కర్ణాటక ఎన్నికలకు ముందు బెంగళూరులో కొత్త మెట్రో లైన్‌ను ప్రధాని మోదీ ప్రారంభించారు. రూ.4,249 కోట్ల వ్యయంతో నిర్మించిన 13.71 కి.మీ మేరకు వైట్‌ఫీల్డ్ (కడుగోడి) నుంచి కృష్ణరాజపురం మెట్రో లైన్‌ను 12 స్టేషన్‌లతో శుక్రవారం ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు.
త్వరలో జరగనున్న కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ను ఇన్‌ఛార్జిగా బీజేపీ శనివారం నియమించింది. కర్ణాటకలో మరోసారి అధికారం చేపట్టేందుకు బీజేపీ ఇప్పటినుంచే పావులు కదుపుతోంది.