కర్ణాటకలో రాజకీయాలు మరింత వేడిని రాజేస్తున్నాయి. ఇప్పటికే బీజేపీ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించింది. మరో వైపు కాంగ్రెస్ పార్టీ బస్సు యాత్రను ప్రారంభించింది. ఈ సందర్భంగా తాము గనుక అధికారంలోకి వస్తే ప్రతి మహిళ కుటుంబానికి రూ. 2,000 నెల నెలా ఇస్తామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది.
కర్ణాటకలో ఎన్నికల వేడి మొదలైంది. 2023 ఎన్నికలే లక్ష్యంగా కర్ణాటక కాంగ్రెస్ పార్టీ సిద్ధమవుతోంది. అధికారంలోని బీజేపీని గద్దె దించాలని నిర్ణయించుకుని బస్సు యాత్రను ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభించనుంది. రేపు బెలగావిలో అధికారికంగా ప్రారంభించనున్నట్లు ప్రకటించింది.
Karnataka Politics: కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ నేత సిద్ధరామయ్య మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కర్ణాటక సీఎం బస్వరాజ్ బొమ్మై, బీజేపీ నేతలను కుక్కపిల్లలంటూ విమర్శించారు. ప్రధాని మోదీ ముందు వీరంతా కుక్కపిల్లలని.. మోదీని చూస్తే వణికిపోతారంటూ విమర్శించారు. 15వ ఆర్థిక సంఘం కర్ణాటకకు స్పెషల్ అలెవెన్స్ కింద రూ. 5,495 కోట్లు ఇవ్వాలని సిఫారసు చేసినా ఆర్థిక మంత్రి సీతారామన్ ఇవ్వలేదని సిద్దరామయ్య విమర్శించారు.