కర్ణాటకలో ఎన్నికల వేళ అధికార బీజేపీకి రెబెల్స్ తో తలనొప్పిగా మారింది. మే 10న జరగనున్న అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. బీజేపీలో చాలా మంది అభ్యర్థులు ఉండటంతో గందరగోళం నెలకొంది. కర్ణాటకలో బీజేపీకి రెబెల్స్ తలనొప్పిగా మారడంతో ఆ పార్టీ అసమ్మతిని తగ్గించే బాధ్యతను మాజీ ముఖ్యమంత్రి బీఎస్ యడ్యూరప్పకు అప్పగించింది. యడ్యూరప్పతోపాటు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు నళిన్‌కుమార్ కటీల్, కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ సహాయ మంత్రి శోభా కరంద్లాజే పార్టీ నేతలను బుజ్జగించే బాధ్యతను తీసుకున్నారు.
యడ్యూరప్ప నేతృత్వంలోని మంత్రివర్గంలోని మాజీ ఉపముఖ్యమంత్రి లక్ష్మణ్ సవాది ఇటీవల భారతీయ జనతా పార్టీ (బిజెపి)ని వీడి కాంగ్రెస్‌లో చేరారు. దీనిపై కర్ణాటక ఎన్నికల బీజేపీ ఇన్‌ఛార్జ్ అరుణ్ సింగ్ శుక్రవారం స్పందిస్తూ సవాడికి కాంగ్రెస్ పార్టీలో భవిష్యత్తు ఉండదని అన్నారు. కాంగ్రెస్‌లో చేరి తప్పిదానికి పాల్పడ్డారు. అతను పశ్చాత్తాపపడతాడని అని సింగ్ జ్యోసం చెప్పారు. పార్టీని వీడిన వారికి శాశ్వతంగా తలుపులు మూసుకుపోతాయని తెలిపారు. వారిని తిరిగి పార్టీ ఆమోదించడానికి 20 ఏళ్లు పట్టవచ్చు అని అభిప్రాయపడ్డారు. సవాది నిర్ణయం స్వార్థపూరితమైనది అని అరుణ్ సింగ్ విమర్శించారు.
Also Read:Corona Tension: ఏపీ, తెలంగాణల్లో కరోనా టెన్షన్
ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై మాట్లాడుతూ సవాది కాంగ్రెస్‌తో రాజకీయ భవిష్యత్తును చూసినందుకు బాధగా ఉందన్నారు. అధికార పార్టీలో ఆశావహులు ఎక్కువగా ఉండటం సర్వసాధారణమన్నారు. పార్టీ కార్యకర్తలు తమ వెంటే ఉన్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అఖండ మెజారిటీతో గెలుస్తుంది అని ధీమా వ్యక్తం చేశారు. వారిలో కొందరు ఎమ్మెల్యేలు కావడానికి పార్టీని విడిచిపెట్టారని, అయితే బిజెపి కార్యకర్తలు వారి వెంట ఉన్నారు అని బొమ్మై పేర్కొన్నారు. అభ్యర్థుల రెండో జాబితాను ఇప్పటికే విడుదల చేశామని, త్వరలో మూడో జాబితాను విడుదల చేస్తామని ముఖ్యమంత్రి చెప్పారు. ఆయన శనివారం షిగ్గావ్‌లో నామినేషన్ దాఖలు చేయనున్నారు.
కాగా, మాజీ ముఖ్యమంత్రి జగదీశ్ షెట్టర్‌కు టికెట్ ఖాయమని కేంద్ర గనులు, బొగ్గు, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి ప్రకటించారు. ఈ విషయమై జాతీయ అధ్యక్షుడితో చర్చించామని, అంతా సవ్యంగా ముగుస్తుందని చెప్పారు. గెలిచే పార్టీకి మరింత డిమాండ్ ఉంటుందన్నారు. మరో రెండు రోజుల్లో ఈ గందరగోళాలకు తెరపడుతుంది అని జోషి తెలిపారు.
Also Read:Ashu Reddy: అషూ.. క్యాజువల్ డ్రెస్ లో కూడా కాక పుట్టిస్తోందిగా
ఇదిలా ఉండగా, కర్ణాటక రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు డి.కె. శివకుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. రానున్న రోజుల్లో బీజేపీ, జేడీఎస్‌లకు చెందిన 25 మంది నేతలు కాంగ్రెస్‌లో చేరనున్నట్లు శివకుమార్ తెలిపారు. బీజేపీ 60 సీట్లు మాత్రమే గెలుచుకోగా, జేడీఎస్‌కు 24 సీట్లకు మించదు. కాంగ్రెస్ 141 సీట్లు గెలుచుకుంటుందని అన్నారు.