Coronavirus: భారత్ లో కరోనా కేసులు మళ్లీ విజృంభిస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా కోవిడ్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. దీంతో నెల రోజుల్లో 52 శాతం పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. ఈ మేరకు ప్రపంచ ఆరోగ్య సంస్థ అలర్ట్ చేసింది. భారత్ లోనూ కరోనా కేసుల పెరుగుదల కలవర పెడుతుంది. మళ్లీ కరోనా కేసులు పెరుగుతుండటంతో ఏడు నెలల గరిష్టానికి కోవిడ్ కొత్త కేసులు చేరాయి. మే 21 నుంచి అత్యధికంగా కోవిడ్ కేసులు 3,000 మార్కును దాటి 3,420 కు పెరిగాయని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఇవాళ తెలిపింది. జెన్.1 సబ్-వేరియంట్ కేసుల పెరుగుదలపై ప్రజల్లో ఆందోళన మొదలైంది.
Read Also: Aditya L1 Mission: ఆదిత్య ఎల్1 ప్రయాణంలో మరో మైలురాయి.. వచ్చే నెల 6న గమ్యస్థానానికి చేరిక
ఇక, కరోనా వల్ల నలుగురు మరణించారు.. కేరళలో రెండు, రాజస్థాన్, కర్ణాటకలలో ఒక్కొ మరణం సంబవించింది. దీంతో మరణాల సంఖ్య 5, 33, 332 కు చేరుకుంది. మరణాల రేటు 1.18 శాతంగా నమోదైంది. దేశంలో కోవిడ్ కేసుల సంఖ్య 4.50 కోట్లు (4,50,07,964)గా ఉంది. అయితే, కేంద్ర వైద్యారోగ్యశాఖ డేటా ప్రకారం.. 17 రాష్ట్రాల్లో కోవిడ్ -19 కేసులలో పెరుగుదల కనిపిస్తుంది. వాటిలో కేరళ (266), కర్ణాటక (70), మహారాష్ట్ర (15), తమిళనాడు (13), గుజరాత్ (12) రాష్ట్రాల్లో ఉన్నాయి. ఇక, తెలంగాణలో కొత్తగా 8 కరోనా కేసులు, ఏపీలో 8 కోవిడ్ కేసులు నమోదు అయ్యాయి. అలాగే, గడిచిన 24 గంటల్లో 325 మంది కోవిడ్-19 నుంచి కోలుకోవడంతో మొత్తం కోలుకున్న వారి సంఖ్య 4, 44, 71, 212కి చేరుకుందని ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. జాతీయ రికవరీ రేటు 98.81 శాతంగా ఉంది. నిన్న (శుక్రవారం) భారతదేశంలో 640 కేసులు నమోదు కాగా, ఒక మరణం నమోదైంది.
Read Also: Suryakumar Yadav: టీమిండియాకు భారీ షాక్.. 7 వారాలు ఆటకు దూరంగా సూర్యకుమార్ యాదవ్
అలాగే, ఆసుపత్రులకు కోవిడ్ -19 ఆర్టీపీసీఆర్ పరీక్షను పెంచాలని కేంద్ర వైద్యారోగ్యశాఖ తెలిపింది. ప్రస్తుతం కోవిడ్-19 కేసులు పెరుగుతుండటంపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ప్రజలు భయాందోళన చెందవద్దని కేంద్ర ప్రభుత్వం చెప్పింది. ప్రజలు ముందు జాగ్రత్త చర్యగా ఫేస్ మాస్క్‌లు ధరించాలని కేంద్రం సూచించింది. ఇక, జెఎన్.1, ఓమిక్రాన్ కు సబ్ వేరియంట్ అని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. కొన్ని రోజుల నుంచి అత్యంత వేగంగా వ్యాప్తి చెందుతుందని తెలిపింది. భారతదేశంలో జెఎన్.1 వేరియంట్ కారణంగా ఎలాంటి టుక్లస్టరింగ్ కేసులు నమోదు కాలేదని అధికారులు చెప్పారు.