ఎన్నికలు ఎప్పుడు వచ్చినా మద్యం, డబ్బు భారీగా పట్టుబడుతోంది. ఎన్నికల్లో ధన ప్రవాహం అడ్డూ అదుపులేకుండా సాగుతోంది. ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు పార్టీలు డబ్బును వెదజల్లుతున్నాయి. భారీగా మద్యం సరఫరా చేస్తున్నాయి.
Karnataka Polls: కర్ణాటక విధానసభ ఎన్నికలకు నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతోంది. ఈ సందర్భంగా పలు ఆసక్తికర సంఘటనలు చోటుచేసుకుంటున్నాయి. యాద్గిర్ నియోజకవర్గం నుంచి యంకప్ప అనే యువకుడు స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. అయితే నామినేషన్ దాఖలు చేసే సమయంలో సమర్పించిన డిపాజిట్ కింద అన్నీ రూపాయి నాణేలను సమర్పించాడు యంకప్ప. నియోజకవర్గంలోని ప్రతి ఇంటికి తిరిగి రూపాయి నాణేలను సేకరించిన ఆయన… వాటిని తన నామినేషన్‌తోపాటు డిపాజిట్ సొమ్ము కింద జమ చేశాడు. అయితే ఆ…
Jagadish Shettar: కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికల ముందు కీలక పరిణామం చోటుచేసుకుంది. బీజేపీ టికెట్ నిరాకరించడంతో మాజీ ముఖ్యమంత్రి జగదీష్ షెట్టర్ ఈ రోజు కాంగ్రెస్ పార్టీలో చేరారు. కర్ణాటకలో ప్రముఖ లింగాయత్ నాయకుడు, ఆరుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన ఆయన 2012 నుండి 2013 వరకు రాష్ట్రానికి 15వ ముఖ్యమంత్రిగా పనిచేశారు. బెంగళూరులోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే, కేపీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్, కాంగ్రెస్ నేతలు రణదీప్ సూర్జేవాలా, సిద్ధరామయ్య సమక్షంలో…
మరి కొన్ని రోజుల్లో కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరుగనున్న నేపథ్యంలో అధికార బీజేపీ పార్టీకి బిగ్ షాక్ తగిలింది. ఆ పార్టీ సీనియర్ నేత, మాజీ సీఎం జగదీష్ షెట్టర్ పార్టీకి రాజీనామా చేశారు.
Boney Kapoor: కర్ణాటకలో ఎన్నికలు దగ్గర పడుతున్నా కొద్దీ రాజకీయం రసవత్తరంగా మారింది. కాంగ్రెస్, బీజేపీలు నువ్వానేనా అన్న రీతిలో పోటీ పడుతున్నాయి. డబ్బు, మద్యంతో ప్రలోభాల పర్వం ప్రారంభం అయింది. ఇదిలా ఉంటే ఎన్నికల వేళ, ఎన్నికల కోడ్ అమలులో ఉన్న సమయంలో ప్రముఖ బాలీవుడ్ నిర్మాత బోనీకపూర్ కార్లలో పెద్ద ఎత్తున వెండి వస్తువులు బయటపడ్డాయి. ఎన్నికల కమీషన్ రాష్ట్రవ్యాప్తంగా తనిఖీలు నిర్వహిస్తు్న్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది.
కర్ణాటక ఎన్నికల్లో గెలుపు కోసం కాంగ్రెస్ కష్టపడుతోంది. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు డీకే శివకుమార్ నేతృత్వంలో ఈ సారి అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. కాంగ్రెస్ లో ట్రబుల్ షూటర్ పేరున్న శివకుమార్..రాష్ట్రంలో పార్టీని అధికారంలోకి తీసుకొస్తారన్న నమ్మకంతో పార్టీ అగ్ర నాయకత్వం ఉంది.
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు అన్ని పార్టీలకు రెడీ అయ్యాయి. దశల వారిగా ప్రధాన పార్టీలు తమ అభ్యర్థులను ప్రకటిస్తున్నాయి. అయితే, అధికార బీజేపీ మాత్రం ఇంకా వేచి చూసే ధోరణి అవలంభిస్తోంది.
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు రంగం సిద్దమవుతోంది. కర్ణాటకలో మే 10న ఒకే దశలో అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించి మే 13న ఫలితాలు వెల్లడిస్తామని ఎన్నికల సంఘం వెల్లడించింది.
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను ఎన్నికల సంఘం బుధవారం ఉదయం 11.30 గంటలకు ప్రకటించనుంది. రాష్ట్రంలో మొత్తం 224 అసెంబ్లీ స్థానాలకు త్వరలోనే ఎన్నికలు జరగనున్నాయి.