23 ప్రమాదకరమైన కుక్క జాతులపై నిషేధం విధిస్తూ కేంద్రం ఇచ్చిన ఉత్తర్వులను కర్ణాటక హైకోర్టు బుధవారం కొట్టివేసింది. ఇదివరకు కేంద్ర మత్స్య, పశుసంవర్ధక మరియు పాడి పరిశ్రమ మంత్రిత్వ శాఖ జారీ చేసిన వివాదాస్పద సర్క్యులర్ ఆపరేషన్‌పై స్టే విధించేందుకు కర్ణాటక హైకోర్టు జోక్యం చేసుకుంది. నిర్దిష్ట జాతుల కుక్కల పెంపకాన్ని నిషేధించాలని ఉద్దేశించిన సర్క్యులర్, వాటిని “ఉగ్రపూరితమైనది మరియు మానవ జీవితానికి ప్రమాదకరం”గా పరిగణించడం వలన న్యాయపరమైన సవాలును ఎదురుకోవాల్సి వచ్చింది. Also read: Directors…
వరకట్న వేధింపుల చట్టం దుర్వినియోగంపై కర్ణాటక హైకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. వరకట్న వేధింపుల కేసుల్లో తమ భర్త బంధువులపై ఎలాంటి సాక్ష్యాధారాలు లేకపోయినా చాలాసార్లు మహిళలు ఇరికిస్తున్నారని కోర్టు తన తీర్పులో పేర్కొంది.
Karnataka High Court: అత్యాచార బాధితురాలు గర్భంతో ఉంటే, 24 వారాల గర్భాన్ని తొలగించుకునేందుకు అనుమతి ఉందని, ఈ విషయాన్ని బాధితులకు ఆయా పరిధిలోని పోలీసులు చెప్పాలని కర్ణాటక హైకోర్టు దిశానిర్దేశం చేసింది. దీని వల్ల బాధితులు సమయం దాటాక కోర్టులను ఆశ్రయించాల్సిన అవసరం ఉండదని హైకోర్టు చెప్పింది. 17 ఏళ్ల అత్యాచార బాధితురాలు, నేర ఫలితంగా గర్భం దాల్చింది. ఈ గర్భాన్ని వైద్యపరంగా రద్దు చేయాలని కోరుతూ ఆమె తండ్రి హైకోర్టును ఆశ్రయించారు. ఈ కేసులో…
Virtual Hearing : ఆన్‌లైన్ కోర్టు విచారణల సమయంలో అశ్లీల వీడియోలు ప్లే అవుతున్న కేసులు చాలా ఉన్నాయి. వారం రోజుల క్రితమే కర్ణాటక హైకోర్టు విచారణలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అసభ్యకర వీడియోలను ప్రదర్శించిన ఘటన వెలుగులోకి వచ్చింది.
Gauri Lankesh : గౌరీ లంకేశ్ హత్య కేసులో నిందితుడు మోహన్ నాయక్‌కు కర్ణాటక హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. లక్ష రూపాయల వ్యక్తిగత పూచీకత్తుపై జస్టిస్ ఎస్ విశ్వజీత్ శెట్టితో కూడిన సింగిల్ బెంచ్ బెయిల్ మంజూరు చేసింది.
DK Shiva Kumar: కాంగ్రెస్ నేత, కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌కి కర్ణాటక హైకోర్టు షాకిచ్చింది. తనపై కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ) నమోదు చేసిన ఆదాయానికి మించిన ఆస్తుల కేసు కొట్టేయాలని పిటిషన్ దాఖలు చేసిన డీకే శివకుమార్‌కి ఊహించని ఎదురుదెబ్బ తాకింది. ఆయన అభ్యర్థనను కర్ణాటక హైకోర్టు తిరస్కరించింది.
జేడీఎస్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణకు కర్ణాటక హైకోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఎన్నికల సర్టిఫికెట్‌లో తప్పుడు సమాచారం ఇచ్చినందుకు గాను కోర్టు ఆయనను లోక్‌సభకు అనర్హులుగా ప్రకటించింది.
మతపరమైన ప్రార్థనల కోసం నివాస గృహాన్ని ఉపయోగించడంపై ఎలాంటి ఆంక్షలు లేవని కర్ణాటక హైకోర్టు పేర్కొంది. బెంగళూరులోని హెచ్‌బీఆర్ లేఅవుట్ నివాసి నివాసాన్ని ప్రార్థనకు ఉపయోగిస్తున్నారంటూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని (పీఐఎల్) కొట్టివేస్తూ కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది.