బాలీవుడ్ రూమర్డ్ కపుల్ కార్తీక్ ఆర్యన్, హీరోయిన్ తార సుతారియా మరోసారి వార్తల్లో నిలిచారు. ఇటీవల ఈ యంగ్ హీరో తన 33వ ఏటా అడుగు పెట్టాడు. నవంబర్ 22 కార్తీక్ ఆర్యన్ బర్త్డే. ఈ సందర్భంగా ఫ్యామిలీ, ఫ్రెండ్స్, బాలీవుడ్ సెలబ్రిటీల మధ్య బర్త్డేను సెలబ్రేట్ చేసుకున్నాడు ఈహీరో. ఈ పార్టీకి హీరోయిన్ కృతి సనన్, దర్శక-నిర్మాత కరణ్ జోహార్, వాణి కపూర్ ఇతర నటీనటులు హాజరయ్యారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో హల్చల్…
బాలీవుడ్ గత కొంత కాలం గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటోంది. సరైన హిట్స్ లేని బాలీవుడ్ పూర్తిగా దక్షిణాది చిత్రపరిశ్రమపైనే ఆధారపడి ముందుకు వెళుతోంది. ఈ సమయంలో బాలీవుడ్ ఉనికిని చాటుతూ బాలీవుడ్ లో హిట్ కొట్టాడు కార్తీక్ ఆర్యన్. ఆ సినిమానే ‘భూల్ భూలయ్యా2’. దీనిని నిర్మించింది టీ సీరీస్ అధినేత భూషణ్ కుమార్. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 180 కోట్లను వసూలు చేసింది. దీంతో ఆ ఆనందాన్ని పంచుకోవడానికి నిర్మాత భూషణ్ కుమార్ తన…
బాలీవుడ్ స్టార్స్ కియారా అద్వానీ, సిద్ధార్థ్ మల్హోత్రాల లవ్ స్టోరీ, బ్రేకప్ గురించి బీటౌన్ లో హాట్ హాట్ గా చర్చ నడుస్తోంది. ఇన్నాళ్లూ డేటింగ్ చేస్తున్న కియారా, సిద్ధార్థ్ ఇప్పుడు విడిపోయారంటూ రూమర్స్ చక్కర్లు కొడుతున్నాయి. ఇక ఈ జంట ప్రేమలో ఉన్నారంటూ వార్తలు వచ్చినప్పుడే కాదు, ఇప్పుడు విడిపోయారంటూ ప్రచారం జరుగుతున్నా తన గురించి కాదన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. అంతేకానీ క్లారిటీ ఇవ్వట్లేదు. తాజాగా ఆమెకు హీరోతో బ్రేకప్ పై ఇన్ డైరెక్ట్ క్వశ్చన్ ఎదురైంది.…
కరోనా కారణంగా డైరెక్ట్ గా డిజిటల్ లో విడుదల కాబోతున్న మరో బాలీవుడ్ సినిమా ‘ధమాకా’. కార్తీక్ ఆర్యన్ హీరోగా నటించిన ఈ సినిమాను ముందు థియేట్రికల్ గా విడుదల చేయాలనుకున్నారు. అయితే ఇప్పుడు ఓటీటీ దిగ్గజం నెట్ఫ్లిక్స్లో డైరెక్ట్ గా విడుదల కాబోతోంది. ఈ సినిమా ట్రైలర్ ను విడుదల చేశారు. ‘ప్రశాంతంగా ఉండండి. అర్జున్ పాఠక్ పై భరోసా ఉంచండి. #ధమాకా లోడ్ అవుతోంది. నెట్ఫ్లిక్స్ లో నవంబర్ 19 న వస్తున్నాము’ అని…
బాలీవుడ్ యంగ్ హీరో కార్తీక్ ఆర్యన్ నటిస్తున్న టెర్రర్ మీడియా థ్రిల్లర్ ‘థమాకా’ మూవీపై అతని అభిమానుల్లో భారీ అంచనాలే ఉన్నాయి. రామ్ మధ్వానీ స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్న ఈ సినిమాకు బేస్ 2013లో వచ్చిన కొరియన్ మూవీ ‘ది టెర్రర్ లైవ్’. ఓ బ్రిడ్జ్ ను బ్లాస్ట్ చేసిన టెర్రరిస్టుని యంగ్ జర్నలిస్ట్ ఒకరు ఇంటర్వ్యూ చేస్తారు. దాంతో అతనికి బెదిరింపులు రావడం మొదలవుతుంది. ఊహించని ఈ ఉపద్రవం నుండి ఆ జర్నలిస్ట్ ఎలా బయటపడ్డాడు…
బాలీవుడ్ లో మరో యంగ్ బ్యూటీ దూకుడు పెంచింది. ‘జవానీ జానేమన్’ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన అలాయా ఎఫ్ వరుసగా రెండు సినిమాల్లో లీడ్ రోల్స్ కొట్టేసింది. మొదటి చిత్రంలోనే సైఫ్, టబు వంటి సీనియర్ నటులతో తెర పంచుకున్న అలాయా నెక్ట్స్ కార్తీక్ ఆర్యన్ లాంటి హ్యాండ్సమ్ తో కనిపించబోతోంది. ఏక్తా కపూర్ నిర్మించే ‘ఫ్రెడ్డీ’ సినిమాలో ఈ యువ జంట రొమాన్స్ చేయనున్నారు.కార్తీక్ ఆర్యన్ తో ‘ఫ్రెడ్డీ’ మూవీలో నటించాల్సిన అలాయా ఇంకా పేపర్స్…
బాలీవుడ్ లో ఎంతటి క్రేజీ ఆఫర్లు, ఎలాంటి పెద్ద దర్శకుల నుంచీ వచ్చినా… ఒక్క స్టార్ హీరో మాత్రం రిజెక్ట్ చేసేస్తుంటాడు! అతనే… రణబీర్ కపూర్! ఆయన జోయా అఖ్తర్ మూడు సార్లు మూవీస్ ఆఫర్ చేస్తే నిర్ధాక్షిణ్యంగా తిరస్కరించాడు. ‘జిందగీ నా మిలేగీ దుబారా, దిల్ దఢక్ నే దో, గల్లీ బాయ్’ చిత్రాలు మొదట రణబీర్ వద్దకే తీసుకెళ్లింది జోయా! కానీ, ఎందుకో ఏమో వద్దనేశాడు ఆర్కే. ఇక ఇప్పుడు, నన్ అదర్ ద్యాన్,…
కార్తీక్ ఆర్యన్ ప్రస్తుతం షూటింగ్ లతో బిజీగా ఉన్నాడు. ‘భుల్ భులయ్యా 2’తో పాటూ మరికొన్ని చిత్రాలు ఆయన పూర్తి చేయాల్సి ఉంది. అయితే, కెమెరా ముందు ఎంత బిజిగా ఉన్నా కాస్త ఫ్రీ టైం చేసుకుని తన బెస్ట్ ఫ్రెండ్ ని కలిశాడు బాలీవుడ్ యంగ్ హీరో… కార్తీక్ ఆర్యన్, సన్నీ సింగ్ ఇద్దరూ కలసి ‘ప్యార్ కా పంచ్ నామా 2, ‘సోనూ కే టిటూ కీ స్వీటీ’ సినిమాలు చేశారు. ఇద్దరి కెరీర్స్…
కార్తీక్ ఆర్యన్, శ్రద్ధా కపూర్… వినటానికే చాలా రిఫ్రెషింగ్ గా ఉంది కదా… జోడీ! ఈ కాంబినేషన్ సెట్ చేసే పనిలో ఉన్నాడట సాజిద్ నడియాడ్ వాలా. బాలీవుడ్ బడా ప్రొడ్యూసర్ కార్తీక్ తో ‘సత్యనారయణ్ కీ కథ’ సినిమా రూపొందించబోతున్నట్టు ఇప్పటికే ప్రకటించాడు. అయితే, రొమాంటిక్ మ్యూజికల్ ఎంటర్టైనర్ లో కార్తీక్ తో కలసి నటించే బ్యూటీ ఎవరో క్లారిటీ లేదు. కాకపోతే, ముంబైలో శ్రద్ధా పేరు మాత్రం జోరుగా వినిపిస్తోంది… టైగర్ ష్రాఫ్, సిద్ధార్థ్…