Virtual Hearing : ఆన్‌లైన్ విచారణ జరుగుతుండగా కోర్టులో ప్లే అయిన బ్లూ ఫిల్మ్.. జడ్జి ఏం చేశాడంటే ?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Virtual Hearing : ఆన్‌లైన్ కోర్టు విచారణల సమయంలో అశ్లీల వీడియోలు ప్లే అవుతున్న కేసులు చాలా ఉన్నాయి. వారం రోజుల క్రితమే కర్ణాటక హైకోర్టు విచారణలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అసభ్యకర వీడియోలను ప్రదర్శించిన ఘటన వెలుగులోకి వచ్చింది. రాష్ట్రంలో మరోసారి అలాంటి ఘటనే వెలుగులోకి వచ్చింది. హైకోర్టు తర్వాత, మరో కోర్టు విచారణ సందర్భంగా అసభ్యకరమైన వీడియోను ప్రదర్శించారు. కర్ణాటక స్టేట్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ (KSAT) వీడియో కాన్ఫరెన్స్‌లో అసభ్యకరమైన వీడియో ప్రదర్శించబడింది. ఆన్‌లైన్ విచారణలో అశ్లీల వీడియోలు ప్లే కావడంతో న్యాయమూర్తి కూడా ఆశ్చర్యపోయారు. దీంతో కోర్టు ఆన్‌లైన్ కార్యకలాపాలను హడావుడిగా నిలిపివేయాల్సి వచ్చింది.
Read Also:Hyderabad : భార్య ఆత్మహత్య చేసుకుంటుంటే వీడియో తీసిన భర్త..
Also Read
- Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
- KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
- Pujara Playing XI: వెస్టిండీస్‌తో టీ20 సిరీస్.. వైభవ్ సూర్యవంశీకి దక్కని చోటు..
- AP Govt: రేపు ఏపీలో ‘అమరజీవి జలధార’కు శ్రీకారం.. 27.36 లక్షల కొత్త కుళాయి కనెక్షన్లు..
ఈ విషయమై ఒక KSAT అధికారి బెంగళూరులోని సెంట్రల్ సేన్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. వీడియో కాన్ఫరెన్స్‌లో లాగిన్ అయి అభ్యంతరకర వీడియో చూపించిన గుర్తు తెలియని వ్యక్తిపై కేసు నమోదు చేశారు. ఈ ఘటన తర్వాత అధికారులు ఆన్‌లైన్ విచారణను రద్దు చేశారు. దీనిపై ఐటీ చట్టంలోని సెక్షన్ 67, 67ఏ కింద కేసు నమోదు చేశారు. అసభ్యకర వీడియోలు చూపుతున్న దుశ్చర్యలపై పోలీసులు ఆరా తీస్తున్నారు.
Read Also:TS Assembly Session: రేపటి నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు.. 17 వరకు జరిగే అవకాశం
కేవలం వారం రోజుల క్రితం కర్ణాటక హైకోర్టులో వీడియో కాన్ఫరెన్స్‌లో అసభ్యకరమైన చిత్రం ప్రదర్శించబడింది. కంప్యూటర్ విభాగం రిజిస్ట్రార్ కార్యాలయానికి చెందిన ఎన్. సురేష్ ఈ విషయమై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మొత్తం వ్యవహారంపై పోలీసులు సెక్షన్ 67, 67(ఏ) కింద కేసు నమోదు చేశారు. కోర్టు విచారణ సందర్భంగా అసభ్యకర వీడియో ఘటన వెలుగులోకి రావడంతో అధికారులు వెంటనే రంగంలోకి దిగారు. కర్ణాటక హైకోర్టు బెంగళూరు, ధార్వాడ్, కలబురగి బెంచ్‌లలో వీడియో కాన్ఫరెన్స్ , కోర్టుల ప్రత్యక్ష ప్రసారాన్ని నిషేధించింది. డిసెంబరు 5న కోర్టులో ప్రధాన న్యాయమూర్తి పిబి వరాలే ఈ నిర్ణయాన్ని ప్రకటించారు.
తాజావార్తలు
-
Redmi TV X RGB Mini LED 2027 Launched: రూ.40 వేల లోపే 360Hz గేమింగ్ TV.. 85 ఇంచెస్ Redmi కొత్త Mini LED TV లాంచ్
-
Fire Accident : ప్లాస్టిక్ గోదాంలో భగ్గుమన్న మంటలు.. వరుసగా పేలిన కెమికల్ డ్రమ్ములు
-
Petrol Diesel Price: 100 డాలర్లు దాటిన క్రూడ్ ఆయిల్ ధరలు! OPEC+ కీలక నిర్ణయం.. పెట్రోల్, డీజిల్ ధరలు మళ్లీ పెరుగుతాయా?
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?
-
Telangana MLC : తెలంగాణ ఎమ్మెల్సీ రేసులో బిగ్ ట్విస్ట్.. ఆ మూడు సీట్లు ఎవరికి?
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!