Bandi Sanjay: తెలంగాణలో ఎలాగైనా అధికారం సాధించడానికి బీజేపీ వేగంగా పావులు కదుపుతోంది. ఎన్నికలు దగ్గర పడుతుండడంతో అధిష్టానం నుంచి స్పష్టమైన ఆదేశాలు వచ్చాయి. ఇక తెలంగాణ ఇంచార్జ్ నుంచి సునీల్ బన్సాల్, తరుణ్ చుగ్, బండి సంజయ్, ఈటల రాజేంద్ర మీటింగ్ లో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. పార్టీలో చేరికలు వేగం పెంచాలని.. వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా అధికారం సాధించాలని గట్టిగా ఫిక్స్ అయ్యారు. దాంతో బీజేపీ మరో సారి స్పీడ్ పెంచింది. పార్టీ బలహీనంగా ఉన్న చోట చేరికలపై ఫోకస్ పెట్టాలని అధిష్టానం ఆదేశించింది. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల్లోని అసంతృప్తులను లాగడానికి గట్టిగానే ప్రయత్నిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో కనీసం 90 స్థానాలు గెలవాలని టార్గెట్ పెట్టుకున్నారు. బీజేపీ గ్రామ స్థాయిలో కమిటీలు ఏర్పాటు చేసుకుని ఎప్పుడు ఎన్నికలు వచ్చిన సిద్ధంగా ఉందని బండి సంజయ్ అన్నారు. అసెంబ్లీ వారిగా బీజేపీ సంస్థాగతంగా శక్తివంతంగా ఏర్పాటు చేశాం.. ఒక్కో అసెంబ్లీ కి నలుగురుని నియమించామన్నారు ఆ పార్టీ రాష్ట్రాధ్యక్షుడు బండి సంజయ్.
Read Also: Asteroid: 51వేల కి.మీ. వేగంతో భూమిపైకి దూసుకొస్తున్న ఆస్టరాయిడ్
రాష్ట్ర పార్టీలో కొత్త ఉత్సాహం వచ్చిందన్నారు. కాంగ్రెస్ పార్టీకి ఎంత మంది అభ్యర్థులు ఉన్నారు.. బీఆర్ఎస్ బ్యానర్ మీద పోటీ చేయడానికి ప్రతీ నియోజకవర్గంలో నాయకులు పోటీపడుతున్నారని బండి సంజయ్ అన్నారు. కావాలనే తమ మీద పోటీకి అభ్యర్థులు లేరని విష ప్రచారం చేస్తున్నారని ఆగ్రహించారు. 119 స్థానాల్లో పోటీ చేసిన పార్టీ బీజేపీ.. బీఅరెస్ మీద ప్రజలకు పూర్తి వ్యతిరేకత వచ్చిందన్నారు. ఇక్కడ ఉద్యోగులకు జీతాలు ఇవ్వని పరిస్థితి.. ఉంటే ఇతర రాష్ట్రాల ఎన్నికలకు పైసలు ఇస్తున్నాడని బండి సంజయ్.. అధికారపార్టీ నాయకుడిని ఉద్దేశించి మాట్లాడారు. ఎప్పటికైనా బీఆర్ఎస్ కి ప్రత్యామ్నాయం బీజేపీ మాత్రమేనన్నారు. మిషన్ 90 అంటే 90 స్థానాలు గెలుస్తాం.. కచ్చితంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామన్నారు బండి.. పాలకులు ప్రతి నెల వారికి కేటాయించిన నియోజకవర్గంలో 3 రోజులు పర్యటించాలని సూచించారు. విస్తరక్ లు ఫుల్ టైం వారికి కేటాయించిన నియోజకవర్గంలో పని చేయాలన్నారు. 15 నుండి ప్రతి రోజూ రెండు అసెంబ్లీ నియోజకవర్గంలో పర్యటిస్తామని ప్రకటించారు. ఫిబ్రవరి 13, 14 లలో ప్రధాని నరేంద్ర మోడీ ని ఆహ్వానించి భారీ సభ ఏర్పాటు చేయనున్నట్లు బండి సంజయ్ ప్రకటించారు.