Karnataka Farmer : ప్రభుత్వ ఆఫీసుల్లో పైసలివ్వనిదే ఏ పని కాదన్న విషయం చిన్న పిల్లలకు కూడా తెలుసు. అన్నం పెట్టే రైతన్నను లంచం డిమాండ్ చేశాడో ప్రభుత్వోద్యోగి.
PM Modi To Visit Karnataka On March 12: మరికొన్ని రోజుల్లో ఎన్నికలు జరగబోయే కర్ణాటక రాష్ట్రంలో మరోసారి ప్రధాని నరేంద్రమోదీ పర్యటించనున్నారు. ఈ నెల 12న కర్ణాటకకు వెళ్లనున్నారు. పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభంతో పాటు పలు ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయనున్నారు. దాదాపుగా రూ. 16,000 కోట్ల విలువైన ప్రాజెక్టులు ఇందులో ఉన్నాయి. ప్రతిష్టాత్మక 10 వరసల మైసూర్-బెంగళూర్ ఎక్స్ ప్రెస్ వేను ప్రధాని మాండ్యాలో ప్రారంభించనున్నారు. ఆ తరువాత హుబ్బళ్లి-ధార్వాడలో వివిధ అభివృద్ధి…
Mandya MP Sumalatha extends 'full support' to BJP: ప్రముఖ సినీనటి, ఎంపీ సుమలత అంబరీష్ బీజేపీ పార్టీకి సంపూర్ణ మద్దతు ప్రకటించారు. గత లోక్ సభ ఎన్నికల్లో ఆమె మాండ్యా లోక్ సభ స్థానం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా విజయం సాధించారు. ఈ నెల 12న ప్రధాని నరేంద్రమోదీ కర్ణాకటక పర్యటనకు వెళ్లనున్నారు.
Congress Worker : కర్ణాటకలోని ధర్వాడ్ జిల్లాలో ఓ వివాహ వేడుక జరుగుతున్నది. ఇందులో భాగంగా హల్దీ కార్యక్రమం నిర్వహించారు. కాంగ్రెస్ కార్యకర్త ఓ డ్యాన్స్ చేస్తున్న మహిళపై కరెన్సీ నోట్ల వర్షం కురిపిస్తున్న వీడియో వివాదాస్పదంగా మారింది.
Karnataka: మహిళా దినోత్సవం రోజు ఓ మహిళకు అవమానం ఎదురైంది. బొట్టు పెట్టుకోలేదని ఓ మహిళను బహిరంగంగా తిట్టారు బీజేేపీ ఎంపీ. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ ఘటనపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై రాజకీయ దుమారం చెలరేగింది. బీజేపీ ఎంపీ తీరును, బీజేపీని కాంగ్రెస్ విమర్శిస్తోంది.
Assembly Election 2023: ఆల్ ఇండియా మజ్లిస్-ఏ-ఇత్తెహాదుల్-ముస్లిమీన్ (ఏఐఎంఐఎం) అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ హైదరాబాద్ వెలుపల కూడా తమ పార్టీని విస్తరించడంలో నిమగ్నమయ్యారు. ఇందుకు ప్రయత్నాలు విస్తృతంగా కొనసాగిస్తున్నారు.
Kapil Sibal: ప్రముఖ న్యాయవాది, మాజీ కాంగ్రెస్ నేత, రాజ్యసభ సభ్యుడు కపిల్ సిబల్ బీజేపీపై పోరాటానికి సిద్ధం అయ్యారు. దీని కోసం కొత్త వేదిక ఏర్పాటు చేశారు. బీజేపీ ప్రభుత్వంలో జరుగుతున్న అన్యాయాలను ఎదుర్కొనేందుకు ‘ఇన్సాఫ్’ అనే వేదికను స్థాపిస్తున్నట్లు ప్రకటించారు. ప్రజల కోసం ‘ఇన్సాఫ్ కే సిపాహి’ పేరిట వెబ్ సైట్ తీసుకువస్తున్నట్లు తెలిపారు. ఈ వేదిక ద్వారా ప్రజల సమస్యలపై లాయర్లు పోరాటా చేస్తారని అన్నారు. దీనికి విపక్ష పార్టీల ముఖ్యమంత్రులు మద్దతు…
Karnataka: కర్ణాటక రాష్ట్రీయ హిందూ సేన చీఫ్ ప్రమోద్ ముతాలిన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కర్ణాటకలో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో అక్కడి బీజేపీ నేతలపై విరుచుకుపడ్డారు. బీజేపీ నేతలు ప్రధాని నరేంద్రమోదీ పేరుతో ఓట్లు అడుగుతున్నారని ఆరోపించారు. దమ్ముంటే ప్రధాని పేరు లేకుండా ఫోటోలు ఉపయోగించకుండా ఓట్లు దండుకోవాలని బీజేపీ నేతలకు సవాల్ విసిరారు.
Amit Shah criticizes Congress: ‘‘ మోదీ చనిపోవాలి’’, ‘‘ మోదీ సమాధిని తవ్వుతాం’’ అంటూ కాంగ్రెస్, ఆప్ వంటి పార్టీలు విమర్శలు గుప్పిస్తున్నాయని, అయితే ఇవన్నీ పనిచేయవని కేంద్ర హోం మంత్రి అమిత్ షా అన్నారు. ఆయన దీర్ఘాయువుతో ఉండాలని 130 కోట్ల మంది ప్రార్థిస్తున్నారని అన్నారు.
ఒక రోజు క్రితం లంచం తీసుకుంటూ పట్టుబడిన కర్ణాటక బీజేపీ ఎమ్మెల్యే కుమారుడి ఇంట్లో సోదాలు జరిపిన తర్వాత సుమారు రూ. 6 కోట్ల విలువైన నగదు లభించిందని అధికారులు శుక్రవారం తెలిపారు.