కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు అన్ని పార్టీలకు రెడీ అయ్యాయి. దశల వారిగా ప్రధాన పార్టీలు తమ అభ్యర్థులను ప్రకటిస్తున్నాయి. అయితే, అధికార బీజేపీ మాత్రం ఇంకా వేచి చూసే ధోరణి అవలంభిస్తోంది. శాసనసభ ఎన్నికల షెడ్యూల్ వెలువడిన అనంతరం కొందరు ఎమ్మెల్యేలకు న్యాయస్థానాలు వరుసగా షాక్‌లు ఇస్తున్నాయి. మే 10న రాష్ట్రంలో ఎన్నికలు జరగబోతున్నా్యి. ఈ క్రమంలో తమ పార్టీ అభ్యర్థల ఎంపికపై కసరత్తు ప్రారంభించింది కాషాయ పార్టీ.
Also Read:Paper Leak: వికారాబాద్ లో పదో తరగతి పరీక్ష పత్రం లీక్!
కర్ణాటకలో ఎలాంటి పొరపాట్లు జరగకుండా ఉండేందుకు ఆసక్తిగా ఉన్న బీజేపీ, మే 10న జరిగే ఎన్నికల్లో అత్యధికంగా గెలుపొందే అభ్యర్థులను గుర్తించేందుకు రాష్ట్రవ్యాప్తంగా మినీ పోల్స్‌ను ప్రారంభించింది. అధికార పార్టీ కర్నాటక అభ్యర్థులను ఇంకా ప్రకటించలేదు. అది ప్రణాళికాబద్ధంగా ఉందని ఆపార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఎన్నికలపై నిర్ణయాలు తీసుకునే బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ ఏప్రిల్ రెండో వారంలో సమావేశం కానుంది. నామినేషన్ ప్రక్రియకు దగ్గర్లోనే పార్టీ అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉంది. అసంతృప్తులు, టికెట్ దక్కని వారు పార్టీ మారే అకాశం ఉంది. ఈ నేపథ్యంలో మంచి సమయం కోసం బీజేపీ ఎదురు చూస్తున్నట్లు తెలుస్తోంది.
Also Read:CM YS Jagan: ముందస్తు ఎన్నికలపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్
వేచి చూసే వ్యూహంతో ఉన్న బిజెపి.. కాంగ్రెస్ , జనతాదళ్ (సెక్యులర్) అభ్యర్థుల జాబితాలపై నిఘా ఉంచింది. ఆయా పార్టీలు అభ్యర్థులను ప్రటకించిన తర్వాత తమ పార్టీ అభ్యర్థులను ఖరారు చేయాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. అంతే కాదు ప్రతి నియోజకవర్గంలో అంతర్గత సర్వేలు కూడా సిద్ధం చేస్తోంది. రెండు వారాల క్రితం ప్రారంభమైన కసరత్తులో ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో స్థానిక నేతలు ముగ్గురు ఉత్తమ అభ్యర్థులకు ఓటు వేయాలని కోరారు. వారికి ఓటింగ్ స్లిప్పులు అందజేసి తమ ప్రాధాన్యతను గుర్తించాలని కోరారు.
Also Read:Anasuya: ఆంటీ వివాదంపై అనసూయ రియాక్షన్.. కోపానికి కారణం అదే!
బ్యాలెట్ బాక్సులను బెంగళూరుకు తీసుకువచ్చారు. ఫలితాల ఆధారంగా, ప్రతి నియోజకవర్గానికి మూడు అగ్ర పేర్లు ఉన్నాయి. అంతర్గత సర్వేలు, ఒపీనియన్ పోల్స్‌తో ఈ పేర్లు సరిపోయాయి. జిల్లాల వారీగా పేర్లపై చర్చించేందుకు రాష్ట్రంలోని బీజేపీ కోర్ గ్రూప్ వారాంతంలో సమావేశమైంది. అభ్యర్థులు ఇమేజ్, గెలుపు, తిరస్కరణ (అధికార వ్యతిరేకత ఉంటే సిట్టింగ్ ఎమ్మెల్యేను వదులుకోవచ్చా) అనే అంశాలపై అంచనా వేస్తున్నట్లు బీజేపీ వర్గాలు చెబుతున్నాయి.
కర్నాటకలోని ప్రస్తుత బీజేపీ ప్రభుత్వంపై అవినీతి ఆరోపణలతో కొట్టుమిట్టాడుతోంది. అవినీతి కేసులను ఎదుర్కోని క్లీన్ ఇమేజ్ ఉన్న అభ్యర్థులకు ప్రాధాన్యత ఇస్తోంది. గెలుపు కోసం, ప్రత్యర్థి కాంగ్రెస్, జనతాదళ్ (సెక్యులర్) అభ్యర్థులను తిప్పికొట్టడానికి బిజెపి ప్రణాళికలు రచిస్తోంది. పేర్లను కేంద్ర ఎన్నికల కమిటీకి పంపనున్నారు. కాగా, కర్ణాటకలో మే 10న ఒకే దశలో పోలింగ్ జరగనుంది, మూడు రోజుల తర్వాత ఫలితాలు వెల్లడికానున్నాయి.