Karnataka Congress: కర్ణాటక కాంగ్రెస్ సంక్షోభం ప్రస్తుతానికి సమసిపోయినట్లే కనిపిస్తోంది. గత కొన్ని రోజులుగా సీఎం పీఠం కోసం సిద్ధరామయ్య, డీకే శివకుమార్ మధ్య పోటీ నెలకొంది. ఈ విషయం ఢిల్లీలోని కాంగ్రెస్ హైకమాండ్‌కు తలనొప్పిగా మారింది. 2023 ఎన్నికల గెలుపు తర్వాత,
DK Shivakumar: వరస పరాజయాలతో ఇబ్బందులు పడుతున్న కాంగ్రెస్ పార్టీకి, కర్ణాటక సంక్షోభం కొత్త తలనొప్పిగా మారింది. సీఎం పదవి కోసం సిద్ధరామయ్య, డీకే శివకుమార్‌ల మధ్య తీవ్ర పోరాటం కొనసాగుతోంది. చెరో రెండున్నరేళ్ల పాటు సీఎం అనే ఒప్పందం ప్రకారం, తనకు అవకాశం ఇవ్వాలని డీకే కోరుతున్నారు. ఇదిలా ఉంటే, ప్రస్తుతం డీకే చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. 2004లో యూపీఏ ఘన విజయం సాధించిన తర్వాత, సోనియా గాంధీ ప్రధాని పదవిని త్యాగం చేశారని…
Siddaramaiah: కర్ణాటక కాంగ్రెస్‌లో పవర్ షేరింగ్ వివాదం మరింత ముదిరింది. సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌ల మధ్య విభేదాలు తారాస్థాయికి చేరుకున్నాయి. 2023 ఎన్నికల తర్వాత, అధిష్టానం హామీ ఇచ్చినట్లు చెరో రెండున్నరేళ్లు సీఎం పోస్టును పంచుకోవాల్సిందే అని డీకే శివకుమార్ వర్గం చెబుతోంది.
Karnataka Congress: కర్ణాటక కాంగ్రెస్ పంచాయతీ కొనసాగుతూనే ఉంది. సిద్ధరాయమ్యను దించేసి, డీకే శివకుమార్‌ను అధిష్టానం సీఎంగా చేస్తుందా.? అని అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇరు వర్గాలు కూడా తమ బాస్‌లకే సీఎం పదవి ఉండాలని బలంగా కోరుకుంటున్నాయి.
DK Shivakumar: కర్ణాటకలో పవర్ షేరింగ్ వివాదం కొనసాగుతోంది. ఇప్పటికే ఈ విషయంలో హై కమాండ్ అన్ని రకాలుగా చర్చించి నిర్ణయం తీసుకుంటుందని పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే స్పష్టం చేశారు. ఇటీవల సీఎం సిద్ధరామయ్య ఖర్గేతో భేటీ అయ్యారు. ఈ నేపథ్యంలో తాజాగా డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ సంచలన ట్వీట్ చేశారు. తమ మాటను నిలబెట్టుకోవడమే నిజమైన బలం.. జడ్జి అయినా, అధినేత అయినా, నేనైనా ఎవరయినా సరే మాట నిలబెట్టుకోవాల్సిందే అంటూ…
Congress: కర్ణాటక కాంగ్రెస్‌లో పొలిటికల్ డ్రామా కొనసాగుతూనే ఉంది. రెండు పవర్ సెంటర్స్ అయిన సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ వర్గాల మధ్య పోరు ముదిరింది. ఈ సమస్య ఇప్పుడు కాంగ్రెస్ అధిష్టానం ముందుంది. కర్ణాటకలో అధికారంలోకి వచ్చిన తర్వాత రెండో 2.5 ఏళ్లు సీఎం పదవిని పంచుకోవాలని అప్పట్లో కాంగ్రెస్ హైకమాండ్ ఒప్పందం చేసింది.
DK Shivakumar: కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వంలో నాయకత్వ మార్పు ప్రచారానికి తెరపడింది. ఈ ప్రచారానికి కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ‘ఎక్స్’ పోస్ట్‌తో ముగింపు పలికారు. సీఎంగా ఐదేళ్లూ సిద్ధరామయ్యే కొనసాగుతారని ఆయన స్పష్టం చేశారు. తామంతా ఆయనకు సహకరిస్తామని ఈ సందర్భంగా డీకే శివకుమార్ వెల్లడించారు. READ ALSO: iBomma Case: ఐబొమ్మ స్థాపకుడు ఇమ్మడి రవిపై మరో నాలుగు కేసులు నమోదు… ఈ ప్రకటన వెలువడక ముందు వరకు కూడా కర్ణాటకలో పవర్…
Karnataka Politics: కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే తన నివాసంలో పలువురు కర్ణాటక ఎమ్మెల్యేలను కలిశారు. ఎమ్మెల్యేల అభ్యర్థన మేరకు ఈ సమావేశం ఏర్పాటు చేశారు. అయితే, ఈ సమావేశం గురించి భద్రతా విభాగానికి సమాచారం ఇవ్వకపోవడంతో గేట్ వద్ద హడావుడి కొనసాగింది. తరువాత మల్లికార్జున్ ఖర్గే రంగంలోకి దిగారు. ఎమ్మెల్యేలతో సమావేశమై వారి సమస్యలను విన్నారు. ఇదిలా ఉండగా.. కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ ఎమ్మెల్యేల ఢిల్లీ పర్యటన గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.…