ముంబైలోని డివై పాటిల్ యూనివర్సిటీ కాన్వొకేషన్‌లో కార్తీక్ ఆర్యన్ కి ఇటీవలే ఇంజనీరింగ్ డిగ్రీని ప్రదానం చేశారు. కార్తీక్ ఆర్యన్ కోర్సులో చేరిన 10 సంవత్సరాలకు ఈ డిగ్రీని అందుకున్నాడు. ఇటీవల, నటుడు సోషల్ మీడియాలో ఈవెంట్ గురించి కొన్ని విశేషాలు పంచుకున్నాడు. ఈ క్రమంలో విద్యార్థులతో డ్యాన్స్ చేస్తూ తన కళాశాల రోజులను గుర్తుచేసుకున్నాడు. తన పేరు ఉన్న కస్టమైజ్డ్ కాలేజ్ జెర్సీని ధరించిన కార్తీక్ నిండిన ఆడిటోరియంలో విద్యార్థులతో సంభాషించాడు.
Vinfast India: భారత్‌లోకి వియత్నాం ఆటోమొబైల్ కంపెనీ ఎంట్రీ.. ఇవి సూపర్ కార్స్ గురూ..!
కార్తిక్ తన చిత్రం ‘భూల్ భూలయ్యా 3’ టైటిల్ ట్రాక్ తో విద్యార్థులతో కలిసి వేదికపైకి వచ్చి డ్యాన్స్ చేశాడు. అప్పటి తన ప్రొఫెసర్లను కలుసుకుని కాలేజ్ అనుభవాలను కూడా పంచుకున్నాడు.. , “నా కాన్వకేషన్ కోసం బ్యాక్‌బెంచ్‌లో కూర్చున్నప్పటి నుండి వేదికపై నిలబడే వరకు, ఇది చాలా అందమైన ప్రయాణం. DY పాటిల్ విశ్వవిద్యాలయం, నాకు జ్ఞాపకాలు, కలలు, ఇప్పుడు, చివరకు, నా డిగ్రీ (ఒకే ఒక్కటే) ఇచ్చారు. దానికి ఒక దశాబ్దం కంటే ఎక్కువ సమయం పట్టింది!) అంటూ ఆయన రాసుకొచ్చారు.