Karnataka BJP: కర్ణాటక భారతీయ జనతా పార్టీలో కోల్డ్ వార్ నడుస్తోంది. కాషాయ పార్టీలో అంతర్గత విభేదాలతో బహిరంగంగానే ఒకరిపై మరొకరు తీవ్ర విమర్శలు చేసుకుంటున్నారు. ఇటీవల జరిగిన ఉప ఎన్నికల్లో బీజేపీ ఓడిపోవడానికి ఇది కారణం అయి ఉండొచ్చని సమాచారం.
2024 లోక్‌సభ ఎన్నికలకు ముందు కర్ణాటక రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకోనుంది. అక్కడి ప్రభుత్వంలో మరో ఐదుగురికి డిప్యూటీ సీఎం పదవులు ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ అంశంపై కాంగ్రెస్ ఎమ్మెల్యే బసవరాజ్ రాయరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. మరో ఐదుగురిని ఉపముఖ్యమంత్రులను చేసే విషయమై చర్చిస్తున్నామని రాయరెడ్డి తెలిపారు.
కమీషన్ (లంచం) తీసుకున్నట్లు రుజువైతే రాజకీయాల నుంచి తప్పుకుంటానని కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ అన్నారు.కమీషన్ వసూలు చేశారని ఆరోపించినందుకు మాజీ ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై, మాజీ మంత్రి ఆర్ అశోకల వ్యాఖ్యలపై స్పందించిన మంత్రి డీకే శివకుమార్, వారి ఆరోపణలు అవాస్తవమని తేలితే ఇద్దరు బీజేపీ నాయకులు రాజకీయ రిటైర్మెంట్ ప్రకటిస్తారా అంటూ సవాల్ విసిరారు.
కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యపై కాంగ్రెస్ సీనియర్ నేత, ఎమ్మెల్సీ బీకే హరిప్రసాద్ తీవ్రంగా విరుచుకుపడ్డారు. మంత్రి, ముఖ్యమంత్రి పదవులకు సంబంధించి ఆయన కీలక వ్యాఖ్యలు చేయడంతో కర్ణాటకలోని అధికార పార్టీలో కలవరం మొదలైంది.
DK Shivakumar: కర్ణాటక ముఖ్యమంత్రి ఎంపిక కాంగ్రెస్ పార్టీలో మంటలు పుట్టిస్తోంది. గత నాలుగు రోజుల నుంచి అధిష్టానం ఎన్ని చర్చలు జరిపినా సీఎం అభ్యర్థి ఖరారు కాలేదు. తాజా పరిణామాలను బట్టి చూస్తే దాదాపుగా సీఎం పీఠం మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకే కన్ఫామ్ అయినట్లు తెలుస్తోంది.
Karnataka Politics: కర్ణాటక రాజకీయ పరిణామాలు సగటు కాంగ్రెస్ అభిమానిని కన్ఫ్యూజ్ చేస్తున్నాయి. ఫలితాలు వెలువడి మూడు రోజులు కావస్తున్నా.. కూడా ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరన్నది తేల్చడం లేదు. పీసీసీ చీఫ్ డీకే శివకుమార్, మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్యల మధ్య సీఎం పీఠం కోసం పోటీ నెలకొంది.
కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వానికి నూతన ముఖ్యమంత్రి ఎంపిక పెద్ద సవాల్‌గా మారింది. ప్రాంతం, కులం, సీనియారిటీ, ఎమ్మెల్యేల మనోగతం లాంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని ముఖ్యమంత్రి పదవికి ఎవరన్నది కాంగ్రెస్ అధినాయకత్వం ఎంపిక చేయనుంది. కర్ణాటక ముఖ్యమంత్రి అభ్యర్థి పేరును నిర్ణయించడంలో కాంగ్రెస్ నాయకత్వం విఫలమవడంతో ఇద్దరు ప్రధాన పోటీదారులు-డీకే శివకుమార్, సిద్ధరామయ్య- పార్టీ హైకమాండ్‌తో వివరణాత్మక చర్చ కోసం సోమవారం ఢిల్లీకి వెళ్లే అవకాశం ఉంది.
కర్ణాటక రాజకీయాల్లో ఓ ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. కర్ణాటక మాజీ సీఎం బీఎస్ యడియూరప్ప కుమారుడు బీవై విజయేంద్ర శుక్రవారం తుమకూరులోని ఓ ఆలయంలో కాంగ్రెస్ సీనియర్ నేత పరమేశ్వర ఆశీస్సులు తీసుకున్నారు.
కర్ణాటకలో రాజకీయాలు మరింత వేడిని రాజేస్తున్నాయి. ఇప్పటికే బీజేపీ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించింది. మరో వైపు కాంగ్రెస్ పార్టీ బస్సు యాత్రను ప్రారంభించింది. ఈ సందర్భంగా తాము గనుక అధికారంలోకి వస్తే ప్రతి మహిళ కుటుంబానికి రూ. 2,000 నెల నెలా ఇస్తామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది.