Minister KTR: కాంగ్రెస్ ప్రభుత్వానికి ఆయన శుభాకాంక్షలు తెలిపారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గ్రాండ్ విక్టరీ సాధించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు.
Nikhil Gowda: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ప్రభంజనం సృష్టించింది.. కాంగ్రెస్ వేవ్‌లో ఏకంగా 11 మంది మంత్రులు ఓటమి పాలయ్యారు.. ఇక, ఈ ఎన్నికల బరిలో దిగిన యంగ్ హీరోకి ఓటమి తప్పలేదు.. కాంగ్రెస్ దెబ్బకు పరాజయంపాలైన వారిలో కన్నడ యువ హీరో నిఖిల్ గౌడ అలియాస్ నిఖిల్ కుమారస్వామి కూడా ఒకరు.. కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామి తనయుడైన నిఖిల్.. 10 వేలకు పైగా ఓట్లతో ఓటమి చవిచూశారు.. ఈఎన్నికల్లో కుమారస్వామి గెలిచినా..…
Mamata Banerjee: కర్ణాటకలో బీజేపీ దారుణంగా ఓడిపోవడంపై ప్రతిపక్షాలు సంబరాలు చేసుకుంటున్నాయి. బీజేపీపై విమర్శలు గుప్పిస్తూనే.. గెలిచిన కాంగ్రెస్ పార్టీకి అభినందనలు తెలుపుతున్నారు. ఇప్పటికే తమిళనాడు సీఎం, డీఎంకే స్టాలిన్ కాంగ్రెస్ నేతలైన సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, సిద్ధరామయ్యలకు అభినందనలు తెలియజేశారు. ఇదిలా ఉంటే పశ్చిమబెంగాల్ సీఎం, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ బీజేపీపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
Karnataka Election Results: సంప్రదాయంగా బీజేపీకి అండగా నిలుస్తున్న లింగాయత్ వర్గం ఈ సారి ఆ పార్టీని కోలుకోలేని దెబ్బతీసింది. బీజేపీ చివరి నిమిషంలో రిజర్వేషన్లు ప్రకటించినా కూడా లింగాయల్ వర్గంలో ఉన్న అసంతృప్తిని అణచలేకపోయారు. ఫలితంగా బీజేపీకి గట్టి పట్టున్న స్థానాల్లో కూడా ప్రభుత్వంపై వ్యతిరేకత కారణంగా మెజారిటీ స్థానాలను కోల్పోవాల్సి వస్తుంది. తాజాగా ఈ రోజు వెలువడిన ఎన్నికల్లో ట్రెండ్స్ ను పరిశీలిస్తే ఇదే అర్థం అవుతుంది.
Leaders' reaction to BJP's defeat: కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అఖండ విజయం దిశగా సాగుతోంది. 224 అసెంబ్లీ స్థానాలు ఉన్న కర్ణాటకలో కాంగ్రెస్ మ్యాజిక్ ఫిగర్ 113ని దాటి 137 స్థానాల్లో విజయం దాదాపుగా ఖరారు అయింది. బీజేపీ కేవలం 63 స్థానాలకు, జేడీఎస్ 20 స్థానాలకు మాత్రమే పరిమితం అయింది. అయితే ఈ ఎన్నికల్లో బీజేపీ వైఫల్యంపై మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ కీలక నేత బీఎస్ యడియూరప్ప కీలక వ్యాఖ్యలు చేశారు.
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమై సాయంత్రం 6 గంటలకు ముగుస్తుంది. ఇక 80 ఏళ్ల పైబడిన వారు, దివ్యాంగులకు ఇంటి నుంచే ఓటు వేసే ఏర్పాట్లు కూడా ఎన్నికల సంఘం చేసింది. మొత్తం 224 అసెంబ్లీ స్థానాలున్న కర్ణాటకలో ప్రభుత్వ ఏర్పాటు చేయాలంటే 113 సీట్లు కావాల్సి ఉంటుంది.
Karnataka Polls: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల సమయంలో సోనియా గాంధీ వ్యాఖ్యలపై దుమారం రేగుతోంది.. సోనియా గాంధీ చేసిన ట్వీట్ ఈ దుమారానికా కారణం అవుతుంది. కర్ణాటక ప్రతిష్ఠకు, సార్వభౌమత్వానికి, సమగ్రతకు ముప్పు వాటిల్లేలా.. తమ పార్టీ ఎవరినీ అనుమతించదంటూ సోనియా గాంధీ పేరుతో ట్వీట్ చేశారు. ప్రధాని నరేంద్ర మోడీ.. ఈ కామెంట్లను ఖండించారు. వేర్పాటువాదంపై ఆ పార్టీ బహిరంగ ప్రకటనలు చేస్తోందని ఆరోపించారు. కాంగ్రెస్‌తోపాటు సోనియాపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ..…
వివాదాస్పదమైన ‘ది కేరళ స్టోరీ’ సినిమా కొత్త తరహా ఉగ్రవాదాన్ని బయటపెట్టిందని బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా అన్నారు. బెంగళూరులో ఈ చిత్రాన్ని ఆయన ఆదివారం వీక్షించారు.
కర్ణాటక ఎన్నికల ప్రచారం సందర్భంగా కాంగ్రెస్ అధికారంలోకి వస్తే అల్లర్లు అంటూ వ్యాఖ్యలు చేసిన కేంద్ర హోం మంత్రి అమిత్ షాపై కాంగ్రెస్ భగ్గుమంది. రెచ్చగొట్టే ప్రకటనలు చేసిన బీజేపీ నేతలపై కాంగ్రెస్ సీనియర్ నేతలు రణదీప్ సింగ్ సూర్జేవాలా, డాక్టర్ పరమేశ్వర్, డీకే శివకుమార్ బెంగళూరులోని హైగ్రౌండ్స్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
HD Kumaraswamy : కర్ణాటకలో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. దీంతో పార్టీలన్నీ ఎన్నికల్లో గెలవాలని తమ ప్రచారాస్త్రాలకు పదును పెడుతున్నాయి. రాష్ట్రంలో ఎన్నికల వేడి తారా స్థాయికి చేరుకుంది.