దేశంలోని ఐసిస్ తో సంబంధం ఉన్న ప్రాంతాలపై జాతీయ దర్యాప్తు సంస్థ(NIA) దాడులు చేసింది. దక్షిణాది రాష్ట్రాలోని మొత్తం 19 ప్రదేశాలలో ఎన్ఐఏ సోదాలు చేసింది. ఈ దాడిలో ఎన్ఐఏ బృందాలు ఎనిమిది మంది ఐసిస్ ఏజెంట్లను అదుపులోకి తీసుకున్నాయి. ఉగ్రవాదానికి సంబంధించిన చర్యలు, కార్యకలాపాలను ప్రోత్సహించడంలో వారు నిమగ్నమై ఉన్నారని ఆరోపించారు. కర్ణాటకలోని బళ్లారి, బెంగళూరు, మహారాష్ట్రలోని అమరావతి, ముంబై, పుణె, జార్ఖండ్‌లోని జంషెడ్‌పూర్, బొకారో, ఢిల్లీలోని ప్రాంతాల్లో ఎన్‌ఐఏ దాడులు చేసింది. ఈ రైడ్స్ లో పేలుడు పదార్థాలు సల్ఫర్, పొటాషియం నైట్రేట్, బొగ్గు, గన్‌పౌడర్, చక్కెర, ఇథనాల్ వంటి రసాయనాలను కూడా NIA స్వాధీనం చేసుకుంది. అంతేకాకుండా.. పదునైన ఆయుధాలు, భారీగా నగదు, స్మార్ట్‌ఫోన్‌లు, ఇతర డిజిటల్ పరికరాలతో పాటు నేరారోపణ పత్రాలు ఉన్నాయి.
Breaking: రాష్ట్రాలకు కేంద్రం కొవిడ్ అలర్ట్.. అప్రమత్తంగా ఉండాలని ఆదేశం
ఉగ్రవాద ముఠాకి సూత్రధారిగా ఉన్న మీనాజ్ ను ఎన్ఐఏ అరెస్ట్ చేసింది. అతనితో పాటు మరో ఎనిమిది మందిలో.. సయ్యద్ సమీర్, ముంబైకి చెందిన అనాస్ ఇక్బాల్ షేక్, బెంగళూరులో మహ్మద్ మునీరుద్దీన్, సయ్యద్ సమీవుల్లా అలియాస్ సమీ, మహ్మద్ ముజమ్మిల్ ఉన్నారు. ఢిల్లీకి చెందిన షాయాన్ రెహ్మాన్ అలియాస్ హుస్సేన్, జంషెడ్‌పూర్‌కు చెందిన మహ్మద్ షాబాజ్ అలియాస్ జుల్ఫీకర్ అలియాస్ గుడ్డులను అరెస్టు చేశారు.
Delhi Liquor Policy Case: మరోసారి కేజ్రీవాల్‌కు ఈడీ నోటీసులు
భారతదేశంలో పనిచేస్తున్న అనేక ఐసిస్ మాడ్యూళ్లను ఛేదించడానికి ఎన్ఐఏ 24 గంటలు పనిచేస్తోంది. ఈ క్రమంలో.. దేశంలోని పలు చోట్ల ముమ్మరంగా దాడులు నిర్వహిస్తోంది. డిసెంబరు 9న మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల్లో దాడులు నిర్వహించి 44 మందిని అరెస్టు చేసింది. తీవ్రవాద కార్యకలాపాలతో సంబంధం ఉన్న అనుమానితులపై డిసెంబర్ 13 న.. ఎన్ఐఏ బెంగళూరులోని అనేక ప్రదేశాలలో సోదాలు నిర్వహించింది.