బాలీవుడ్ గత కొంత కాలం గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటోంది. సరైన హిట్స్ లేని బాలీవుడ్ పూర్తిగా దక్షిణాది చిత్రపరిశ్రమపైనే ఆధారపడి ముందుకు వెళుతోంది. ఈ సమయంలో బాలీవుడ్ ఉనికిని చాటుతూ బాలీవుడ్ లో హిట్ కొట్టాడు కార్తీక్ ఆర్యన్. ఆ సినిమానే ‘భూల్ భూలయ్యా2’. దీనిని నిర్మించింది టీ సీరీస్ అధినేత భూషణ్ కుమార్. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 180 కోట్లను వసూలు చేసింది. దీంతో ఆ ఆనందాన్ని పంచుకోవడానికి నిర్మాత భూషణ్ కుమార్ తన హీరో కార్తీక్ ఆర్యన్ కు మెక్ లారెన్ స్పోర్ట్స్ కారును బహుమతిగా అంద చేశాడు. ప్రస్తుతం ఈ ఫోటోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.+

తను బహుమతిగా అందుకున్న స్పోర్ట్ కారు ఇమేజెస్ ను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ… ‘చైనీస్ ఖానే కే లియే నయీ టేబుల్ గిఫ్ట్ మిల్ గయీ… మెహనత్ కా ఫల్ మీథా హోతా హై సునా థా.. ఇత్నా బడా హోగా నహీ పతా థా… ఇండియాస్ ఫస్ట్ మెక్‌లారెన్ గిఫ్ట్… అగ్లా గిప్ట్ ప్రైవేట్ జెట్ సర్… కృతజ్ఞతలు’ అని పోస్ట్ చేశాడు. ఇక కారును బహుమతిగా ఇచ్చిన నిర్మాత భూషణ్ కుమార్ ‘ఈ స్పోర్ట్స్ కారు అతని కృషికి టోకెన్’ అని అంటున్నాడు. ఈ కారు విలువ దాదాపు 4.7 కోట్లు. 3994 సిసి ఇంజిన్‌తో 326 కిలోమీటర్ల గరిష్ట వేగంతో ప్రయాణం చేయటం విశేషం. ఇన్ని ప్రత్యేకతలు ఉన్న ఈ కార్ గిప్ట్ కి కార్తీక్ ఆర్యన్ మాత్రమే కాదు అతని ఫ్యాన్స్ కూడా ఖుషీ అవుతున్నారు.