నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సీఎంగా పనిచేసిన కిరణ్ కుమార్ రెడ్డి.. కాంగ్రెస్ పార్టీని వీడి బీజేపీ కండువా కప్పుకున్న సంగతి తెలిసిందే. తాజాగా ఆయనకు బీజేపీ అధిష్టానం కీలక బాధ్యతలు అప్పగించనుందనే వార్తలు వచ్చాయి. ఏపీలో ఆయన క్రియాశీలక పాత్ర పోషించే అవకాశం ఉందని తెలుస్తోంది. తెలంగాణ, కర్ణాటకల్లో ఆఫ్ స్క్రీన్.. ఏపీలో ఆన్ స్క్రీన్ పాత్ర పోషించనున్నారు కిరణ్ కుమార్ రెడ్డి.తెలుగు రాష్ట్రాలు, కర్ణాటక ఎన్నికల్లో కిరణ్ కుమార్ రెడ్డిని వినియోగించుకోనుంది బీజేపీ హైకమాండ్. కర్ణాటక, తెలంగాణ, ఏపీ రాష్ట్రాల్లోని రెడ్డి సామాజిక వర్గానికి చెందిన నేతలతో టచ్ లోకి వెళ్లాలని కిరణ్ కు బాధ్యతలు అప్పజెప్పింది హైకమాండ్.
ఇప్పటికే యడ్యూరప్పతో కిరణ్ కుమార్ రెడ్డి భేటీ అయ్యారు. ఏపీలో రాజంపేట లోక్ సభ స్థానం నుంచి కిరణ్ కుమార్ రెడ్డి పోటీ చేసే అవకాశం ఉంది. కిరణ్ కుమార్ రెడ్డికి జాతీయ కార్యదర్శి పదవి ఇచ్చే అవకాశం ఉందని ఢిల్లీ వర్గాల ద్వారా తెలుస్తోంది. త్వరలో పార్టీలో చేయబోయే మార్పులు చేర్పుల్లో జాతీయ కార్యదర్శి పదవి కట్టబెట్టే అవకాశం ఉంది. ఏ మాత్రం వీలున్నా ఈలోగానే జాతీయ కార్సదర్శి పదవి కట్టబెట్టే అంశాన్ని పరిశీలిస్తోంది బీజేపీ హైకమాండ్. కిరణ్ తో కలిసి పని చేయాలని చెప్పేందుకే ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజుని ఢిల్లీకి రమ్మని పిలిచింది బీజేపీ అధిష్టానం.
Read Also: Telangana: పెండింగ్ బిల్లులపై నేడు సుప్రీంకోర్టులో విచారణ.. సర్వత్రా ఉత్కంఠ
మరోవైపు ఏపీతో పాటు తెలంగాణలోనూ కిరణ్ కుమార్ రెడ్డిని ఉపయోగించుకుంటారని భావించారు. మల్కాజ్ గిరి లోక్ సభ సీటు నుంచి కిరణ్ కుమార్ రెడ్డిని బీజేపీ తరఫున బరిలో నిలుపుతారని కూడా భావిస్తున్నారు. తెలంగాణ ఎన్నికలకు ఇంకా సమయం ఉన్నందున కర్నాటక ఎన్నికలకు కిరణ్ కుమార్ రెడ్డి సేవలు వినియోగించుకోనుంది. మరి కర్నాటకలో కిరణ్ కుమార్ బీజేపీ తరఫున ఆట ఎలా ఆడతారో, అక్కడ మళ్ళీ అధికారంలోకి రావాలని తపన పడుతున్న బీజేపీకి కిరణ్ కుమార్ రెడ్డి యాక్టివ్ రోల్ ఎలా ఉపయోగపడుతుందో చూడాలి.
Read Also: NTR: మే 20న… ‘వస్తున్నాడు’