2024 సార్వత్రిక ఎన్నికల ముందు జరుగుతున్న కర్ణాటక ఎన్నికలపై దేశవ్యాప్తంగా అందరి దృష్టి ఉంది. దక్షిణాదిలో బీజేపీ అధికారంలో ఉన్న ఏకైక రాష్ట్రం కర్ణాటక. అధికారం తమదంటే తమది అంటూ కాంగ్రెస్, బీజేపీలు ధీమాతో ఉన్నాయి. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు మే 10న జరగనున్నాయి, పోలింగ్ రోజుకు కేవలం నాలుగు వారాలు మాత్రమే మిగిలి ఉన్నాయి. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజాస్పందన సంకీర్ణ ప్రభుత్వాన్ని సూచిస్తోందని సౌత్‌ఫస్ట్ ప్రీపోల్ సర్వే వెల్లడించింది. మే 10వ తేదీన కర్ణాటకలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో ఏ రాజకీయపార్టీకి సంపూర్ణ మెజార్టీరాదని పీపుల్స్‌పల్స్ ప్రీపోల్ సర్వేలో వెల్లడించింది.
Also Read:Experts Tips: వేసవిలో గొంతు నొప్పి, ముక్కు మూసుకుపోయిందా?
కర్ణాటకలో అతిపెద్ద పార్టీగా కాంగ్రెస్ అవరిస్తుందని పీపుల్స్ పల్స్ తేల్చింది. కాంగ్రెస్‌పార్టీకి 98, బిజెపికి 92, జెడిఎస్‌కు 27 సీట్లు వచ్చే అవకాశం ఉన్నట్లు పీపుల్స్‌పల్స్ ప్రీపోల్ సర్వే వెల్లడించింది. కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీకి 95- 105, బిజెపికి 90-100, జెడిఎస్‌క 25-30, ఇతరులు 1-2 స్థానాలు గెలుపొందే అవకాశం ఉన్నట్లు పీపుల్స్ ప్రీపోల్‌సర్వే పేర్కొంది. కర్ణాటకలో ప్రీపోల్ సర్వేను పీపుల్స్‌పల్స్ సంస్థ-సౌత్‌ఫస్ట్ అనే ఇంగ్లీష్ వెబ్‌సైట్ కోసం నిర్వహించింది. 25 మార్చి నుండి 10 ఏప్రిల్ 2023 వరకు 56 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 5600 శాంపిల్స్‌తో పీపుల్స్‌పల్స్ సంస్థ ప్రీపోల్ సర్వే నిర్వహించింది. కాంగ్రెస్ పార్టీకి 41 శాతం, బిజెపికి 36 శాతం, జెడిఎస్‌కు 16 శాతం, ఇతరులకు 7 శాతం ఓట్లు వచ్చే అవకాశం ఉందని పీపుల్స్‌పల్స్ తేల్చింది. 2018 ఎన్నికలతో పోలిస్తే కాంగ్రెస్‌పార్టీ అధికంగా 18 సీట్లు వచ్చే అవకాశం ఉందని పేర్కొంది. 2018 ఎన్నికలతో పోలిస్తే ప్రస్తుత అధికార బిజెపి పార్టీ 12 సీట్లు, జెడిఎస్ 10 సీట్లు కోల్పోనున్నాయని సర్వే స్పష్టం చేసింది.
సిద్ధిరామయ్యకు జైకొట్టిన కర్ణాటక ప్రజలు – పీపుల్స్‌పల్స్
కర్ణాటక రాష్ట్రానికి సిద్ధిరామయ్య ముఖ్యమంత్రి అయితే బాగుంటుందని 32 శాతం, 25 శాతం యడ్డ్యూరప్ప, 20 శాతం బసవరాజ బొమ్మై , 18 శాతం కుమారస్వామి, 5 శాతం డి.కె.శివకుమార్‌ను కోరుకుంటున్నారని పీపుల్స్‌పల్స్ వెల్లడించింది. కర్ణాటక రాష్ట్రం అభివృద్ధి కాంగ్రెస్‌పార్టీతో సాధ్యమని 42 శాతం మంది, 38 శాతం మంది బిజెపి, 14 శాతం మంది జెడిఎస్ అని తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఏ పార్టీకి మెజార్టీ రానిపక్షంలో కాంగ్రెస్-జెడిఎస్ పార్టీలు కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేయాలని 46 శాతం, బిజెపి-జెడిఎస్ 41 శాతం, కాంగ్రెస్-జెడిఎస్-ఇతరులు 6 శాతం, బిజెపి-జెడిఎస్-ఇతరులు 7 శాతం మంది కోరుకున్నారు.రాష్ట్రంలో అధికారం చేపట్టే అవకాశం ఏ పార్టీకి లేదని 31 శాతం మంది తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేయగా, కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టే అవకాశం ఉందని 26 శాతం, బిజెపి 24 శాతం, జెడిఎస్ 15 శాతం మంది, చెప్పలేమని 4 శాతం మంది తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
Also Read:Road Accident : నీకు భూమ్మీద నూకలు మిగిలే ఉన్నాయి..
మొత్తం 224 అసెంబ్లీ స్థానాలున్న కర్ణాటకలో మెజార్టీకి అవసరమైన 113 స్థానాలు. గత ఎన్నికల్లో కూడా ఏపార్టీకి సంపూర్ణ మెజార్టీ రాలేదు. దీంతో కాంగ్రెస్- జేడీఎస్ కలిసి సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. అయితే, అనంతరం కాంగ్రెస్, జేడీఎస్ కు చెందిన కొందరు ఎమ్మె్ల్యేల తిరుగుబాటుతో ఆప్రభుత్వం కుప్పకూలింది. దీంతో ఆయా పార్టీల ఎమ్మెల్యేల మద్దతుతో బీజేపీ అధికారం చేపట్టింది. అయితే, ఈ సారి కూడా ఏ పార్టీకీ లభించడంలేదని ‘పీపుల్స్‌పల్స్ రీసెర్చ్ సంస్థ ఎన్నికల ముందు నిర్వహించిన తాజా సర్వేలో తేలింది.