DK Shivakumar: కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వంలో నాయకత్వ మార్పు ప్రచారానికి తెరపడింది. ఈ ప్రచారానికి కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ‘ఎక్స్’ పోస్ట్‌తో ముగింపు పలికారు. సీఎంగా ఐదేళ్లూ సిద్ధరామయ్యే కొనసాగుతారని ఆయన స్పష్టం చేశారు. తామంతా ఆయనకు సహకరిస్తామని ఈ సందర్భంగా డీకే శివకుమార్ వెల్లడించారు.
READ ALSO: iBomma Case: ఐబొమ్మ స్థాపకుడు ఇమ్మడి రవిపై మరో నాలుగు కేసులు నమోదు…
ఈ ప్రకటన వెలువడక ముందు వరకు కూడా కర్ణాటకలో పవర్ పాలిటిక్స్ పీక్స్‌కు చేరినట్లు టాక్ నడిచింది. ఈ క్రమంలో కర్ణాటక కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మూడు ముక్కలుగా చీలిపోయారు. వారిలో ఒక వర్గం సిద్ధరామయ్యకు, రెండవ వర్గం డీకే శివ కుమార్‌కు, కొత్తగా మూడవ వర్గంగా కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున టీం తెరపైకి వచ్చింది. 2023లో సిద్ధరామయ్య రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. తాజాగా కర్ణాటకలో కాంగ్రెస్ సర్కార్ రెండున్నర ఏళ్లు పూర్తి చేసుకుంది. మొదట్లో అనుకున్న ఒప్పందం ప్రకారం ఇప్పుడు ముఖ్యమంత్రి పగ్గాలు డీకే శివకుమార్‌కు అప్పగించాలని కొంత మంది ఎమ్మెల్యేలు డిమాండ్ లేవనెత్తుతున్నారు. తనను ముఖ్యమంత్రి చేయాలంటూ డీకే శివకుమార్ ఇప్పటికే పలుసార్లు హై కమాండ్‌తో చర్చలు కూడా జరిపారు.
ఈ నేపథ్యంలో డీకే తరఫు ఎమ్మెల్యేలు నిన్న రాత్రి ఢిల్లీ నుంచి తిరిగి వచ్చారు. నిన్న(గురువారం) ఎమ్మెల్యేలు ఏఐసీసీ చీఫ్ ఖర్గేతో భేటీ అయ్యారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి పగ్గాలను డీకే శివకుమార్‌కు ఇవ్వాలంటూ పట్టుబడుతున్నారు. మరోవైపు.. సిద్ధరామయ్య సీఎం పీఠం వదులుకునేందుకు ఆసక్తి చూపడం లేదు. ఈక్రమంలో శుక్రవారం ఎక్స్ వేదికగా కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ పూర్తి ఐదేళ్లు సిద్ధరామయ్యే కర్ణాటక సీఎంగా కొనసాగుతారని స్పష్టం చేస్తూ పోస్ట్ చేశారు. దీంతో గత కొద్ది రోజులుగా కర్ణాటకలో జరుగుతున్న పవర్ పాలిటిక్స్‌కు తెర పడినట్లు అయ్యింది.
READ ALSO: Flipkart Black Friday Sale: ఫ్లిప్‌కార్ట్ బ్లాక్ ఫ్రైడే సేల్ డేట్ ఫిక్స్..
All 140 MLAs are my MLAs. Making a group is not in my blood.
The CM decided to reshuffle the cabinet. Everyone wants to become a minister, so it is quite natural for them to meet the leadership in Delhi.
It is their right. We can’t stop them and say no.The CM has said that… pic.twitter.com/XSZ1ZiqXC8
— DK Shivakumar (@DKShivakumar) November 21, 2025