DK Shivakumar: కాంగ్రెస్ అండగా నిలుస్తుంది…సీఎం పదవిపై శివకుమార్ సంచలన వ్యాఖ్య
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కర్ణాటక ఎన్నికల్లో గెలుపు కోసం కాంగ్రెస్ కష్టపడుతోంది. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు డీకే శివకుమార్ నేతృత్వంలో ఈ సారి అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. కాంగ్రెస్ లో ట్రబుల్ షూటర్ పేరున్న శివకుమార్..రాష్ట్రంలో పార్టీని అధికారంలోకి తీసుకొస్తారన్న నమ్మకంతో పార్టీ అగ్ర నాయకత్వం ఉంది. మేలో జరిగే కర్ణాటక ఎన్నికల్లో పార్టీ గెలిస్తే ఎవరు ముఖ్యమంత్రి అవుతారనే దానిపై కాంగ్రెస్‌లో ఏవైనా చీలికలు ఉన్నాయనే ప్రచారం జరుగుతోంది. అయితే, ఈ వాదనను తోసిపుచ్చిన రాష్ట్ర పార్టీ చీఫ్ డికె శివకుమార్. పార్టీ నాయకత్వం విధేయత, కృషికి ప్రతిఫలమిస్తుందనడంలో సందేహం లేదని ఆయన అన్నారు.
Also Read: Bandi sanjay wife: ఎమోషన్స్ లేని ఈ ప్రభుత్వానికి “బలగం” సినిమా చూపించాలి
నేను పార్టీకి నమ్మకమైన వ్యక్తిని, పార్టీకి ద్రోహం చేయలేదు.. కర్ణాటక ఎన్నికల్లో గెలుస్తాం. ఆ తర్వాత హైకమాండ్‌కే వదిలేస్తాం. పార్టీకి అండగా నిలిచే ప్రజలకు హైకమాండ్ ఎప్పుడూ అండగా నిలుస్తోంది. మా నాయకత్వంపై నాకు నమ్మకం ఉందన్నారు. కష్టకాలంలో పార్టీకి అండగా నిలిచిన వారికి కాంగ్రెస్ నాయకత్వం ప్రతిఫలమిస్తుందని తాను ఖచ్చితంగా అనుకుంటున్నానని డీకే శివకుమార్ అన్నారు.కాంగ్రెస్ పార్టీ బలహీనమైన స్థితిలో ఉన్నప్పుడు తాను పీసీసీ పదవిని తీసుకున్నానని గుర్తు చేశారు. దానిని పునరుద్ధరించడానికి అవిశ్రాంతంగా పనిచేశానని చెప్పారు. రాష్ట్రంలోని ప్రతి మూల మూలకు వెళ్లానని తెలిపారు. తాము బిజెపికి వ్యతిరేకంగా బలమైన శక్తిగా పార్టీని నిర్మించామన్నారు.
Also Read:Bandi sanjay: బండి సంజయ్ పిటిషన్ విచారణ ఈనెల 10 కి వాయిదా
Also Read
- Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
- Punjab: ఎన్నికల వేళ హస్తం పార్టీకి షాక్.. కాంగ్రెస్ అధ్యక్షుడు అమరీందర్ వారింగ్ రాజీనామా
- Chhattisgarh: బాలీవుడ్ ఆఫర్ కొట్టేసిన మాజీ మావోలు.. ఏ సినిమా అంటే..!
- RBI: ఆర్బీఐ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా సుధాకర్ మల్లి నియామకం
అత్యున్నత పదవికి పోటీదారుగా భావించే మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్యతో అంతర్గత పోరుపై వస్తున్న ప్రచారాన్ని శివకుమార్ తోసిపుచ్చారు. తాము కలిసి పని చేస్తున్నామని, బీజేపీ తమ మధ్య వైరం పెడుతోందని చెప్పారు. మేమంతా కలిసికట్టుగా ఉన్నామని, బీజేపీని ఓడించి కర్ణాటక పరువు నిలబెట్టడమే తమ ఉమ్మడి లక్ష్యం శివకుమార్ స్పష్టం చేశారు.
తాజావార్తలు
-
Gandhi Reel Row: ఇలా చేస్తే నెక్ట్స్ మీరే?.. రూ.500 నోటుతో రీల్ చేసి అడ్డంగా బుక్కైంది.. అసలు ఏం జరిగిందంటే?
-
KA 13 : కిరణ్ అబ్బవరం ‘రియాలిటీ’ రిలీజ్ డేట్ ఫిక్స్
-
Jal Jeevan Mission 2.0: 27 లక్షల గ్రామీణ కుటుంబాలకు గుడ్‌న్యూస్.. రూ.30,156 కోట్లతో తాగునీటి పథకం..!
-
India vs West Indies T20 Series: భారత్- వెస్టిండీస్ తొలి టీ20 మ్యాచ్ ఎప్పుడు? మొత్తం 5 మ్యాచ్‌ల షెడ్యూల్ ఇదే
-
Local Body Elections: స్థానిక ఎన్నికలపై సుప్రీం కోర్టు తలుపు తట్టిన వైఎస్సార్సీపీ.. డిమాండ్ ఏంటంటే.?
ట్రెండింగ్
-
5000 నిట్స్ డిస్‌ప్లే, 9,020mAh బ్యాటరీ, IP69 రేటింగ్‌తో Vivo Y600k Turbo లాంచ్..!
-
ఆఫర్లే ఆఫర్లు.. OnePlus Festive Sale వచ్చేసిందోచ్.. వాటిపై భారీ డిస్కౌంట్స్.!
-
Family Secrets Leak : ఇంటి గుట్టు లంకేశ్వరుడికి ఎరుక.. కుటుంబ రహస్యాలు పొరుగువారికి చేరుతున్నాయా.?
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!