలియకుండా డిజిటల్ కీ ని దుర్వినియోగం చేశారని అన్నారు. ఉపాధి హామీ పథకంలోనూ నిధులు దారి మళ్లించారని ఆరోపణలు గుప్పించారు.
కేంద్రంపై రాష్ట్రప్రభుత్వం విష ప్రచారం
కేంద్రంపై రాష్ట్రప్రభుత్వం విష ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. సర్పంచులు నిరసన కోసం కోర్టుకు వెళ్లి అనుమతి తీసుకోవాల్సి వచ్చిందని అన్నారు. తెలంగాణ ప్రభుత్వ తీరు ఏ రకంగా ఉందొ అర్ధం చేసుకోవచ్చని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. ఆత్మ నిర్భర భారత్ లో భాగంగా వంట నూనెల కోసం ప్రత్యేక పథకం రూపొందించారని అన్నారు. ఆయిల్ ఉత్పత్తులను పెంచేలా కేంద్రం నిర్ణయం తీసుకొందని తెలిపారు. 2025 నాటికి 12 లక్షల టన్నులు పెంచాలని టార్గెట్ పెట్టుకున్నామని కేంద్ర మంత్రి స్పష్టం చేశారు. ఆయిల్ ఫామ్ కోసం తెలంగాణ కు 114 కోట్ల రూపాయలు నిధులు కేంద్రం చెల్లించిందని స్పష్టం చేశారు. కిషన్ రెడ్డి చెప్పింది అబద్ధం, మాకు ఒక్క రూపాయి రాలేదని వక్ర భాష్యం చెప్తున్నారని నిప్పులు చెరిగారు. ప్రతి విషయాన్ని రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు.
పెట్రోల్, డీజిల్ ధరలపై కిషన్ రెడ్డి
పెట్రోల్, డీజిల్ ధరలపై కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు తెలంగాణలో అధికంగా ఉందని తెలిపారు. తెలంగాణలో పెట్రోల్, డీజిల్ అత్యధిక ధరలతో.. ప్రజలపై భారం మోపుతున్నారని మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే.. తెలంగాణలో 13 రూపాయలు ఎక్కువగా ఉందని కిషన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. పెట్రోల్, డీజిల్ పైఅత్యధిక వ్యాట్ తెలంగాణలో విధిస్తున్నారని అన్నారు. ఆర్ధిక మాంద్యం వల్ల ప్రపంచంలో పెట్రోల్ ధరలు పెరిగాయని అన్నారు. ప్రజలకు భారం పడొద్దని వ్యాట్ తగ్గించాలని కేంద్రం ప్రయత్నం చేసిందని గుర్తుచేశారు. దేశంలో 23 రాష్ట్రాలు వ్యాట్ ను తగ్గించాయని, 69,190 కోట్ల రూపాయల ఆదాయం తెలంగాణకు వచ్చిందని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. పెట్రోల్ పై తెలంగాణ కు ఏడాదికి 4,527 కోట్ల ఆదాయం ఉండగా.. ఇప్పుడు మూడు రెట్లు పెరిగి 13170 కోట్ల ఆదాయం వస్తోందని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. పెట్రోల్, డీజిల్ పై వ్యాట్ ను రాష్ట్ర ప్రభుత్వం ఒక్కరూపాయి కూడా తగ్గించలేదని అన్నారు. అదనపు భారం పడుతున్నా కేంద్రం పన్నులు పెంచటం లేదన్నారు. ఇతర రాష్ట్రాలకు నిధులు మల్లిస్తున్నారని ఆరోపిస్తారన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి.
TS Police Recruitment: ప్రగతి భవన్ వద్ద ఉద్రిక్తత.. పోలీసులకు బీజేవైఎం శ్రేణుల మధ్య తోపులాట