బైక్ ప్రయాణించే వారికి హెల్మెట్ ధరించడం చాలా ముఖ్యం. ప్రమాద సమయాల్లో ప్రాణాపాయాన్ని తప్పిస్తుంది. హెల్మెట్ ధరించాలని ట్రాఫిక్ పోలీసులు పదే పదే వాహనదారులకు సూచిస్తుంటారు. అయితే ఇప్పుడు, ద్విచక్ర వాహనాలపై ప్రయాణించే పిల్లలు హెల్మెట్ ధరించడం తప్పనిసరి కానుంది. ఇటీవల, కర్ణాటక హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని పిల్లలకు హెల్మెట్ తప్పనిసరి చేయాలని ఆదేశించింది. దీనికి సంబంధించి, ద్విచక్ర వాహనాలపై ప్రయాణించే పిల్లలకు పిల్లల సైజు హెల్మెట్‌లు, సేఫ్టీ హార్నెస్‌లను తప్పనిసరిగా అందుబాటులో ఉంచాలని హైకోర్టు పేర్కొంది.…
Karnataka: కర్ణాటకలోని సిద్ధరామయ్య ప్రభుత్వానికి హైకోర్టు షాక్ ఇచ్చింది. ఇటీవల కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వం.. ప్రభుత్వ ప్రాంగణాల్లో ప్రైవేట్ సంస్థలు కార్యక్రమాలు నిర్వహించడానికి ముందస్తు అనుమతి పొందాలని ఒక ఉత్తర్వు జారీ చేసింది. ఈ ప్రభుత్వ ఉత్తర్వును సవాలు చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ పిటిషన్‌పై ఈరోజు కోర్టు విచారిస్తూ.. రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుపై స్టే విధించింది. READ ALSO: Ramyakrishna : ఆమె కోసం ఏడ్చిన రమ్యకృష్ణ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎదురు…
కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు ఎన్.ఆర్. నారాయణ మూర్తి, రచయిత్రి సుధా మూర్తిపై తీవ్ర విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో జరుగుతున్న సామాజిక, విద్యా సర్వే వెనుకబడిన తరగతుల కోసం మాత్రమే కాదు, మొత్తం జనాభా కోసం అని ఆయన అన్నారు. మూర్తి దంపతులు సర్వేలో పాల్గొనడానికి నిరాకరించిన తర్వాత ఆయన ఈ ప్రకటన చేశారు. Also Read:Rekha Boj : కిడ్నీ అమ్ముకుని సినిమా చేస్తా.. నటి షాకింగ్ కామెంట్స్ కర్ణాటకలో సామాజిక, విద్యా సర్వే…
Actor Darshan: రేణుకా స్వామి హత్య కేసులో నిందితుడిగా ఉన్న కన్నడ స్టార్ హీరో దర్మన్‌కు మంజూరు చేసిన బెయిల్‌ను కర్ణాటక హైకోర్టు రద్దు చేసింది. దీంతో జైలు శిక్ష అనుభవిస్తున్న దర్మన్ మంగళవారం కోర్టను తనకు ‘‘విషం ఇవ్వాలి’’ అని కోరారు. తాను రోజుల తరబడి సూర్యకాంతిని చూడలేదని చెప్పారు.
Supreme Court: గతేడాది తన అభిమాని అయిన 33 ఏళ్ల రేణుకాస్వామిని దారుణంగా హత్య చేసిన కేసులో కీలక నిందితుడిగా కన్నడ స్టార్ హీరో దర్శన్ ఉన్నాడు. దర్శన్‌తో పాటు అతడి భాగస్వామి పవిత్ర గౌడ కూడా నిందితురాలు. రేణుకాస్వామిని కర్ణాటకలో చిత్రదుర్గ నుంచి కిడ్నాప్ చేసి, బెంగళూర్ తీసుకువచ్చి, దారుణంగా చిత్ర హింసలు పెట్టి హత్య చేశారు. అయితే, కర్ణాటక హైకోర్టు దర్శన్‌కు బెయిల్ ఇవ్వడంపై సుప్రీంకోర్టులో గురువారం విచారణ జరిగింది.
కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు హైకోర్టులో ఊరట లభించింది. సిద్ధరామయ్యపై బీజేపీ దాఖలు చేసిన పరువు నష్టం కేసును న్యాయస్థానం తాత్కాలికంగా నిలిపివేసింది. 2023 ఎన్నికల సమయంలో ‘‘అవినీతి రేటు కార్డు’’ ప్రకటనపై బీజేపీ పరువు నష్టం కేసు దాఖలు చేసింది.
Karnataka: చేయని హత్యకు 2 ఏళ్ల పాటు జైలు శిక్ష అనుభవించిన వ్యక్తి, ఇప్పుడు తనను ఈ కేసులో ఇరికించిన పోలీసు అధికారులపై చర్యలకు సిద్ధమయ్యాడు. తన భార్యను హత్య చేశాడనే ఆరోపణలపై దాదాపు రెండు సంవత్సరాలు జైలు శిక్ష పడిన ఒక గిరిజన వ్యక్తి, తనను తప్పుడు కేసులో ఇరికించిన అధికారులపై రూ.5 కోట్ల పరిహారం, క్రిమినల్ చర్యల్ని కోరుతూ కర్ణాటక హైకోర్టుని ఆశ్రయించాడు.
Bengaluru stampede case: బెంగళూర్‌లో ఆర్సీబీ విజయోత్సవ సభలో తొక్కిసలాట ఘటనపై కర్ణాటక హైకోర్టు ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. తొక్కిసలాట కేసులో అరెస్టులకు సంబంధించిన పిటిషన్లు విచారిస్తున్న సమయంలో రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీసింది. జవాబుదారీతనం కోసం కోర్టు ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చింది. ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన తీరు, దాని పర్యవసానాలపై తీవ్రమైన ప్రశ్నల్ని లేవనెత్తింది. కర్ణాటక ప్రభుత్వం తరపున వాదిస్తున్న అడ్వకేట్ జనరల్ (ఏజీ)ని సూటిగా ప్రశ్నించింది. ఈ ఘటన దర్యాప్తును సీఐడీకి బదిలీ…
18 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ట్రోఫీని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) గెలుచుకుంది. ఎన్నో ఏళ్ల తర్వాత ఐపీఎల్ టైటిల్ గెలుచుకోవడంతో.. బెంగళూరు నగరంలో విక్టరీ పరేడ్, చిన్నస్వామి స్టేడియంలో గ్రాండ్ సెలబ్రేషన్‌కు ప్లాన్ చేశారు. అయితే ఆర్సీబీ విజయోత్సవ వేడుకలో తొక్కిసలాట జరిగి.. 11 మంది ప్రాణాలు కోల్పోగా, 50 మందికి పైగా గాయపడ్డారు. ఈ ఘటన నేపథ్యంలో ఆర్సీబీపై ఎఫ్ఐఆర్ నమోదు కాగా.. కొందరిని అరెస్ట్ కూడా…