Bengaluru: బెంగళూర్ లో హృదయవిదారక ఘటన జరిగింది. తల్లి మరణించినా, నిద్ర పోతుందని భావించిన పిల్లాడి అమాయకత్వాన్ని చూస్తే ఎవరికైనా కన్నీళ్లు ఆగవు. అసలు అమ్మ ఎందుకు లేవడం లేదో తెలియదు, మాట్లాడదు, కదలదు, తనకు అన్నం పెట్టదు.. అయినా అమాయకంగా తన తల్లి నిద్ర పోతుందని భావించాడు ఆ పిల్లాడు. తల్లి మరణించినా రెండు రోజలు పాటు మృతదేహం పక్కనే నిద్రించాడు.
PM Narendra Modi: దేశంలో వేగంగా విమానయాన రంగం విస్తరిస్తోందని ప్రధాని నరేంద్రమోదీ అన్నారు. మరికొన్ని రోజుల్లో కర్ణాటకలో ఎన్నికలు జరగబోతున్న నేపథ్యంలో అక్కడి అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభిస్తున్నారు మోదీ. మరోసారి కర్ణాటకలో అధికారం చేజిక్కించుకోవాలని అనుకుంటోంది బీజేపీ. దీంతో భాగంగానే కొద్ది రోజుల వ్యవధిలో రెండుసార్లు కర్ణాటకలో పర్యటించారు ప్రధాని. ఇదిలా ఉంటే సోమవారం శివమొగ్గలో నిర్మించిన విమానాశ్రయాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ.. హవాయ్ చెప్పులేసుకునే వారు కూడా విమానం ఎక్కాలన్న తమ…
Bengaluru: బెంగళూర్ నగరంలో వీసా గడువు ముగిసినప్పటికీ 600 మందికి పైగా విదేశీయులు తిష్ట వేసినట్టు ఇంటెలిజెన్స్ వర్గాలు నిర్ధారణకు వచ్చాయి. ఈ నేపథ్యంలో వీరందరినీ వారి దేశాలకు వాపసు పంపేందుకు హోంశాఖ కసరత్తు చేస్తోంది. పాకిస్థాన్కు చెందిన యువతిని ఉత్తరప్రదేశ్కు చెందిన యువకుడు వివాహమాడి బెంగళూరులో కాపురం చేసిన ఉదంతం వెలుగులోకి వచ్చాక నగర పోలీసు యంత్రాంగం అప్రమత్తమైంది. పాక్ యువతిని స్వదేశానికి తిప్పి పంపిన తరహాలోనే నగరంలో తిష్టవేసిన ఆఫ్రికా దేశాలకు చెందిన వారిని…
Karnataka IAS Vs IPS Fight: కర్ణాటకలో ఇద్దర మహిళా సివిల్ సర్వెంట్ల ఇష్యూ కొనసాగుతూనే ఉంది. ఫేస్ బుక్ వేదికగా ఐపీఎస్ రూపా మౌడ్గిల్, ఐఏఎస్ రోహిణి సింధూరి ఫోటోలను షేర్ చేసి, పలు విమర్శలు చేసింది. ఇదిలా ఉంటే ఈ ఇద్దరిని కర్ణాటక ప్రభుత్వం పోస్టింగ్ ఇవ్వకుండా బదిలీ చేసింది. ముఖ్యమంత్రి బస్వరాజ్ బొమ్మైతో పాటు ప్రభుత్వం అంతా ఈ విషయంపై ఆగ్రహంతో ఉంది. సోషల్ మీడియా వేదికగా, బహిరంగంగా ఎలాంటి విమర్శలు చేసుకోవద్దని…
IPS D Roopa Moudgil Facebook latest post: కర్ణాటకలో ఇద్దరు మహిళా సివిల్ సర్వెంట్ల రచ్చ దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అయింది. ఐపీఎస్ రూపా మౌడ్గిల్, ఐఏఎస్ రోహిణి సింధూరి మధ్య విబేధాలు తారాస్థాయికి చేరాయి. ఒకరిపై ఒకరు సోషల్ మీడియా వేదికగా విమర్శలు గుప్పించుకున్నారు. రోహిణి సింధూరి ఫోటోలను ఫేస్ బుక్ లో షేర్ చేసిన రూపా, ఆమెపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. రోహిణి సివిల్ సర్వెంట్ల మార్గదర్శకాలకు వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నారని, అక్రమాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు.…
Roopa vs Rohini: కర్ణాటకలో కర్ణాటక దేవాదాయ కమిషనర్ ఐఏఎస్ అధికారి రోహిణి సింధూరి, కర్ణాటక హస్తకళల అభివృద్ధి మండలి మేనేజింగ్ డైరెక్టర్ ఐపీఎస్ రూపా డి. మౌద్గిల్ పై ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఇద్దరు తమ పదవులను మరిచి సోషల్ మీడియా వేదికగా బహిరంగంగా విమర్శలకు దిగడంతో ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. వీరిద్దరిని బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇద్దరికి పోస్టింగులు ఇవ్వలేదు.
Tipu Sultan Issue: కర్ణాటక ఎన్నికలు ముంచుకొస్తున్న నేపథ్యంలో అక్కడ మైసూర్ రాజు టిప్పు సుల్తాన్ కేంద్రంగా రాజకీయాలు వేడెక్కుతున్నాయి. టిప్పు సుల్తాన్ ను సమర్థిస్తూ కాంగ్రెస్ వ్యాఖ్యలు చేస్తుండగా.. బీజేపీ టిప్పు సుల్తాన్ ను విమర్శిస్తోంది. ఈ రెండు పార్టీలు టిప్పు పేరుతో రాజకీయాలు చేస్తున్నాయి. ఇదిలా ఉంటే దీనిపై టిప్పు వారసులు స్పందించారు. మీ రాజకీయ ప్రయోజనాల కోసం టిప్పు సుల్తాన్ పేరు ఉపయోగించవద్దని.. చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
Roopa vs Rohini: కర్ణాటకలో ఇద్దరు మహిళా సివిల్ అధికారుల మధ్య వార్ చర్చనీయాంశంగా మారింది. సోషల్ మీడియా వేదికగా ఒకరిపై ఒకరు విమర్శలు ప్రతివిమర్శలు చేసుకుంటున్నారు. కర్ణాటక దేవాదాయ కమిషనర్ ఐఏఎస్ అధికారి రోహిణి సింధూరిపై కర్ణాటక హస్తకళల అభివృద్ధి మండలి మేనేజింగ్ డైరెక్టర్ ఐపీఎస్ రూపా డి. మౌద్గిల్ వ్యక్తిగత విమర్శలకు దిగారు. ఫేస్ బుక్ వేదికగా రూపా, రోహిణి ఫోటోలు షేర్ చేసి ఆరోపణలు చేశారు.