Siddaramaiah: కర్ణాటక సీఎం సిద్ధరామయ్య మీడియాపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నెల చివర్లో కాంగ్రెస్ ప్రభుత్వం తన ఐదేళ్ల పదవీ కాలంలో సగం కాలం పూర్తి చేసుకోబోతోంది. ఈ నేపథ్యంలో సీఎం మార్పు ఉంటుందనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ మద్దతుదారులు ఆయన తదుపరి సీఎం కావాలని డిమాండ్ చేస్తున్నారు. సోమవారం రాష్ట్ర నాయకత్వ మార్పుపై రిపోర్టర్ అడిగిన ప్రశ్నపై సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు.
Priyank Kharge: కర్ణాటకలో కాంగ్రెస్ వర్సెస్ ఆర్ఎస్ఎస్ పంచాయతీ కొనసాగుతోంది. ఇటీవల ఆర్ఎస్ఎస్ ర్యాలీల అనుమతులను నిరాకరించడంపై వివాదం మొదలైంది. ఇదిలా ఉంటే, కాంగ్రెస్ నేత, రాష్ట్ర మంత్రి ప్రియాంక్ ఖర్గే గురువారం సంచలన ఆరోపణలు చేశారు. బీజేపీ సీనియర్ నేతల పిల్లలు హస్టల్ విద్యార్థులను ఆర్ఎస్ఎస్ రూట్ మార్చ్‌కు హాజరుకావాలని బలవంతం చేస్తున్నారని ఆరోపించారు. ఇతరులకు వర్తించే చట్టాలు ఆ సంస్థలకు ఎందుకు వర్తించవు అని ప్రశ్నించారు.
DK Shivakumar: కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ప్రస్తుతం కాలంలో ‘‘కార్లు లేని అబ్బాయిలకు అమ్మాయిలను ఇచ్చి పెళ్లి చేయడం లేదు’’ అని అన్నారు. బెంగళూర్‌లో టన్నెల్ రోడ్ ప్రాజెక్టును సమర్థిస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
Karnataka: కర్ణాటకలోని సిద్ధరామయ్య ప్రభుత్వానికి హైకోర్టు షాక్ ఇచ్చింది. ఇటీవల కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వం.. ప్రభుత్వ ప్రాంగణాల్లో ప్రైవేట్ సంస్థలు కార్యక్రమాలు నిర్వహించడానికి ముందస్తు అనుమతి పొందాలని ఒక ఉత్తర్వు జారీ చేసింది. ఈ ప్రభుత్వ ఉత్తర్వును సవాలు చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ పిటిషన్‌పై ఈరోజు కోర్టు విచారిస్తూ.. రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుపై స్టే విధించింది. READ ALSO: Ramyakrishna : ఆమె కోసం ఏడ్చిన రమ్యకృష్ణ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎదురు…
Karnataka: కర్ణాటకలో అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీజేపీ మధ్య విమర్శలు, ప్రతివిమర్శలు కొనసాగుతున్నాయి. ఇటీవల, కర్ణాటక సీఎం సిద్ధరామయ్య బెంగళూర్ సౌత్ ఎంపీ, బీజేపీ తేజస్వీ సూర్యను ‘‘అమావాస్య’’గా పిలిచారు. దీనికి తేజస్వీ స్పందిస్తూ.. సీఎం సిద్ధరామయ్య ‘‘కర్ణాటకకు గ్రహణం’’ అని అన్నారు. సిద్ధరామయ్య పాలన రాష్ట్రానికి గ్రహణం లాంటిది అని విమర్శించారు. Read Also: CM Chandrababu: ఏపీలో భారీ వర్షాలు.. ఆ జిల్లాలకు అత్యవసర నిధుల విడుదలకు సీఎం ఆదేశాలు.. తనను అమావాస్య, పౌర్ణమిగా…
Yathindra Siddaramaiah: కర్ణాటక రాజకీయం రోజురోజుకు ఆసక్తికరంగా మారుతుంది. ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండగా సిద్ధరామయ్య సీఎంగా ఉన్నారు. వాస్తవానికి ఎప్పటి నుంచో రాష్ట్రంలో సీఎం మార్పు జరుగుతుందనే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. సమయం, సందర్భం వచ్చిన ప్రతిసారి సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డి.కె. శివకుమార్ వాటిని ఖండిస్తూ వస్తున్నారు. తాజాగా సీఎం సిద్ధరామయ్య కొడుకు మాట్లాడిన మాటలు దేశం దృష్టిని ఆకర్షించాయి. READ ALSO: World Cup 2025: సెమీఫైనల్ రేసు…
Karnataka: కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య అక్టోబర్ 13వ తేదీన అన్ని కేబినెట్ మంత్రులకు విందు ఇస్తున్నట్లు సమాచారం. కాంగ్రెస్ హైకమాండ్‌తో జరిగిన చర్చల సందర్భంగా, ముఖ్యమంత్రి తన పదవీకాలం 2.5 సంవత్సరాలు పూర్తి చేసుకున్న తర్వాత నవంబర్‌లో మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ చేపట్టాలని సూచనలు చేసినట్లు తెలుస్తుంది.
Karnataka: బీహార్ ఎన్నికల తర్వాత కర్ణాటకలో పెను రాజకీయ మార్పులు వస్తాయని కర్ణాటక బీజేపీ అధ్యక్షుడు బి.వై. విజయేంద్ర అంచనా వేశారు. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఉప ముఖ్యమంత్రి డి.కె. శివకుమార్ మధ్య అధికార పోరాటం జరుగుతుంద జోష్యం చెప్పారు. తాజాగా విజయేంద్ర విలేకరులతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీలో గందరగోళం నెలకొందన్నారు. పార్టీ ఎమ్మెల్యేలు నాయకత్వ మార్పు గురించి బహిరంగంగా ప్రకటనలు చేస్తున్నారని గుర్తు చేశారు. సిద్ధరామయ్య తొందరపడుతున్నట్లు కనిపిస్తున్నారన్నారు.
Bengaluru: బెంగళూర్ నగరంలో శివాజీనగర్ మెట్రో స్టేషన్ త్వరలో ప్రారంభానికి సిద్ధమైంది. మెట్రో స్టేషన్‌కు ‘‘సెయింట్ మేరీ’’ పేరు పెట్టాలని కర్ణాటక సీఎం సిద్ధరామయ్య ఒత్తిడి చేస్తుండటం తీవ్ర దుమారానికి కారణమైంది. శివాజీ నగర్ మెట్రో స్టేషన్‌కు సెయింట్ మేరీ పేరు పెట్టడం ఏంటని?? బీజేపీ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. మరాఠా ఐకాన్‌ను ఇది అవమానించడమే అని ఆరోపించింది. ఇది శివాజీ మహారాజ్‌ని అవమానించడమే అని మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ అన్నారు.
Congress: కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కుమారుడు, కర్ణాటక మంత్రిగా ఉన్న ప్రియాంక్ ఖర్గే సంచలన వ్యాఖ్యలు చేశారు. కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి తిరిగి వస్తే, రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్(ఆర్ఎస్ఎస్)ను నిషేధిస్తామని అన్నారు. ఆర్ఎస్ఎస్ సమాజంలో ద్వేషాన్ని వ్యాప్తింపచేస్తోందని ఆరోపించారు.చట్టపరిధిలో ఆ సంస్థ పనిచేయడం లేదని అన్నారు.