హవానా సిండ్రోమ్ వ్యాధిపై ఇండియాలో కూడా కొంత ఆందోళన ఉంది. భారత్‌లో ఈ వ్యాధి వ్యాప్తికి సంబంధించి దేశంలో ఉందా? లేదా? అనేది స్పష్టంగా తెలియకపోయినప్పటికీ.. అనుమానాలు, ఆందోళన మాత్రం ఉంది.
ప్రధానమంత్రిపై దుర్భాషలాడడం అవమానకరమైనదని,బాధ్యతారాహిత్యమైనదని.. అయితే అది దేశద్రోహం కాదని, పాఠశాల యాజమాన్యంపై దేశద్రోహ కేసును రద్దు చేస్తూ కర్ణాటక హైకోర్టు పేర్కొంది.
భర్త నుంచి భార్య భరణం పొందడం సర్వసాధారణం. అయితే భరణం పొందడంపై కర్ణాటక హైకోర్టు కీలక తీర్పునిచ్చింది. భర్త నుంచి భరణం పొందడానికి భార్య సరైన కారణం చూపాలని పేర్కొంది.
కర్ణాటక హైకోర్టులో ట్విట్టర్ సంస్థకు షాక్ ఇచ్చింది. కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాలపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ ట్విట్టర్ సంస్థ దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు తిరస్కరించింది.
Karnataka High Court: భార్యతో శృంగారానికి భర్త నిరాకరించడం నేరం కాదని కర్ణాటక హైకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. హిందూ వివాహ చట్టం ప్రకారం శృంగారానికి నిరాకరించడం క్రూరత్వమే కానీ.. ఐపీసీ సెక్షన్ 438ఏ ప్రకారం నేరం కాదని స్పష్టం చేసింది. భర్త, అత్తమామాలపై సదరు మహిళ పెట్టిన క్రిమినల్ కేసును కొట్టేసింది.
భారతదేశంలో ఫేస్‌బుక్‌ను మూసివేస్తామని కర్ణాటక హైకోర్టు సోషల్ మీడియా దిగ్గజానికి వార్నింగ్ ఇచ్చింది.. దక్షిణ కన్నడ జిల్లా మంగళూరు సమీపంలోని బికర్నకట్టె నివాసి కవిత సమర్పించిన పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన జస్టిస్ కృష్ణ ఎస్.దీక్షిత్ ధర్మాసనం ఈ వార్నింగ్ ఇచ్చింది.
తనతో ఒక్కరోజు మాత్రమే జీవించిన తన భర్త అత్యాచారానికి పాల్పడ్డాడంటూ ఓ మహిళ దాఖలు చేసిన ఫిర్యాదుపై కర్ణాటక హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. న్యాయస్థానం ఈ కేసును చట్ట దుర్వినియోగానికి ప్రధాన ఉదాహరణగా పరిగణించింది. భార్య దాఖలు చేసిన ఫిర్యాదును సవాల్ చేస్తూ భర్త, అతని కుటుంబ సభ్యులు హైకోర్టును ఆశ్రయించడంతో వారిపై క్రిమినల్ ప్రక్రియపై మధ్యంతర స్టే విధించింది.. ఆ భార్యాభర్తలు బెంగళూరులోని మల్టీ నేషనల్ మోటార్‌బైక్ షోరూమ్‌లో సహచరులు. నాలుగు సంవత్సరాల…
Karnataka High Court: అనుమానంతో తన భార్య, ముగ్గురు పిల్లలతో సహా ఐదుగురిని హత్య చేసిన వ్యక్తికి కర్ణాటక హైకోర్ట్ ధర్వార్డ్ బెంచ్ మరణశిక్ష విధించింది. 10 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న ముగ్గురు పిల్లలతో సహా ఐదుగురు మరణాలకు దారితీసిన ఈ నేరాన్ని కూరత్వంతో పోలుస్తూ అత్యంత అరుదైన కేసుగా అభివర్ణించింది. బరువెక్కిన హృదయంతో ట్రయర్ కోర్టు విధించిన మరణశిక్షను ధృవీకరించడం తప్పితే మాకు మరో మార్గం లేదని న్యాయమూర్తులు వ్యాఖ్యానించారు.
కర్ణాటకలో కొద్ది రోజుల క్రితం జరిగిన రాష్ర్ట శాసన సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయ దుందుభి మోగించింది. కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ గెలుపులో ప్రధాన భూమిక ఆ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా ఉన్న డీకే శివకుమార్‌ది. కర్ణాటక గెలుపులో డీకేతోపాటు ప్రస్తుతం ముఖ్యమంత్రిగా కొనసాగుతున్న కాంగ్రెస్ సీనియర్ నేత సిద్ధరామయ్య పాత్ర కూడా ఉంది.
ట్విటర్‌లో కొన్ని ఖాతాలను బ్లాక్ చేయడానికి గల కారణాలను ఎందుకు చెప్పలేదని కర్ణాటక హైకోర్టు కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ (MEITY) వివిధ ఉపసంహరణ ఉత్తర్వులను సవాలు చేస్తూ ట్విట్టర్ ద్వారా దాఖలు చేసిన పిటిషన్‌ను విచారిస్తున్న జస్టిస్ కృష్ణ ఎస్ దీక్షిత్ ధర్మాసనం ప్రభుత్వ న్యాయవాదిని ప్రశ్నించింది.